Monday, April 27, 2026

అంతిమ యాత్రలో మూడు కోతులు? #satyanandiraju #sanatandharma #hindu #ytviral #ssdtc #devotional

అంతిమ యాత్రలో మూడు కోతులు? #satyanandiraju #sanatandharma #hindu #ytviral #ssdtc #devotional

Author Name:Satya Sanatana Dharma Telugu Channel

Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KHICgNWPtow



Transcript:
(00:00) శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు ఒక చిన్న పిల్లవాడిని పుట్టు వెంట్రుకలు తీయించాలి గజ్వేల్ లో ఉన్న మేనమా ఇంటికి వెళ్ళాలి అన్నారు ఇంట్లో వారు ఆ పిల్లవాడు అన్నాడు వద్దు వద్దు మావయ్య ఇంటికి వద్దు మనం ధర్మపురి లో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఒక మహనీయుడు నాకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పాడు పిల్లవాడికి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి అంత చిన్న పిల్లవాడికి ఎక్కడో ఒక దివ్య క్షేత్రంలో ఉన్న మహనీయుడు గురించి ఎలా తెలిసింది అది తనకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఎలా తెలిసింది ఒకసారి కుటుంబం మొత్తం కూడా
(00:35) మధురా వెళ్ళారు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ఒక పండు ముత్తైదువ ఆరతి పళ్ళంతో వచ్చి పూలమాల ఈ యోగి మెడలో వేసి హటాత్తుగా అదృశ్యమైపోయింది. అప్పుడు ఏం జరిగింది ఈ యోగి యొక్క అంతిమ యాత్రలో మూడు కోతులు కోలాహలం చేసినయి ఏం చేసినాయి వీడియోగ్రాఫర్లు వీటిని కెమెరాల్లో బంధించాలని ఎంత ప్రయత్నించినా కూడా అప్పుడు ఏం జరిగింది ఇలాంటి వింతలు విశేషాలు ఈ యోగి యొక్క జీవితంలో చాలా చాలా జరిగినాయి. ఈయన యోగే కాదు అవధూత కూడా.
(01:12) మన హైదరాబాద్ కి సుమారు ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ యోగి యొక్క తపోవభూమి ఉంది. ఎక్కడ ఉంది యోగి యొక్క జీవితం ఏమిటి ఇలాంటి ఎన్నో విశేషాలు ఇవాళ మనం సత్సంగం చేసుకుందాం. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. మనలాంటి అప్ కమింగ్ ఛానల్స్ కి హైప్ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
(01:38) ఈ సత్సంగంలో మనం చాలా శ్రద్ధగా పాల్గొని ఆ యోగి యొక్క ఆశీసులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీసులు మెండుగా పొందేద్దాం. ఇంకెందుకు ఆలస్యం సత్సంగం చేసుకుందాం పదండి. వరంగల్ జిల్లా చేర్యాల మండలం మరిముత్యాల గ్రామం అక్కడ వెంకటరామశాస్త్రి రాదమ్మ అనే ఒక పుణ్య దంపతులు ఉన్నారు. వారికి పుట్టినటువంటి యోగే నేను ఇందాక చెప్పిన ఆ పిల్లవాడు. పేరు నరసింహ స్వామి.
(02:03) అవును మనం ఎవరి గురించి సత్సంగం చేసుకోబోతున్నాము అంటే మరిముత్యాల సాంద్రానంద నరసింహ స్వామి అనే ఒక యోగి అవధూత గురించి ఇవాళ మనం సత్సంగం చేసుకోబోతున్నాం. వీడు జన్మించింది 1927 ఆగస్టు 28వ తారీకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పిల్లవాడి ప్రవర్తన వింతగా ఉండేది. అంటే అందరితో ఆడుకోవాల్సిన వయసులో ఒళ్ళంతా భస్మం పూసుకుని ఒక కౌపీనం పెట్టుకుని ఎక్కడో మూల కూర్చుని పద్మాసనంలో ధ్యానంలో ఉండేవారు అంతేకాదు చిన్నప్పటి నుంచి కూడా వాక్సిద్ధి వాక్శుద్ధి రెండు ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా భయపడిపోయేవారు ఎందుకు నరసింహతో గొడవలు పెట్టుకోవడం ఏం
(02:43) చెప్తే అది చేయండి అని చెప్పి వారు కూడా భయపడేవారు అంతటి వాక్ సిద్ధి వాక్శుద్ధి ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను చూసారా పుట్టు వెంట్రుకల కోసం గజ్వేల్లో మేనమామ ఇంటికి వెళ్ళాలంటే కాదు ధర్మపురిలో నరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలని చెప్పాడు ఆ పిల్లవాడిని అది నమ్మి నిజంగానే ఆ కుటుంబంలోని పెద్దలు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ధర్మపురికి తీసుకువెళ్ళారు నిజంగానే అక్కడ ఒక మహనీయుడి పిల్లవాడి కోసం కాచుకొని కూర్చున్నాడు చూడంగానే చాలా ఆప్యాయతతో దగ్గరకి తీసుకొని ముద్దాడి వచ్చావా నాయనా అన్నాడు ఆ మర్నాడే ఆ యోగి అంటే ఆ మహనీయు ఈ పిల్లవాడికి కేసికండన దగ్గరుండి
(03:22) జరిపించాడు. ఈ సంఘటనలు బట్టి మనక ఏం తెలుస్తుంది అంటే ఈ యోగి స్వతహాగా అంటే జన్మతః ఒక పూర్ణమైనటువంటి యోగిగా సిద్ధుడిగా అవధూతగా జన్మించాడు. కేవలం ఏదో ప్రయత్న పూర్వకంగా సాధన చేసి ఆ స్థితికి రాలేరు ఎన్నో జన్మల సాధన ఈ జన్మలో ఒక పరిపక్వత పొంది ఆ అత్యున్నత స్థితికి చేరుకుంది వీరు జన్మతః పూర్ణమైనటువంటి యోగి సిద్ధులు అని మనం చెప్పుకోవాల్సిందే ఒక్కోసారి భోజనానికి ఇష్టమైతేనే వచ్చేవాడు కొన్ని రోజులు అసలు భోజనం చేసేవాడు కాదు ఒక్కోసారి 10 మంది కోసం వండిన వంటని మొత్తం కూడా ఒక్కడే కూర్చుని తినేసేవాడు ఇలాంటి ఇలాంటి వింతలు చాలా చాలా చేశాడు
(04:07) బాల్యంలో సరే ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది ఉపనయనం చేశారు రోజుకి శతరుద్రం చేసేవారు అలాగే కేవలం కొన్ని ఏళ్ల నుంచి భిక్షాటం చేసుకుని ఆ వచ్చిన దాన్ని స్వయంగా వండి పరమేశ్వరుడికి లింగోద్భవ కాలంలో నిత్యం కూడా నివేదన చేసేవారు అలా నియమ నిష్టలతో కొన్ని సంవత్సరాలు నిరంతరాయంగా చేసిన తర్వాత పరమేశ్వరుడు స్వప్నంలో కనిపించి నువ్వు ఉపవసించడం వల్ల ల కొన్ని భూతములకు కూడా ఉపవాసం ఉండాల్సి వస్తుంది.
(04:41) కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి ఉపవాసం మానివేసి నిరతాన్ అన్నదాన కార్యక్రమాన్ని నువ్వు చేపట్టాలని చెప్పి పరమేశ్వరుడు ఆదేశించారు. అప్పటినుంచి కూడా ఈ నరసింహం గారు ఉపవాసం మానివేసి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత ఒకసారి రాధమ్మ గారు అంటే వీరి తల్లిగారు లక్షపత్రి పూజ చేశారు. సరే పూజ అయిపోయిన తర్వాత ఆ పత్రి అంతా కూడా పారవేయబోతూ ఉంటే నరసింహం గారు ఎందుకు పారేస్తున్నారు ఇటు తీసుకురండి అని చెప్పి ఆ పత్రిని అంతా కూడా ఒక ఉప్పు నీటి బావిలో వేసి మంచి నీటి బావిగా మార్చేశారు.
(05:16) అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది కేవలం ఈ పిల్లవాడు మన కోసం పుట్టలేదు కుటుంబం కోసం పుట్టలేదు లోకం కోసం పుట్టాడు అని తర్వాత ఒక బంధువు కూడా మృత్యు ముఖంలో ఉంటే తులసి తీర్థంతోనే తిరిగి మళ్ళీ ప్రాణం పోశారు నరసింహం గారు చిన్నప్పుడే ఇవన్నీ కూడా ఎనిమిది సంవత్సరాల వయసులో జరిగినటువంటి లీలలు. నరసింహం గారు చిన్నప్పుడే సిద్ధుల గుట్ట మీద మూడు సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేశారు అని చెప్తారు నిత్యం కూడా దానికి గిరి ప్రదక్షణ చేసేవారట.
(05:45) నేను ఇందాక భూతాలు అని చెప్పాను కదా పరమేశ్వరుడు కల్లో కనిపించి చెప్పారు అని భూతాలు అంటే దుష్టశక్తులు అని కాదు దైవగణాలు శివగణాలు అని చెప్పి అర్థం సరే వీరికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు తగిన కన్య కోసం అన్వేషిస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరట్లే ఎవరిస్తారు పిల్లల్ని వీరి వేషభాషలన్నీ వింతగా ఉండేవి ఎందుకంటే నిజమైన యోగి అవధూత ఎప్పుడూ కూడా ఈ సమాజంలో ఒక పిచ్చివాడిగానే కనబడతారు సరే ఎవరు కూడా పిల్లని ఇవ్వటంలే తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఈ పరిస్థితి అంతా గమనిస్తున్నారు నరసింహం గారు సరే తండ్రి గారిని పిలిచి మీరు బాధపడవద్దు మీరు చేరియాల వెళ్ళండి అక్కడ దేశపతి వెంకట
(06:28) రామయ్య గారు అని చెప్పి ఒక గృహస్తుడు ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళండి నాకు తగిన కన్య మీకు దొరుకుతుంది అని చెప్పి పంపించారు. నిజంగానే ఆ దేశపతి వెంకటరామయ్య గారి ఆరవ సంతానం సత్యమ్మ గారితోనే నరసింహమ్మ గారికి తన 17వ ఏట వివాహం జరిగింది. వీరికి ఏడుగురు సంతానం 1962వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వీరి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి సత్యమ్మ గారితో అంటే నరసింహం గారి భార్యతో రేపటి నుంచి నరసింహాన్ని నా వైపు తిప్పుకుంటున్నాను ఇక నుంచి సంసార బాధ్యత నీదే అని చెప్పి
(07:12) అంతర్హీతులు అయిపోయారు. నేనైతే అనుకుంటాను ఇటువంటి మహనీయులు యోగులు యొక్క జీవితాలు పది మందిలోకి వెళ్లి వారు పూజనీయులుగా ఉన్నారు అంటే ప్రధాన కారణం సత్యమ్మ గారి లాంటి పతివ్రతామ్మ తల్లులే వారందరికీ కూడా పాదాభివందనాలు సరే మరనాటి నుంచి కూడా నరసింహం గారి ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది తీవ్ర వైరాగ్యంతో ఉండడం మొదలు పెట్టారు ఒక్కోసారి గట్టిగా నవ్వేవారు ఒక్కోసారి గట్టిగా కోప్పడేవారు ఒక అవధూత లాగా మారిపోయారు ఐదే ఐదు నిమిషాల్లో లో ఆ మరుముతాల గ్రామాన్ని వాయువేగంతో చుట్టి వేసేవారు అదే సమయంలో పక్కనున్న గ్రామాల్లో కూడా కనిపించేవారు ఒకే సమయంలో ఇదంతా కూడా
(07:55) ప్రజలు వింతగా చెప్పుకునేవారు నెమ్మదిగా వారి శక్తులు జనాలకు తెలియడం మొదలు పెట్టారు ఇంక అంతే తండోప తండాలుగా స్వామి వారి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. కేవలం మరుముత్యాల గ్రామంలోని ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వారి దగ్గరికి వచ్చేవారు అంటే ఈ రోగ్రస్తులు కానీ లేదా సంసారంలో ఏమన్నా బాధలు ఉన్నా లేకపోతే సంతానం లేకపోయినా నిరుద్యోగమైన కోర్టు కేసులు అయినా ఎవరైనా వచ్చి స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకోవాల్సిందే అలాగే స్వామి వారు ఎన్నో ధార్మికమైనటువంటి సేవలు చేసేవారు నిత్య అన్నదాన కార్యక్రమాలు అలాగే అఖండ రుద్ర సప్తాహం అఖండ
(08:33) కుంకుమార్చన హోమాలు యజ్ఞాలు ఒకటి కాదు అలాగే ప్రత్యేకంగా ఈ దత్త జయంతికి గురుపూర్ణమికి స్వామి వారి యొక్క జయంతి సందర్భంగా అద్భుతంగా ఉత్సవాలు ఈ మరుముత్యాల గ్రామంలో జరిగేవి. తెల్లవారుజామున చాలామంది భక్తులు వీరి దగ్గరికి వచ్చేవారు తమ కోరికలను చెప్పుకొని తీర్చుకోవడానికి వారు కోపంతో ఊగిపోయేవారు తిట్టేవారు కానీ ఆ తిట్టులు భక్తులకు కాదు ఆ భక్తుల కోరికలకు అడ్డుపడే విఘ్నాలని అలా ఆ విఘ్నాలను తొలగించి భక్తుల కోరికలను తీర్చేవారు అందుకే తండోప తండాలుగా భక్తులు రావడం మొదలు పెట్టారు.
(09:10) ఎప్పుడైనా ఎక్కడైనా ధార్మిక కార్యక్రమానికి వాన ఏమన్నా అడ్డంకిగా ఉంటే ఎంత జడి వాననైనా కూడా వారి యోగబలంతో ఆపేసేవారు అలాగే ఎవరైనా అతిధులు ముందుగానే వస్తుంటే దివ్య దృష్టితో చూసి చెప్పేవారు వారికి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పి వారి శిష్యులను ఆదేశించేవారు అంతటి దివ్య దృష్టి ఉండేది వారికి ఎవరైనా ఫోటోగ్రాఫర్లు వీరి అనుమతి లేకుండానే ఫోటోలు తీస్తే మాత్రం స్వామి వారు అసలు వచ్చేవారు కాదు ఆ ఫోటోలో కనబడేవారు కాదు ఒకసారి ఒక ఫోటోగ్రాఫర్ వీరి అనుమతి తీసుకొని ని ఫోటో తీశారు ఆ ఫోటో చాలా బాగా వచ్చింది.
(09:45) వెళ్లి వీరి తండ్రి గారు వెంకటరామశాస్త్రి గారిని అడిగాడు ఆ ఫోటోగ్రాఫర్ ఆ ఫోటో కింద ఏం పేరు పెట్టమంటారు అని అప్పుడు వారు అట్లా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఏం చెప్పారు అంటే సాంద్రానంద ఘన స్వరూప శ్రీ శ్రీ నరసింహ స్వామి అని చెప్పి రాయి అన్నారు. అట్లా నరసింహం గారికి సాంద్రానంద స్వామి అని సాంద్రానంద నరసింహ స్వామి అని చెప్పి వారి తండ్రి ద్వారానే ఆ పేరు వచ్చింది.
(10:10) నేను ఇప్పుడు చెప్పే మూడు ఉదాహరణలు వారి యొక్క యోగస్థాయి ఏమిటో చెప్పబోతున్నాయి. 1955లో కుటుంబం అందరితో కలిసి నరసింహం గారు ఉత్తర భారతదేశ యాత్రలకు వెళ్ళారు మధురా వెళ్ళారు హటాత్తుగా ఒక ముత్తైదువ ఎదురు వచ్చి హారతి పళ్ళెంతో హారతి ఇచ్చి ఒక పూలమాల నరసింహం గారి మెడలో వేసి గోపాలకృష్ణ వచ్చావా అని చెప్పి ఒక నవ్వు నవ్వి ఒక నాలుగు అడుగులు వేసిందో లేదో మాయమైపోయింది.
(10:44) స్వామి వారితో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు సత్యమ్మ గారు కూడా పక్కనే ఉన్నారు వారి భార్య వారందరూ అడిగారు ఎవరు ఆవిడ అంటే నరసింహం గారు ఒక చిరునవ్వు నవ్వి నాకు మాత్రం ఏం తెలుసు అన్నారు. దీని తర్వాత వీరి దగ్గర ఒక భక్తుడు ఉన్నాడు. నిత్యం కూడా తన ఇంట్లో అంటే నిత్య పూజలో భగవంతుడికి దజ్యోధనం పెట్టేవాడు అంటే పెరుగన్నంతో కూడినటువంటి నివేదన ఒకసారి స్వామి వారి దగ్గరికి రాగానే ఆ భక్తుడిని చూస్తూ నరసింహం గారు ఏమయ్యా నువ్వు పెట్టే దజ్యోధనం చాలా రుచిగా ఉంది నేను తిన్నాను అన్నారు ఇంకో ఉదాహరణ ఇంకో భక్తుడు స్వామివారి దర్శనం కోసం అంటే నరసింహం గారి దర్శనం
(11:26) కోసం మరుముత్యాలు వస్తున్నాడు వస్తుండే దారిలో కందిరీకలన్నీ కూడా వెంటపడం మొదలుపెట్ట కుట్టడం మొదలు పెట్టినాయి ఒక్కసారి గట్టిగా స్వామి వారిని తలుచుకుని ఒక అరుపు అరిచాడు. అప్పుడు వెంటనే ఆ కందిరీగలు అన్నీ కూడా పారిపోయినాయి కానీ అప్పటికే కుట్టేసినాయి కదా ముఖం అంతా కూడా వాచిపోయినాయి అదే బాధతో ఆశ్రమానికి వెళితే స్వామివారు చూసి నరసింహం గారు పెద్దగా పెట్టిన నవ్వారు ఆ నవ్వుతో ఆ భక్తుడు యొక్క బాధ మొత్తం పోయింది.
(11:58) ఈ మూడు దృష్టాంతాలు తీసుకుంటే వారు కేవలం ఒక యోగి మాత్రమే కాదు సాక్షాత్తు ఆ పరమాత్మతో తాదాత్మ చెంది పరమాత్మగా మారిపోయినటువంటి మహా యోగి సాంద్రానంద నరసింహ స్వామి వారు అలా నరసింహం గారు తమ యోగ బలంతో భక్తులను రక్షించేవారు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా రక్షిస్తున్నారు. అలా 1996 జూలై నుంచి వారి శరీరం కొంచెం కృషించడం మొదలు పెట్టింది.
(12:26) అంటే జూలై లో అంటే ఒక రెండు మూడు నెలల ముందే వారి రెండో కొడుకుతో చెప్పేశారు నరసింహం గారు నా శరీరాన్ని దేవతలు అడుగుతున్నారు అని అంటే అంత మంత్ర బలంతో యోగ బలంతో వారి శరీరం పునీతమైపోయింది. ఆఖరికి 1996 ఆగస్టు 9 ఆషాడ బహుళ ఏకాదశి శుక్రవారం రాత్రి 10 గంటలకు తమ దివ్య శరీరాన్ని వదిలివేసి బ్రహ్మీభూతులు అయిపోయారు. మర్నాడు వారి అంతిమ యాత్రలో ఒక విచిత్రం జరిగింది.
(12:58) ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఒక మూడు కోతులు వారి అంతిమ యాత్ర అసాంతం కూడా ఆ చేతికి వచ్చిన పూల్ని వారి దివ్య శరీరం మీద విసురుతూనే ఉన్నాయి. అంటే మన కంటికి అవి కోతులుగా కనిపించవచ్చు కానీ వారు ఏ మహాయోగులో ఏ దేవతా శక్తులో ఎవరికీ తెలుసు ఆ నరసింహం గారికి ఆ భగవంతుడికే తెలియాలి. వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు కూతుల్ని తమ కెమెరాలో బంధించాలని చాలా ప్రయత్నం చేశారు గానీ ఎక్కడ వీడియోలో కానీ ఫోటోల్లో కానీ అవి ఎక్కడా కనబడలే వారికి అగ్ని సంస్కారం జరిగింది వారి అస్తికలను కొన్ని భద్రపరిచి ఈనాటి మందిరంలో ప్రతిష్టించారు. ఆశ్రమం చాలా
(13:42) బాగుంటుంది. స్వామివారు అంటే నరసింహం గారి దివ్య మంగళ స్వరూపం అసలు ఎంత ఆకర్షణగా ఉంటుందంటే చూస్తే సాక్షాత్తు అక్కడ స్వామివారు కూర్చున్నారా అనిపిస్తుంది. అంతటి గొప్ప తపోభూమి ఆ మర్రిముత్యాలలో ఆ సాంద్రానంద నరసింహ స్వామి వారి యొక్క ఆశ్రమం హైదరాబాద్ నుంచి కేవలం ఒక 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది వరంగల్ జిల్లా చేర్యాల మండలం మర్రిముత్యాల గ్రామం అక్కడికి ఎలా వెళ్లాలో నేను డిస్క్రిప్షన్ లో వివరాలు అన్నీ ఇస్తాను మీరు కంగారుపడవద్దు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చక్కగా కుటుంబంతో వెళ్లి ఆ తపోభూమిలో ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు స్వీకరించండి
(14:18) ఎవరికి తెలుసు ఆ తపోభూమిలో అడుగుపెట్టిన తర్వాత మన కష్టాలు ఎలా తీరుతాయో మన కోరికలు ఎలా తీరుతాయో లేదా మన సాధనలు ఎలా ముందుకు వెళ్తామో ఎవరికీ తెలుసు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా ఆశ్రమాన్ని దర్శించండి ఆ వివరాలన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ నరసింహ స్వామి వారి యొక్క ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.
(14:45) ఈ సత్సంగం మీ అందరికీ నచ్చినట్లైతే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి. ఇంకోటి ఏమిటంటే ఇప్పటికీ కూడా మన వ్యూవర్స్ అంటే ఈ సత్సంగంలో పాల్గొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్న వారి సంఖ్య ఇంకా 50% పైనే ఉంది కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నది ఏమిటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నాకు మరింత ఉత్సాహం వస్తుంది నేను ఇంకా మరింతమంది యోగుల యొక్క చరిత్రలు సత్సంగాలు చేసుకునేటువంటి అవకాశాన్ని నేను పొందగలుగుతాను.
(15:18) సరేనా మరొక అద్భుతమైన సత్సంగం మనందరం మళ్ళీ కలుద్దాం శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు.

No comments:

Post a Comment