*_🌹ఓ...మాయల మనిషి...🌹_*
*_ఓ...మానవా...ఇకనైనా మానవా..._*
*_నేను..నేను.. నేను అన్న దేహం బూడిద అవుతుంది ఏదో ఒక రోజు._*
*_నాది..నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు._*
*_ఒక్క చావుతో బంధాలు అన్ని తెగిపోతాయి ఏదో ఒక రోజు._*
*_ఇక్కడికి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు, ఏదో ఒక నాడు చుట్టూ అందరు ఉన్నా ఎందరు వున్నా సరే... అందరూండంగా, చూస్తుండగా మాయమవుతావ్._*
*_ఇద్దరు కలిస్తే జనం నలుగురు మోస్తే మరణం._*
*_మాయతో పుట్టావు, మాయలో జీవిస్తావు, మాయ మర్మం తెలుసుకోలేక వెళ్ళిపోతావు._*
*_జీవుడు పుట్టేటప్పుడు దైవాన్ని చేరాలి అని అనుకుంటాడు, పుట్టిన తర్వాత అన్నీ మర్చిపోయి తిరుగుతాడు._*
*_ఎన్నో అనుభవిస్తావు నిద్రలోకి జారిపోయిన తర్వాత అన్ని మర్చిపోతావు._*
*_నీ కష్టాలకు... నీ సుఖాలకు కారణం నీవే._*
*_నీవు పుట్టడానికి కారణం కూడా నీవే. ఇలా బ్రతకడానికి కారణం నీవే. ఇవన్నీ నీవు తగిలించుకున్నవే. చేతులారా.. నీవు చేసుకున్నవే._*
*_ఎలా తగిలించుకున్నావో అవన్నీ బ్రతికి ఉన్నప్పుడు మనసు పూర్తిగా వదిలించుకునే బాధ్యత నీదే లేకపోతే మరో జన్మకు సిద్ధమవుతావు._*
*_బ్రతికి ఉన్నప్పుడే దైవ నామాన్ని పట్టుకో లేదా బతికి ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించు లేదా బ్రతికి ఉన్నప్పుడే గురువును ఆశ్రయించు._*
*_ఒట్టి చేతులతో వచ్చావు. పది మంది సహకారంతో బ్రతుకుతావు. పోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావు._*
*_రాకడ ఎందుకు...? పోకడెందుకు...? రాకడ...పోకడ యొక్క మర్మాన్ని తెలుసుకో..._*
*_సర్వేజనాః సుఖినో భవంతు.. 🚩🙏_*
No comments:
Post a Comment