*మనసుని కలుషితంచేసే కోరికలే కాదు అనవసరంగా దొర్లే చిన్న మాట కూడా మనని బాహ్యముఖంచేసి శాంతిని దూరం చేస్తుంది.
*అందుకే సాధకులు స్నేహితులు, బంధువులతో కూడా మితంగానే ఉండాలి, ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి.
*సాత్వికత లేనివారి సహచర్యాన్ని, లౌకిక విషయాసక్తిని, సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి.*
*ఎంతమందిలో ఉన్నా దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి.*
*మనసులో ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి.*
ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన *గురుబోధ* మనలో నుండి వినిపిస్తుంది.
*గురు అనుగ్రహం వల్ల కలిగే పరిణామం అంతర్ముఖత్వం,.... మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్ధం.*
*గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం.*
*మన మనసును అనుక్షణం నిగ్రహించుకుంటే గానీ ఇది సాధ్యం కాదు.*
🕉 *సర్వేజనా సుఖినోభవంతు*🕉
🌹🙏
No comments:
Post a Comment