*అనేక రూపాల నుండి ఏక రూపం!!*
ఈ జగత్తులో మీరు ధరించిన ప్రతి పేరు, ప్రతి పాత్ర, ప్రతి బంధం, ఇవన్నీ భావన అనే మాయా తెరపై కనిపించే తాత్కాలిక ప్రతిబింబాలే.
ఒకరికి మీరు కుమారులు, మరొకరికి తండ్రి, ఇంకొకరికి మిత్రుడు, మరొకరికి గురువు.
కానీ ఇవన్నీ మారే ఉపాధులు మాత్రమే, వాటన్నింటికీ ఆధారమైన ఆత్మతత్త్వం మాత్రం నిత్యమైనది, అవికారమైనది, అద్వితీయమైనది,
*వేదాంతం బోధించేది ఒక్కటే*
"ఏకమేవాద్వితీయం బ్రహ్మ.
" ఒకే సూర్యుడు అనేక జలబిందువులలో ప్రతిబింబించినట్లే, ఒకే పరబ్రహ్మ అనేక జీవరూపాలుగా వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తుంది.
భేదం రూపాలలోనే గానీ, స్వరూపంలో కాదు,
జీవిత పరమార్థం కొత్త వ్యక్తిగా మారడం కాదు, "నేను", "నాది" అనే అహంకార, మమకారాల ఆవరణలను కరిగించి, మన నిజస్వరూపమైన ఆత్మను అనుభవించడమే.
మనస్సు నిశ్చలమై, భావనలు లయమైనప్పుడు, స్వయంప్రకాశమైన పరమాత్మ తానే వెలుగుతాడు.
అదే ప్రతి జీవుని అంతిమ గమ్యం - అనేకత్వం నుండి ఏకత్వానికి, నామరూపాల నుండి నిరాకార సత్యానికి, జీవభావం నుండి బ్రహ్మభావానికి, పరిమితమైన "నేను" నుండి అనంతమైన సత్యం–శివం–సుందరం వైపు చేసే పవిత్ర ప్రస్థానం.
*_🪷శుభమస్తు🪷_*
No comments:
Post a Comment