🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అమ్మ అంటే….!*
➖➖➖✍️
*ఎవరికయినా సరే... పుట్టినరోజు అత్యంత ప్రధానమైన పండుగ....!!*
*శాస్త్రంమీద గౌరవం ఉన్న వాళ్ళు ‘నేను పుట్టినరోజు పండుగ చేసుకోను’ అని అనకూడదు.*
*జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే దానికో శరీరం ఉండాలి. ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్పరోజు అది...!*
*అందుకే ఆరోజు దానిని పండగలా చేసుకోమని చెప్పారు.*
*ఎవరికయినా ఒక పుట్టిన రోజు మాత్రమే ఉంటుంది.*
*కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలున్నారో అన్ని పుట్టిన రోజులతోపాటూ... తను పుట్టిన రోజు కూడా ఉంటుంది.*
*”అమ్మా! ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు” అని డాక్టర్లు అమ్మకు చెప్పినా... “బిడ్డ బతికితే చాలు, నేను ఉండకపోయినా ఫరవాలేదు” అని అంటుంది.*
*మృత్యువు రెండు కోరల మధ్యలోకి చేరి, జారి కిందపడి బతికిన రోజు అమ్మకది పుట్టినట్లేగా. అంటే అమ్మకు అది మరో పుట్టిన రోజేగా...*
*అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజు... అమ్మకు మరో పుట్టిన రోజవుతుంది. అందుకే పుట్టిన రోజును ఎలా చేసుకోవాలి?*
*అమ్మకు కొత్త చీర పెట్టి...నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను కొత్తబట్టలు కట్టుకోవాలి. అది మర్యాద. సంస్కారవంతుల లక్షణం. అమ్మ సృష్టికర్త, ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె..మనకి మరో బ్రహ్మ.*
*తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది.. అందువల్ల ఆమె ..స్థితికర్త.*
*ఓ గైనకాలజిస్టు ‘మాతృదేవోభవ’ పేరుతో ఒక పుస్తకం రాసారు. దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో ‘కొలోస్ట్రమ్’ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఊరుతుంది.*
*గర్భసంచీలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు, అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికి... లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది.*
*అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల, గుండె పనితనాన్ని మందగింపచేస్తుంది. ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో..!*
*పరమ ప్రేమతో... అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్తన్యమిచ్చినప్పుడు.. ఆ కొలోస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్లి లోపల అడ్డుపడిన నల్లటి మలం.. బయటకు వచ్చేసి బిడ్డ..ఆయుర్దాయం పొందుతాడు.*
*అందుకే అమ్మ స్థితికర్త. అమ్మ ప్రళయ కర్త(శివుడు).. కూడా. ప్రళయం అంటే చంపేయడం కాదు. నిద్రపుచ్చడం. స్వల్పకాలిక ప్రళయం.*
*బ్రహ్మ, విష్ణువు, శివుడు... ముమ్మూర్తుల సమాహార స్వరూపం అమ్మ.*
*అందుకే ‘మాతృదేవోభవ’ అని మొదటి నమస్కారాన్ని అమ్మ అందుకుంటుంది.*
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment