ఆధ్యాత్మికత అంటే అది కేవలం భక్తి అనో, మతానికి సంబంధించిన అంశమనో చాలా మంది అనుకుంటారు.
లేదా.. అది జీవితం చివరిదశలో అవసరమైన విషయంగా భావిస్తారు.
👉కానీ, మానవ జీవన విధానాన్ని ఒక ఉత్తమమైన మార్గంలో నడిపే మార్గదర్శే ఆధ్యాత్మికత అని తెలుసుకోలేరు.
🌿ఆధ్యాత్మికత అంటే ముక్కు మూసుకుని జపం చేసుకోవడమో.. మనసు నిండా కోరికలతో పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు చేయడమో కాదు. అది ఒక జీవన విధానం.
పెద్దలను గౌరవించడం,
తోటివారికి చేతనైనంత సాయం చేయడం,
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం,
ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం,
మనకన్నా బలహీనులను హింసించకుండా ఉండడం.. ఇదంతా ఆధ్యాత్మికతే.
ప్రపంచంలో చాలా దేశాలు సాంకేతికత విషయంలో, ఇతరత్రా కొన్ని విషయాల్లో మనదేశం కంటే బాగా ముందు ఉన్నప్పటికీ..
భారతీయ జీవనవిధానానికి, మన సంస్కృతికి అబ్బురపడతాయి. చేతులెత్తి మొక్కుతాయి.🍁
🌻🌻🌻🌻🌻🌻🌻🌻. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment