వాసనలు ఎన్ని విధములు? శుద్ధ వాసన, మలిన వాసన (భాగం - 01) #srividyaprakashanandagiri #yogavasistham
Author Name:TATTWABODHA
Youtube Channel Url:https://www.youtube.com/@Tattwabodha2498
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FkTmWHPBk5Q
Transcript:
(00:00) ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం హరిహి ఓం
(00:47) శ్రీ గురుభ్యోం నమః గత వీడియోలో వాసన అంటే ఏమిటి వాసనలు మరల కర్మలకు ఎలా కారణం అవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకు సుకున్నాం కదండీ ఈ వీడియోలో అసలు వాసనలు ఎన్ని రకాలు వాసనాక్షయం ఆ వాసనా రాహిత్య స్థితిని ఎలా సాధించాలి ఆ వాసనా క్షయాన్ని ఎలా సాధించాలి అనే విషయాలను తెలుసుకుందాంఅండి. చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది వాసనలు అంటే ఏమిటో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నానండి.
(01:30) ఆ వీడియో చూడండి ఆ డీటెయిల్డ్ వీడియో అందరికీ అర్థంఅవ్వడం కోసం డీటెయిల్డ్ గా చెప్పడం జరిగిందండి. అది చూసి ఈ వీడియోకి రండండి ఇంకా క్లియర్ గా మీకు అర్థంవుతుంది. సరేనా అండి. ఇప్పుడు మనము విషయంలోకి వెళ్దాము. వాసనలు ఎన్ని రకాలు వాసనలు అంటే మనసుపై పడే ముద్రలు అని చెప్పాను కదండీ ఈ వాసనలు ఎన్ని రకాలు రెండు రకాలుండి దీనికి యోగ వాశిష్టం చెప్తున్నది అండి వాసన ద్వివిధా ప్రోక్త శుద్ధ మలినా తథ
(02:16) మలిన జన్మనో హేతువు శుద్ధ జన వినాశని అంటున్నది యోగ వాసిిష్టం అంటే వాసనలు రెండు రకాలు ఒకటి శుద్ధ వాసన ఇంకొకటి మలిన వాసన మలిన జన్మనో హేతుహు అంటున్నది. అంటే మలిన వాసనలో జన్మ పరంపరలకు కారణం శుద్ధ జన వినాశని అంటున్నది శాస్త్రం. శుద్ధ వాసనలో జన్మ రాహిత్యానికి కారణం అవ్వగలవు అంటున్నది శాస్త్రం. రెండు రకాలుండి శుద్ధ వాసనలు మలిన వాసనలు మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణం అయితే శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణభూతములండి.
(03:01) ఎలా అంటే ఒక గొప్ప మాట చెప్తారు. ముత్యముల మాల ఉండది చూసారా అండి ముత్యముల మాలకు ఆధారం ఏందండి దారమే కదండీ దారం లేకపోతే ఆ మాలే లేదు. ఆ మాలకి ఆధారం ఏంటిదండి దారం అలానే ఈ శరీరం ఉంది చూసారా అండి ఈ శరీరానికి ఆధారం వాసనలండి చాలా గొప్ప మాట అండి ముత్యముల మాలకు ఆధారం దారము శరీరమునకు ఆధారం వాసనలండి ఇప్పుడు మూలాల్లోకి వెళ్దామండి మూలాల్లోకి వెళ్లి అసలు ఈ వాసనలు మలిన వాసన అంటే ఏమిటి శుద్ధ వాసన అంటే ఏమిటి మూలాల్లోకి వెళ్లి తెలుసు కుందామండి
(03:46) ఎందుకు మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణం అవుతున్నాయి ఎందుకు శుద్ధ వాసన జన్మ రాహిత్యానికి కారణం అవుతున్నది అనేది మూలం మూలం దగ్గరికి వెళ్లి తెలుసుకుందాంఅండి. అసలు మూలంలోకి వెళ్తే ఈ మలిన వాసనలు ఉన్నాయి చూసారా అండి. ఈ మలిన వాసనలు అంటే అనాది కాలంగా అండి. అనాది కాలంగా దేహమే తాను అన్న భావ సంస్కారం ఉంది చూసారా అండి. దేహమే తాను అన్న భావన ఉన్నది చూసారా అండి ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి అనాదికాలంగా దేహమే తాను అన్న భావన ఉన్నది కదండీ మనకి ఆ భావ సంస్కారమే సంస్కారమ అంటే వాసన అండి ఆ భావ సంస్కారమే
(04:31) మలిన వాసన అండి. ప్రతి ఒక్కరికి దేహ వాసన ఉన్నది కదండీ ఈ దేహమే నేను అనే భావన ఉన్నది కదండీ దానినే దేహ వాసన అంటారండి. ఈ దేహ వాసన అజ్ఞానం వల్ల ఏర్పడతదండి ఇది జన్మ పరంపరలకు కారణం అవుతదండి. అందుకే మనకి శాస్త్రము ఒక గొప్ప మాట చెప్తుందది అండి యద్భావం తద్భావతి చాలా గొప్ప మాట అండి ఇది చూడండి దేనిని భావిస్తాడో దానిగానే అవుతాడండి.
(05:03) ఆ భావ సంస్కారం ఉంది చూసారా అండి ఆ మనసులో కదిలే ఆ భావన దాని ఆధారంగానే జన్మలు జన్మల్లో తిరుగుతున్నాడండి ఆ సంస్కారము అతని మనసు యందు ఎటువంటి భావ సంస్కారం అయితే ఉంటుందో దాని ఆధారమైన జన్మనే జీవుడు పొందుతాడండి. మనం చూసుకుంటే ఉదాహరణకి మనకి భాగవతంలో జడభరత ఉపాఖ్యానం ఉంటుంది కదండీ జడభారత ఉపాఖ్యానంలో భరతుడు జింక మీద ఉన్న మమకారంతో ఆ జింక మీద ఉన్న మమకారంతో దేహ అవసాన సమయంలో అంటే ఆ దేహాన్ని వదిలే సమయంలో కూడా జింకనే దాని గురించే చింతన చేస్తూ అదే భావనలో
(05:49) ఉండి దేహాన్ని వదిలిపెడతాడండి ఆ జింక గురించే చింతిస్తూ ఉంటాడు అన్నమాట. చింతిస్తూ చింతిస్తూ అతని మనసు ఆ చింతమ ఆ జింక మీద లగ్నం చేసి ఉంటాడు. అంటే అతని మనసంతా ఆ జింక రూపాన్ని ధరించి ఉంటదండి అతని మనసు ఆ జింక రూపాన్ని ధరించి ఉంటది అండి. అంటే ఏమి లేదండి అతని మనసు ఉంది చూసారా అండి ఆ మనసులో వృత్తి ఆలోచన ఉంది చూసారా అండి ఆ భావం ఆ వృత్తి ఆ ఆలోచన అది జింక రూపాన్ని ధరించి ఉన్నది అండి అతని మనసు జింక రూపాన్ని ధరించి ఉన్నది అని దీన్నే మనకి శాస్త్రంలో తదాకార వృత్తి అంటారండి. తదాకార వృత్తి అంటే మన
(06:36) మనోవృత్తి ఉంది చూసారా అండి మన మనోవృత్తి ఆ వస్తు రూపాన్ని ధరించడం అన్నమాట. తత్ ఆకార వృత్తి అంటే ఆ వస్తు రూపాన్ని మన మనసు ధరించడం మన మనోవృత్తి ఆ వస్తు రూపాన్ని ధరించడం అండి ఇక్కడ ఏమవుతున్నది అతని అవసాన సమయంలో దేహావసాన సమయంలో అతని మనసు ఆ జింక రూపాన్ని ధరించి ఉన్నదండి దాని గురించి చింతన చేస్తూ అతని మనసులో వృత్తి ఆ జింక రూపాన్ని ధరించి ఉన్నది.
(07:06) ఏమైంది ఏమైంది తర్వాత అతని మనసు తదుపరి జన్మలో జింక దేహాన్ని ధరించిందండి జింక దేహాన్ని ధరించి జింక జన్మని తీసుకున్నది. మనకి భాగవతంలో ఉన్నది కదండీ ఈ కథ. ఏమైంది చివరికి అతని మనసు ఆ తద్ అనుగుణమైన దేహాన్ని జన్మని తీసుకున్నది. అందుకే జన్మంలో తిరిగేది దేహాలు ధరించేది మనసేనండి. ఆ మనసు యందు ఎటువంటి భావ సంస్కారం అయితే కదులుతూ ఉన్నదో ఆ భావానికి అనుగుణమైన జన్మ వస్తదండి.
(07:44) మనకి భ్రమర కీటక న్యాయం అని ఉన్నది కదండీ ఒక సిద్ధాంతం ఉన్నది లోకంలో ఈ కీటకము ప్రతిక్షణం ఈ భ్రమరం ఉంది చూసారా అండి భ్రమరం దాన్నే చింతన చేస్తూ తాను కూడా భ్రమరం అయిపోయినట్లు అది కూడా భ్రమరం అయిపోతుదండి నిరంతరం ఆ భ్రమరాన్నే చింతన చేస్తూ ఆ కీటకం కూడా భ్రమరం అయిపోతుదండి. అలాగే ప్రతి మనిషి నిత్యము ఎటువంటి భావ సంస్కారాన్ని తన మనసులో నిలుపుకుంటూ ఉంటాడో తత్ అనుగుణమైన జన్మనే పొందుతాడండి దీనికి శాస్త్ర ప్రమాణం చూద్దామండి దీనికి గీత రెండు అద్భుతమైన శ్లోకాలు చెప్తదండి
(08:29) అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతినాస్తత్ర సంసేహ అంటున్నది భగవద్గీత అంత్యకాలంలో ఎవరు నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు నా స్థితి పొందుతారు. ఇందులో ఏ సందేహము లేదు. యం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అంటున్నది గీత ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి.
(09:00) ఏం చెప్తున్నారు దీంట్లో గీతాచార్యులు ఓ కుంతి పుత్ర మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా వినండి మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావ సంబంధమైన జన్మనే పొందును గీతా వాక్యం అండి పరమ ప్రమాణం ఏం చెప్తున్నారు మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావ సంస్థ ఆ భావ సంబంధమైన జన్మనే పొందును అంటున్నది గీత అదే కదండీ ఇప్పుడు మనం చెప్పుకున్నది మన మనసు యందు ఏ భావ సంస్కారం అయితే ఉంటుందో అటువంటి జన్మనే జీవుడు పొందుతాడండి దీనికి
(09:46) ఇక్కడ ముక్తికోపనిషత్తు ఒక గొప్ప మాట చెప్తది అండి భావితం తీవ్ర సంవేగాత ఆత్మన ఎత్త దేవాసః భవత్యాసు కపి శ్రేష్ట విగతేతర వాసనః అంటుంది ముక్తికోపనిషత్ శ్రీరామచంద్రులు చెప్తున్నారు హనుమంతుల వారితో ఓ కపిశ్రేష్ట ఇతర వాసనలు లేకుండా తీవ్ర సంవేగంతో ఆత్మలో దేనిని భావిస్తాడో అతడు అదే అవుతాడు అంటున్నది ముక్తికోపనిషత్ ఒక గొప్ప మాట చెప్తున్నాడండి ఇతర ఆలోచనలు పక్కన పెట్టి ఒకే దృఢమైన ఆలోచనపై మనసు నిలిపి గట్టి భావనతో ఒకే ఒక్క వాసనని ధ్యానించేవారు చివరకు అదే అవుతాడు అంటున్నదండి శాస్త్రం ఇప్పుడు ఈ వాసనల దగ్గరికి వద్దామండి మలిన
(10:33) వాసన గురించి మాట్లాడుతున్నాను కదండీ ప్రధానమైనది దేహ వాసన అండి ఈ దేహమే తాను అన్న ఆ తాదాత్మ భావన ఉన్నది చూసారా అండి అది మలిన వాసన అండి అసలు ఈ మలిన వాసనలు ఎలా ఏర్పడతాయి అండి ఈ మలిన వాసనలు అజ్ఞానం చేత మనసులు ఏర్పడతాయండి అజ్ఞానం అండి అజ్ఞానం చేత ఈ మలిన వాసాలు అనేవి ఏర్పడతాయండి అందుకే చెప్తారన్నమాట ఈ మలిన వాసాలు ఉంటాయి చూసారా అండి ఇవి అజ్ఞానం అనే క్షేత్రంలో మొలకెత్తి జన్మ పరంపరలనే వృక్షాలకు ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తాయి అని
(11:18) చెప్పేసి శాస్త్రం అన్నమాట అజ్ఞానం వల్లేనండి జీవుడు జన్మలు ఎత్తేది ఈ జన్మలో జన్మల్లో తిరుగుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట వీటన్నిటికీ మూలం అజ్ఞానం అండి ఈ అజ్ఞానం వలనే ఈ మలిన వాసనలు అనేవి జీవుల యొక్క చిత్తములో స్టోర్ అవుతున్నాయండి. అతి పెద్ద మలిన వాసన ఏందంటే ఈ దేహమే నేను ఈ దీన్నే దేహ వాసన అంటారండి.
(11:50) ఈ వాసన అత్యంత ప్రమాదకరమైందండి. ఈ వాసన వలనే జీవుడు అనేక కర్మలను చేస్తున్నాడు. ఈ కర్మలు మరల అనేక జన్మలకు కారణం అవుతున్నాయి. మూలంలోకి వెళ్తే ఇదేనండి ఈ దేహ వాసన ఉన్నది చూసారా అండి ఇది అత్యంత ప్రమాదకరమైన వాసన అండి. మరి ఈ మలిన వాసనలు ఉన్నాయి చూసారా అండి ఇవి తొలగి జన్మహిత్యం ఇక మరలా జన్మ లేని స్థితి పొందాలి అంటే ఎలా ఏం చేయాలి దానికి శాస్త్రం చెప్తున్నది అండి జ్ఞానాన్ని పొంది మనసు యందు ఉన్న మలిన వాసనలు తొలగించుకొని వాటి స్థానంలో శుద్ధ వాసనలు
(12:38) ఈ శుద్ధ వాసన బీజాలు చిత్తమ అనే క్షేత్రమ నాటుకోవాలి అని చెప్పేసి చెప్తున్నదండి శాస్త్రం మలిన వాసనలు తొలగించి వాటి స్థానంలో శుద్ధ వాసనలు శుద్ధ వాసనలు జన్మ పరంపరలకి కారణం కావు జన్మ రాహిత్యానికి కారణం అవుతాయండి. యోగ వాశిష్టం చెప్తున్నది శుద్ధ జన వినాశని అని ఈ శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణం అండి ఎందుకంటే ఈ శుద్ధ వాసన ఉన్నది చూసారా అండి ఆ వాసనకు సంబంధించిన సంస్కారము ఆ వృత్తి ఆ భావన మన మనసులో కదిలినప్పుడు అది మరల జన్మ పరంపరలకు హేతువు కాదండి.
(13:20) శుద్ధ వాసనలతో అతను దేహాన్ని గనుక వదిలితే అది మరలా జన్మ పరంపరలకు కారణం కాదు ఎందుకంటే దేనినైతే చింతన చేస్తూ దేహాన్ని వదులుతాడో సంబంధమైన భావ సంబంధమైన జన్మనే పొందుతాడు అని గీత వాక్యం కదండీ. సో అతను మలిన వాసనతో ఉండి దేహమే తాను అన్న భావనలో ఉండి లేదా ఈ ప్రాపంచిక విషయాల మీద దృష్టిని పెట్టి ఏదైనా ఒక విషయం మీద ఈ శరీరం కూడా విషయమే కదండీ ఏదైనా ఒక విషయం మీద దృష్టిని పెట్టి దానినే చింతన చేస్తూ దేహాన్ని వదిలితే తత్సంబంధమైన జన్మనే పొందుతాడండి అదేవిధంగా ఈ శుద్ధ వాసనలో ఉన్నాయి చూసారా అండి ఈ శుద్ధ వాసన సనా
(14:05) భావాలు మనసు యందు కదిలి ఈ భావ సంబంధమైన వాసనతో అతను దేహాన్ని వదిలితే అతనికి మరలా జన్మ రాదండి ఎందుకు రాదు ఏమిటి ఆ శుద్ధ వాసనలు తెలుసుకుందాంఅండి మలిన వాసనలు అజ్ఞానం వల్ల ఏర్పడతాయి అని చెప్పాను కదండీ ఇప్పుడు ఈ శుద్ధ వాసనలు ఆపోజిట్ అండి మలిన వాసనలకి పూర్తిగా ఆపోజిట్ ఇవి జ్ఞానం వల్ల ఏర్పడతాయండి. శుద్ధ వాసనలు జ్ఞానం వల్ల ఏర్పడతాయండి.
(14:42) ఈ శుద్ధ వాసనలు అనగా ఈ బ్రహ్మ సత్యం జగన్ మిత్య జీవో బ్రహ్మైవ నాపరః బ్రహ్మమే సత్యము ఈ జగత్తు మనం చూసే ఈ జగత్తు మనం అనుభవించే సత్యం అనుకునే ఈ జగత్తు మిత్య సత్యం కాదు వ్యవహారిక సత్యం అని తెలుసుకొని ఎవరైతే జీవో బ్రహ్మైవనాపరః ఈ జీవుడే సాక్షాత్ బ్రహ్మము అని తెలుసుకొని ఎవరైతే ఆ బ్రహ్మ భావనలో ఆత్మ ఆత్మ విచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆ బ్రహ్మ భావనలో నిండి ఉంటారో వారి మనసు యందు అతను ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది ఉంటాడో ఆ
(15:27) అనుభూతి అండి ఆ బ్రహ్మానుభూతిని ఆ అపరోక్షానుభూతిని ఎవరైతే పొంది ఉంటారో జ్ఞానం ద్వారా అతడు ఆ అనుభవాన్ని పొందారు కదండీ ఆ అనుభవాన్ని పొందినప్పుడు ఆ అనుభవం అతని మనసు యందు వాసనగా ఏర్పడుతుంది అన్నమాట అదియే శుద్ధ వాసన అండి తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మ నిష్టలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మానుభూతి ఉన్నది చూసారా అండి అది అతని మనసు యందు వాసనగా ఏర్పడుతదండి అదియే శుద్ధ వాసన అది ఎలా ఏర్పడుతుందిఅండి జ్ఞానం వలనే
(16:12) కదండీ జ్ఞానం వలనే ఈ శుద్ధ వాసనలు అనేవి ఏర్పడతాయండి. అజ్ఞానం చేత ఈ దేహమే నేను అన్న మలిన వాసన ఏర్పడితే జ్ఞానం చేత ఈ దేహ ఇంద్రియ ప్రాణ మనోభుత్తులు తాను కాను వీటన్నింటిని చూసే ఆ సాక్షి ఉంది చూసారా అండి ఆ సాక్షి ఆ తురియుడైన ఆ బ్రహ్మము తాను అన్న ఎరుక కలుగుతుందండి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పొందుతాడో ఆ అనుభవము అతని మనసులో వాసనగా ఏర్పడుతుందండి శుద్ధ వాసనగా ఏర్పడుతుంది.
(16:58) ఈ శుద్ధ వాసనలు ఉన్నాయి చూసారా అండి ఇవి వేయించబడిన గింజలు వంటివి అండి ఒక గింజలు ఉన్నాయి చూసారా అండి గింజలు వేయిస్తే ఇవి మరలా మొలకెత్తుతాయండి. మొలకెత్తవు పచ్చి గింజలు మీరు భూమిలో నాటితే అవి మరల మొక్కలుగా మొలకెత్తుతాయి కానీ వేయించిన గింజలు మరల మీరు నాటండి క్షేత్రంలో మరల మొలకెత్తవండి. అలానే ఈ శుద్ధ వాసనలు ఉన్నాయి చూసారా అండి ఇవి వేయించబడిన గింజల వంటివండి అవి మరలా మొలకెత్తవు అంటే మరల జన్మ పరంపరలకు కారణం కావండి.
(17:30) మరల ఇంక జన్మలకు అవి హేతువులు కావు కానీ మలిన వాసనలు అలా కాదండి. అవి జన్మ పరంపరలకి హేతువులు అవుతాయి. చెప్పాను కదండీ జ్ఞానం వలన ఈ శుద్ధ వాసనలు ఏర్పడతాయని ఈ జ్ఞానం అనే అగ్నిలో జ్ఞానాగ్ని దగ్ద కర్మానం అంటున్నది గీత ఈ జ్ఞానం అనే అగ్నిలో వాసనలు ఈ వాసనలు అనే గింజలను గనుక వేయిస్తే వేయించిన గింజలు మళ్ళీ మొలకెత్తవు అని చెప్పాను కదండీ ఈ జ్ఞానం అనే అగ్ని ఈ జ్ఞానం అనే అగ్నిలో వాసనలు అనే గింజలను వేయిస్తే అవి ఇక మరల మొలకెత్తవు అంటున్నది శాస్త్రం గీత కూడా అదే చెప్తున్నది అండి జ్ఞానాగ్ని దగ్ద కర్మ
(18:15) జ్ఞానమయ అగ్ని సమస్త కర్మల్ని భస్మం చేస్తున్నది అంటుంది. ఎందుకంటే మనం చేసిన కర్మలే కదండీ మనం చేసిన కర్మలే వాసనలుగా చిత్తంలో ముద్రించకపోతున్నాయి. కర్మ చేసినప్పుడు ఆ ముద్రలే మన మనసు యందు వాసనలుగా నిక్షిప్తం అవుతున్నాయి కదండీ సో ఈ వాసనల్ని జ్ఞానం అనే అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానం అనే అగ్నిలో ఉయిస్తే ఇక అవి మరలా మొలకెత్తవండి ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ
(18:59) తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతిహి ఆ
No comments:
Post a Comment