మానవజన్మ కర్మబద్ధం. కనుక ప్రపంచంలో కర్మనిష్ఠతో ఉండాలి.
అంతరంగంలో బ్రహ్మనిష్ఠలో ఉండాలి. ఇదే మానవ జన్మకున్న విశిష్టత.
హృదయం వెన్న వలె ఉండాలి. కాఠిన్యంతో కాకుండా... కారుణ్య హృదయంతో ప్రపంచంలో సంచరించాలి.
సిద్ధాంత రాద్ధాంతాలు, వాదోపవాదాలు లేకుండా మనీషతో వుండాలి.
మనీష అంటే స్థిరప్రజ్ఞ, స్థిమిత బుద్ధి. ఇది కాదు, ఇది కాదంటూ మనసును ఖాళీ చేసుకుంటూ పూర్ణ చైతన్యంతో ప్రవర్తించాలి.
శాస్త్రాధ్యయనంతో మనసును పరిమళ భరితం చేసి, స్వాదువుగా తీర్చిదిద్దుకోవాలి.
జడాత్మక దేహం అనుభవించే ఏ వికారమూ నీది కాదు. ఎరుకతో ఉండాలి.
దేనికీ అంటక, దేనినీ అంటించుకొనక కాంతి కటకం వలె, తామరపత్రం మీద నీటి బిందువువలె, తెరమీద బొమ్మవలె ఉండాలి.
అంతా బ్రహ్మమే అనుకోగలగటమే అసలైన ముక్తి!
🌹🙏
No comments:
Post a Comment