"*ఎవరో ఏదో అంటే బాధపడటం అజ్ఞానం!! ఎవరో ఏదో అంటే ఆనందపడటమూ అజ్ఞానమే!!!! ..అంటే మీ ఆనందం మీ చేతుల్లో లేదన్నమాట!*
*ప్రపంచంలో ఎన్నో రకాల వ్యక్తులను కలుస్తూవుంటాం! ఎందరో ఎన్నో మాట్లాడుతూ వుంటారు! ఎవరెన్ని మాట్లాడినా మన ఆనందం మన చేతుల్లో వుండాలి! మన అంతర్గత స్థితిలో ఎలాంటి మార్పులు లేకుండా వుండాలి! అలాకాకుండా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అవసరానికి మించి బాధపడుతూ వున్నాం అంటే "మనకు తెలియకుండానే ఏదో సరికాని ఆలోచనావిధానంలో వున్నాం" అని అర్థం! అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మాత్రమే ఆనందపడుతూ ఉన్నాం అంటే "మన ఆనందం ఇతరులపై ఆధారపడివుంది " అని అర్థం! ఎప్పుడూ ఆనందంగా వుండాలంటే మన ఆనందం ఎప్పుడూ మన చేతుల్లోనే వుండాలి !మనపైనే ఆధారపడి వుండాలి! మన ఆనందం ఇంకొకరి వల్ల రావడం పోవడం జరిగితే తెలియకనే మనం వారికి బానిస అయినట్లు! సరిగ్గా చూసుకోండి!*✔️
No comments:
Post a Comment