Sunday, December 1, 2024

 *_ఎవరైనా మనల్ని అవమానించిన, అవహేళన చేసిన అది మనల్ని చూసి కాదు మన పరిస్థితిని బట్టి._*

*_ఒక్కోసారి ఒక్కొక్కరి మీద అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. కేవలం మన పరిస్థితిని బట్టి మాత్రమే మాట్లాడతారు కానీ మన వ్యక్తిత్వాన్ని చూసి మాట్లాడరు._*

*_ఎందుకంటే మన వ్యక్తిత్వం మనకు తప్ప ఇంకెవ్వరికీ ఖచ్చితంగా తెలియదు._*

*_అవతల వాళ్ళు మనల్ని అవమానించారని, అవహేళన, చేశారని తక్కువగా చూసారని వాళ్ళ మీద మనం ద్వేషం పెంచుకుంటే నష్టం వాళ్ళకి కాదు మనకి కలుగుతుంది..._*

*_ఎందుకంటే ఎవరైతే మనకి ఇష్టం ఉండదో ఎవరైతే మనకు నచ్చరో వాళ్ళతోటే మనం కలిసి ఉండే పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్లతోటే మనకు అవసరాలు కలిగేలా కాలం కల్పిస్తుంది._*

*_అందుకే కొంచెం ఓర్చుకుంటే కొంచెం ఓపిక ఉంటే జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలను అయిన ఎదుర్కోవచ్చు అన్నిసార్లు అన్ని అనుకూలంగా మనకు నచ్చినట్టు జరగవు కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి._*

*_ఎంతటి పెద్ద కష్టాన్ని దాటితే అంతటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. కావలసింది కాస్త ఓపిక.☝️_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🌹🙇‍♂️🌹 🌺🌺🌺

No comments:

Post a Comment