దైవ ధ్యానం అంటే శరీరాన్నీ ఆత్మని రెండిటిని కలపడానికి ఉన్నటువంటి ఒక మాంద్యమం.
మనసు వున్నా శరీరం సహకరించకపోతే అదే విధంగా శరీరం వున్నా మనసు సహకరించకపోతే.
కాబట్టి
పట్టుకోవడం కన్నా వదలగలగడం నేర్చుకోవాలి కొద్దీ కొద్దిగా...
అప్పుడు ఒకేసారి వదలాల్సి వచ్చినప్పుడు అంత బాధ ఉండకపోవచ్చు.
సన్యసించడం అంటే వదిలేయడం అనే కదా.
అలాగే ప్రతి ఒక్కరు ప్రతీరోజు కొంత వదిలేస్తూ ఉండాలి.
ఏమి వదలాలి ఎలా వదలాలి అని ఎవ్వరికి ఎవ్వరు చెప్పక్కర్లేదు.
శివ లింగం మీద ఏది పోసినా కిందకు ఎలా జారిపోతుందో జీవితం కూడా అంతే అని గుర్తుపెట్టుకోవాలి.
ఏది వచ్చిన జారిపోతుంది జారిపోతుంది. అనుకోవాలి. స్థిత ప్రజ్ఞత అలవర్చుకోవాలి.
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
No comments:
Post a Comment