Wednesday, August 20, 2025

 🌿🌿 రోజులు మారాయ్ 🌿🌿

చుట్టూ ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తూ, వంట చేయడం రాని కోడళ్ళ గురించి కబుర్లు వినీవినీ, తమకూ అలాంటి కోడలే వస్తే పడాల్సిన ఇబ్బందుల గురించి ఆలోచించి మనస్సు పాడు చేసుకుంది లత...

" అసలే నా ఆరోగ్యం అంతంతమాత్రం, వచ్చే కోడలికి ఇంటిపని, వంటపని రాకపోతే మొత్తంపని నేనొక్కదాన్నీ చేయలేను .. మరి ఏం చేయాలి " భర్త ప్రసాద్ ని అడిగింది లత...

దూరపు చుట్టం, చెల్లెలి వరుస అయ్యే, కరుణ గుర్తొచ్చింది ప్రసాద్ కి.. 

వ్యవసాయం మీద ఇష్టం తో రైతుని పెళ్ళిచేసుకుంది కరుణ...పల్లెటూరిలోనే స్ధిరపడింది..

కరుణ ఇంటికి వెళ్ళారు లత, ప్రసాద్, వారి అబ్బాయి శ్రవణ్..కరుణ వారిని సాదరంగా ఆహ్వానించింది..పిండివంటలు, ప్రత్యేకమైన వంటలతో వారి కడుపులు నింపేసింది. ఆమెకో కూతురు శాంతి.. శాంతి కూడా పనిమంతురాలు అని లత గమనించుకుంది...శాంతి డిగ్రీ వరకూ చదువుకుంది..

" శాంతికి వంట వచ్చా " అడిగింది లత, కరుణ ని..

దానికి సమాధానంగా ఆ రాత్రికి శాంతి కమ్మని పప్పుచారు పెట్టి , పెసరపచ్చడి రోట్లో రుబ్బి చేసి లత వాళ్ళకి వడ్డించింది..

ఇహ ఆలస్యం ఎందుకని శాంతిని తమ ఇంటి కోడలిని చేయమని అడిగేసారు లత, ప్రసాద్...

" జాతకాలు కుదిరితే చాలు, నాకేమీ అభ్యంతరం లేదు " అన్నది కరుణ...

అలా అద్రృష్టవశాత్తు శాంతి, లత ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది..మారిన రోజులకి తగినట్లు సర్దుకుపోయే అవసరం లేకుండా లత, ప్రసాద్ లు  తమకు తగిన కోడలుని తెచ్చుకున్నారు...

తులసీభాను
బుధవారం
2 : 6 : 2021

సేకరణ 🌹

No comments:

Post a Comment