*సప్తమంగైయర్ స్ధలాలు.....*
సర్వాంగభూషితుడై పరమశివుడు ప్రసాదించే దర్శనాన్ని, ' సర్వేశ్వర దర్శనం' అంటారు.
శిరస్సు న గంగ, చంద్రమౌళి, నుదుటన త్రినేత్రం, కంఠాన నాగాభరణం, చేతను ఢమరుకం, త్రిశూలమును ధరించి, శివపాద దర్శనంతో కూడిన దర్శనమే ' సర్వేశ్వర దర్శనం' అంటారు.
ఈ అలంకారశోభితుడైన పరమేశ్వరుని దర్శించాలని అఖిలాండేశ్వరి అమ్మవారు వాంఛించింది. అమ్మవారి కోరిక తెలుసుకున్న సప్తమాతృకలు, తాము పూజించే స్వయంభూ శైవక్షేత్రాలలో
సర్వేశ్వరుని దర్శించ వచ్చని, అఖిలాండేశ్వరిని ఆ ఏడు స్ధలాలకి తీసుకుని వెళ్ళారు. అఖిలాండేశ్వరి ఆ సప్త క్షేత్రాల సర్వేశ్వరుని పూజించి తరించింది .
ఆ ఏడు స్ధలాలు...
1. హరి మంగై,
2. చక్రమంగై,
3. నంది మంగై,
4. శూలమంగై,
5. తాళ మంగై,
6. పశుమంగై,
7. పుళ్ళమంగై,
ఈ స్ధలాలో వెలసిన ఈశ్వరుని...
1. హరి ముక్తీశ్వరుడు,
2. చక్రవాగేశ్వరుడు,
3. జంబుకేశ్వరుడు,
4. కృత్తివాగేశ్వరుడు,
5. చంద్రమౌళీశ్వరుడు,
6. పశుపతీశ్వరుడు,
7. బ్రహ్మపురీశ్వరుడు...
అనే నామాలతో అర్చించి ఆరాధిస్తారు.
ఈ ఏడు పుణ్యక్షేత్రాల
పేర్లు 'మంగై' అనే పేరు తో పూర్తి అవుతున్నందున, వీటిని
సప్త మంగైయర్ స్ధలాలుగా ప్రసిధ్ధి చెందాయి.
ఈ ఏడు శైవ క్షేత్రాలు తమిళనాడులో కుంభకోణం- తంజై మార్గంలో వున్నాయి.
No comments:
Post a Comment