PRATIKULA VEDAM
8 hours ago
నీ Bank Account లోంచి ఒక లక్ష రూపాయలు మాయం అయితే, "నాకు లెక్కలు రావు, మా ఊరి Chartered Accountant చూసుకుంటాడులే" అని వదిలేస్తావా? లేక నీకు నువ్వే స్వయంగా ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి పరిగెడతావా? మరి నీ జేబులో ఉన్న పది రూపాయలకి ఉన్న transparency, నీ జీవితాన్నే శాసించే నమ్మకాలకి, సత్యానికి ఎందుకు అక్కర్లేదు?
ఇక్కడ అసలు సమస్య మనం చిన్నప్పటినుండి పెరిగిన విధానం లోనే ఉంది. మన చదువు మనకి What to think నేర్పింది కానీ, How to think నేర్పలేదు.
ఒక Software Engineer కి coding లో Error వస్తే తనకి తానుగా solve చేసుకుంటాడు. ఒక Doctor కొత్త మెడికల్ టెక్నాలజీ వస్తే దాన్ని adopt చేసుకుంటాడు. కానీ, జీవితం అంటే ఏంటి.. ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అని ప్రశ్నించే సరికి మాత్రం, మన మెదడు Safe Mode లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు?
ఎందుకంటే, సొంతంగా ఆలోచించడం అనేది చాలా కష్టమైన పని. దానికి ఒక బాధ్యత తీసుకోవాలి. అదే, మన తరపున ఆలోచించే contract ని కొందరు పీఠాధిపతులకో, ప్రవచన కర్తలకో ఇచ్చేస్తే.. రేపు ఏదైనా తేడా కొడితే, "నేనేం చేయలేదు, వాళ్ళే చెప్పారు, నేను గుడ్డిగా follow అయ్యాను" అని escape అయిపోవచ్చు. దీన్ని భక్తి అనరు, Psychology లో దీన్ని Cognitive Escapism అంటే, బాధ్యత నుంచి పారిపోవడం అంటారు.
ఎవరైనా perfect logic తో ఒక ప్రశ్న అడగ్గానే, మనకి కోపం వొచ్చేసి, argument కి దిగుతున్నామంటే.. మనం నిజంగా సత్యాన్ని కాపాడుతున్నట్టా? లేదా just మన గుడ్డి నమ్మకాల్ని కాపాడుకుంటున్నట్టా?
Socrates ఎప్పుడో ఒక మాట అన్నాడు.. "సత్యం తనను తాను కాపాడుకోగలదు, దాన్ని నువ్వేదో రక్షించేస్తున్నట్టు feel ఐపోకు" అని.
దేవుడు అనంతమైన శక్తి ఉన్నవాడు అని మీరే చెప్తారు కదా? మరి అంతటి Ultimate power కి, ఒక సామాన్యుడు వేసే logical ప్రశ్నల నుంచి, రక్షణ ఎందుకు అవసరం పడుతోంది? సృష్టిని మొత్తం శాసించే శక్తికి.. నీ అరుపులు, నీ గొడవలు కావాలా..! తన ఉనికిని నిలుపుకోవడానికి?
నిజం చెప్పాలంటే.. నువ్వు కాపాడుతోంది దేవుణ్ణి కాదు. ఆ దేవుడి పేరు మీద, నీ గుడ్డి నమ్మకాల మీద నువ్వు నిర్మించుకున్న నీ సొంత Ego ని, నీ Identity ని. నువ్వు గుడ్డిగా నమ్ముతున్న ఒక భ్రాంతి ఎక్కడ బద్దలైపోయి, నువ్వు ఇన్నాళ్లు నమ్మింది అబద్ధం అని ఒప్పుకోవాల్సి వస్తుందో అన్న భయమే.. ఈ క్షణంలో నీ కోపంగా బయటకి వస్తోంది. సత్యం ఎప్పుడూ ప్రశ్నలకి భయపడదు. చీకటి మాత్రమే వెలుతురుని చూసి భయపడుతుంది.
నువ్వు ఏదో ఒక మతం గురించే మాట్లాడతావా? దమ్ముంటే మిగతా మతాల మీద కూడా మాట్లాడు అని అడిగేవాళ్ళుంటారు.
See. ఇప్పుడు నీ ఇంట్లో చెత్త ఉంది, కంపు కొడుతోంది అని నేను చెప్తే.. "పక్కింట్లో కూడా చెత్త ఉంది కదా, ముందు వాళ్ళని అడుగు" అనడం ఎంత హాస్యాస్పదం? పక్కింటి వాడికి brain tumour ఉందని తెలిస్తే, నీకున్న జబ్బు దానంతట అదే తగ్గిపోతుందా?
మనం పుట్టి పెరిగిన సమాజంలో, మన ఆచారాల్లో, మన కుటుంబాల్లో, మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న మూర్ఖత్వాన్ని ప్రశ్నించడం మన primary బాధ్యత. పక్కింట్లో వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు కాబట్టి, మన మూర్ఖత్వాన్ని మనం justify చేసుకుందాం అనుకోవడం.. ఆలోచనా శక్తి చచ్చిపోయిన వాళ్ళు ఆడే ఒక cheap trick. ఎవరి బురద వాళ్ళకి కంపు కొడుతూనే ఉంటుంది, వేరే వాళ్ళ బురదని చూపించి మన బురదని సుగంధం అని బ్రమ పడలేము కదా!
కళ్ళుండి కూడా గుడ్డిగా కళ్ళు మూసుకుని నడవడాన్ని నమ్మకం అంటారు. And ఆ నమ్మకానికి అడ్డువచ్చే logics ని, ప్రశ్నలని శత్రువుల్లా చూడటాన్ని మూర్ఖత్వం అంటారు.
ప్రశ్నించడం ఆపిన క్షణం.. నువ్వు భౌతికంగా బ్రతికే ఉన్నా, intellectual గా చచ్చిపోయినట్టే. నువ్వు బ్రతికున్న శవానివా లేక ఆలోచించే మనిషివా అన్నది, నువ్వు వేసే ప్రశ్నల బట్టే decide అవుతుంది.
-PRATIKULA VEDAM
76
http://youtube.com/post/UgkxaVTcUm0D9uCuZzLX8PCjoa_pk9a2EYVN?si=glhFeJDBOdxy3oCe
No comments:
Post a Comment