Friday, December 20, 2024

 *అరుణాచలేశ్వర మందిరం గురించి వాస్తవాలు మరియు పురాణాంతర్గతం*


1. *అగ్ని మూలకాన్ని సూచించే పంచ భూత స్థలాలలో అరుణాచలం ఒకటి.*

*ఇక్కడ ఉన్న శివలింగమును "అగ్ని లింగం" అని పిలుస్తారు.*

2. *ఈ మహిమాన్వితమైన, అద్బుతమైన గుడిని, చోళులు, పల్లవులు మరియు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజా శ్రీ కృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు.*

*ఇది తిరువణ్ణామలై అరుణగిరి కొండ దిగువన ఉంది.*

3. *ఈ దేవాలయంలో రాజా శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన వేయి స్తంభాల హాలులో వేయి స్తంభాలున్నాయి.*

4. *ఈ 1000 స్తంభాలు నాయక్ కాలం నాటి శిల్పాలతో లిఖించబడ్డాయి.*

5. *భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు పవిత్రమైన అరుణాచల దేవాలయంలో శివ లింగమును దర్శించి ఆపై కొండ మీద ఉండి, అద్వైత వేదాంత కాంతిని మరియు ప్రత్యక్ష ఆత్మసాక్షాత్కారాన్ని యావత్ ప్రపంచానికి అందించారు. ఈనాటికి భగవాన్ రమణ మహర్షి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది.*

6. *ఒకసారి బ్రహ్మ, విష్ణుమూర్తి శివుని ఆది అంతాన్ని కనుగొనటానికి అగ్ని లింగమైన తేజో లింగము పైకి బ్రహ్మ గారు హంస వాహనాన్ని ఎక్కి బయలుదేరి వెళ్తూ, చాలా ఎత్తులో ఎగిరిన తర్వాత కూడా దానిని చూడలేకపోయిన బ్రహ్మ ఒక తాళంబు పువ్వును మాత్రం చూశాడు.*

7. *అప్పుడు ఆ పువ్వుని శివుని కిరీటం యొక్క దూరం గురించి  అడిగాడు, దానికి పువ్వు సమాధానంగా అతను నలభై వేల సంవత్సరాలుగా పడిపోతున్నానని చెప్పిందా పువ్వు. అప్పుడు బ్రహ్మ, అసలు ఆ కిరీటం చేరుకోలేనని గ్రహించాడు.*

8. *తజ్జంబు పుష్పం (మొగలి) తప్పుడు సాక్షిగా బ్రహ్మ కిరీటాన్ని చూసినట్లు ప్రకటించింది. ఆ మోసానికి శివుడు కోపించి, బ్రహ్మకు భూమ్మీద గుడి ఉండకూడదని, శపించాడు.*

9. *అహంకారాన్ని పోగొట్టడానికి శివుడు అగ్ని స్తంభంగా నిలిచిన ప్రదేశం తిరువణ్ణామలై. పరమశివుని స్వరూపమైన నామాలలో "అరుణాచలశివ" అత్యంత పవిత్రమైనది.*

  *🔥⚜️ అరుణాచలశివ ⚜️🔥*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment