Why Men Lie to Women? The Logic Behind the Confusion | Nagna Satyam Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MdkLa_CHtaE
Transcript:
(00:01) అసలు ఒక మగాడు ఒక ఆడదాన్ని ఎందుకంతలా కన్ఫ్యూజ్ చేస్తాడు అనే పాయింట్ దగ్గరికి వస్తే అక్కడ లాజిక్ లేదు కేవలం ఒక సైకలాజికల్ డిసార్డర్ మాత్రమే కనిపిస్తుంది. [సంగీతం] గమనిస్తే ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవికి ఒక క్లారిటీ ఉంటుంది. పులికి ఆకలేస్తే వేటాడుతుంది. పాముకి భయం వేస్తే కరుస్తుంది. కానీ ఈ హోమోసేపియన్ మేల్ అనేవాడు మాత్రం తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని ఒక అయోమయ స్థితిలో బతికేస్తుంటాడు.
(00:32) చరిత్రలో చూసుకుంటే కొన్ని వేల యుద్ధాలు లక్షల హత్యలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఎదుటి మనిషి మనసుని అర్థం చేసుకోలేక తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి వాడు ఎంచుకున్న వైలెన్సే. ఒక స్త్రీకి కావలసింది ఒక చిన్నపాటి నిజాయితి. కానీ ఆ నిజాయితీని ఇవ్వడానికి మగాడి దగ్గర ఉన్న ఈగో అడ్డువస్తుంది. వాడు తన బలహీనతలని దాచుకోవడానికి ఒక పెద్ద కంచు కోటను కట్టుకుంటాడు.
(01:01) ఆ కోట గోడల మధ్య తనే ఒక ఖైదీగా మారిపోతున్నాడు అన్న సత్యం వాడి బుర్రకఎక్కదన్నమాట. యాక్చువల్ [సంగీతం] గా కమ్యూనికేట్ చేస్తున్నాను అనుకుంటాడు కానీ వాడు చేసేదంతా కేవలం ఒక అర్థం లేని అరుపులు మాత్రమే. మొదట్లో వేటగాడిగా మొదలైన మగాడి ప్రయాణం ఈరోజు ఒక ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా ఆ పాత ఆటవిక వాసనల్ని వదులుకోలేకపోతుంది. వాడికి కావలసింది డామినేషన్ ఎదుకి మనిషి తన కళ్ళలోటి చూసి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేయడం వాడికి ఉన్న ఒక జబ్బు అది.
(01:33) ఆ కన్ఫ్యూజన్ అనేది వాడు కావాలని చేసేది కాదు తన dఎన్ఏ లోనే ఆ లోపం ఉంది. ఒక స్త్రీ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే వాడు దాన్ని ఒక త్రెట్ లాగా చూస్తాడు. అంటే ఒక ప్రమాదంలా ఫీల్ అవుతాడు. అక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ ఒక అగాధంలా మారిపోతుంది. నెపోలియన్ దగ్గర నుండి హిట్లర్ దాకా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించిన వీరులందరూ తమ ఇంటి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కేవలం ఒక కన్ఫ్యూస్డ్ బాయ్స్ లాగే ప్రవర్తించారు.
(02:02) కోట్లాది మందిని శాసించినవాడు తన పక్కనున్న స్త్రీ అడిగే ఒక చిన్న ప్రశ్నకి ఎందుకు వణికిపోతాడు? ఎందుకంటే వాడి దగ్గర జవాబు లేదు. జవాబు లేని చోట మగాడు సృష్టించేదే కన్ఫ్యూజన్ ఐదు నిమిషాల్లో చెప్పాల్సిన విషయాన్ని ఐదు గంటలు సాగదీస్తాడు. ఒక తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాల మధ్యలో తనని తాను వెతుక్కునేలోపే జీవితం సగం సంకనాకిపోతుంది.
(02:30) ఎందుకు మగాడు కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే దానికి అసలు సమాధానం ఇది. వాడికి తన గురించి తనకి తెలీదు. తన డెస్టినీ ఏంటో తెలీదు. అందుకే వాడు తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎదుటి మనిషిని అయోమయంలో నెట్టేస్తాడు. దీన్ని అర్థం చేసుకుంటే వైరాగ్యం వస్తుంది. అర్థం చేసుకోకపోతే ఆ కన్ఫ్యూజన్ లోనే కొట్టుకుపోతాం. ఈ భూమి ఎప్పుడూ ఎవ్వరిదీ కాదు మనం కేవలం విజిటర్స్ మాత్రమే మగాడు మారడు అది వాడి నేచర్ ఆ నేచరే వాడి అంతానికి కారణం అవుతుంది.
No comments:
Post a Comment