#ధ్యానంలో శ్వాసపై దృష్టి పెట్టడం వెనక రహస్యం ఏమిటి? #Padma Kathi “Why Focus on Your Breath?
Author Name:GoodLive Serenity
Youtube Channel Url:https://www.youtube.com/@PadmaMeditation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HjIefyL8EOc
Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మ కత్తి ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే చాలా మంది నన్ను అడిగినటువంటి ప్రశ్న మేము ధ్యానం మొదలుపెడితే అందరూ శ్వాస పైనే దృష్టి పెట్టండి అంటారు ఎందుకు ఇది చాలా మంచి ప్రశ్న ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఎక్కడైతే వింటున్నారో కంఫర్టబుల్ గా కూర్చోండి మరియు మీ శరీరానికి నెమ్మదిగా రిలాక్స్ చేయండి ఎక్కడ కూర్చున్నా గాన ఎందుకంటే మన శ్వాస అనేది మన జీవితం నడుస్తుంది అనేదానికి సంకేతం అంటే మనం అలైవ్ ఉన్నామా అనేదానికి అటువంటి దానికి సంకేతం ఏ పని చేస్తున్నా నిద్రలో ఉన్నా మనం ఇంకా ఏ పని చేస్తున్నా మన శ్వాస
(00:44) మాత్రం ఆగదు ఎందుకంటే అది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కానీ దీన్ని మనం కొంతసేపు గుర్తుగా ఉంచుకుంటే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ తో పాటు మీకు వివరిస్తాను. మీరు బిజీగా ఉన్నప్పుడు ఫోన్ మ్యూట్ లో పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. ఇది మన ధ్యానం మొదలు అన్నమాట. అంటే మన మనసు ఎప్పుడు గతం మరియు భవిష్యత్తు మధ్యలో తిరుగుతూ ఉంటుందన్నమాట.
(01:17) కానీ శ్వాస మాత్రం ఇప్పుడు ఈ క్షణం అంటే ఈ ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంటుంది. అదేవిధంగా మనం సైంటిఫిక్ గా చూసుకుంటే ఎప్పుడైతే మనం నెమ్మదిగా లోతుగా శ్వాస అయితే తీసుకుంటామో మన శరీరంలో పారాసింపథటిక్ నర్వస్ సిస్టం అనేది యక్టివేట్ అవుతుంది. దీనివలన మన శరీరానికి కావలసినటువంటి విశ్రాంతిని ఇస్తుంది మరియు త్వరితంగా ఒత్తిటిని కూడా తగ్గిస్తుంది.
(01:45) ఎందువలన అంటే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ తక్కువ అవుతుంది. మరియు మన యొక్క హార్ట్ బీట్ అంటే హృదయం యొక్క స్పందన కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అందువల్లనే మన మనసు కూడా చాలా ఆహ్లాదంగా మరియు ప్రశాంతంగా మారుతుంది అన్నమాట. అందుకే ధ్యాన మార్గంలో ముందుగా శ్వాసపై దృష్టి పెట్టమంటారు ఎందుకంటే ఇది సులభమైన మార్గం మనల్ని మళ్ళీ ఈ క్షణానికి తీసుకొచ్చేది అంటే మనం ఎంత బిజీగా ఎక్కడ ఉన్నా కానీ ఈ క్షణానికి అంటే ప్రెసెంట్ మూమెంట్ కి తీసుకొచ్చేటువంటిది అన్నమాట ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్ ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి ఒక లోతైన దీర్ఘ
(02:26) శ్వాస తీసుకోండి మెల్లగా వదిలివేయండి శ్వాస ఎలా వస్తుంది ఎలా పోతుంది అనేటిది గమనించండి మీ శరీరం ద్వారా ఏమి మార్చాల్సినటువంటి అవసరం లేదు. కేవలం గమనించండి అబ్సర్వ్ చేయండి. ఇంతే చాలు ఒక్కొక్క శ్వాసతో మీరు మీలోకి మళ్ళీ తిరిగి వస్తున్నారు. అందువల్లనే మనం శ్వాస పైన దృష్టి పెట్టమని అంటారు.
No comments:
Post a Comment