*దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా; శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా, ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ఠ రూపం. ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీఫ్రాంటల్ విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నిర్ణయ సామర్థ్యం, భవిష్యత్ ఫలితాల అంచనా, సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగు పరుస్తుంది. క్రమబద్ధమైన, లోతైన ఆలోచన మెదడులో న్యూరల్ సంబంధాలను బలపరచి, దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది...*
No comments:
Post a Comment