*సగటు హిందువు ఆవేదన*
*స్వధర్మ అభివృద్ధికి మాత్రమే*.
సభ్యులకు నమస్కారములు.
తెలుగు భాషలో ఒక వాడుక ఉన్నది. *చెప్పుకుని మురువ, చూసుకుని ఏడువ*. నేను జన్మించినది భారత దేశంలో, అందునా భాగ్యనగరంలో, నిజానికి చాలా ఆనందంగా, గర్వంగా ఉండాలి. ఒకప్పటి భారత దేశం వైభవంగా ఉండేది, చికాకులన్ని ఇప్పుడే అని అనుకోవడానికి గూడా వీలులేదు. మనం చదువుకున్న చరిత్ర పాఠాల ప్రకారం..ఎన్నెన్నో మొగలాయి దాడులు, దేవాలయాల ధ్వంసము, సంపదల దోపిడీ, తరలింపు ఆ తర్వాత ఆంగ్లేయులచే ఆక్రమణ, బానిస పాలన... *ఈలా చెప్పుకుంటూ పొతే మరింత కృంగిపోవడమే*.
ఒకే ఒక మనః శాంతిః. మన దేశం వేద భూమి యని, సిద్ధ మరియు యోగ పురుషులకు, దేవ ఋషులకు, సప్త ఋషులకు, వశిష్ట, విశ్వామిత్ర లాంటి మంత్ర దృష్టలకు, ఆధ్యాత్మికాచార్యులైన శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్యులు, శ్రీ శ్రీ శ్రీ రామానుజ తీర్థులు...ఇంకా ఎందరెందరో మహానుభావులకు ఈ భారతావని జన్మ స్థలమని. ప్రస్తుతం మనదేశం ఆర్థిక, సాంకేతిక, సైనిక శక్తి రీత్యా ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న విషయము కూడా యదార్థమే అయినప్పటికీ *ప్రస్తుత హిందు సామాజిక పరిస్థితి ఆందోళన కరంగా ఉందనుటలో ఇసుమంతయు సందేహము లేదు*.
నేను బాగున్నాను, నా సంతతి బాగుంది, తింటున్నాను, తిరుగుతున్నాను అనే వ్యక్తులకు ఇపుడు ఎందుకింత గగ్గోలు అని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. పైగా వాళ్ళ version...ఏమయ్యింది ఇతనికి హాయిగా ఇంట్లో తిని కూర్చుని రామా, కృష్ణా అనుకుంటూ పురాణ, ఇతిహాస, రామాయణ, మహాభారత, భాగవత కావ్యాల విశేష రచనలకు ఉపక్రమించకుండా, *ఎప్పుడు సమాజ జాగృతి వ్యాసాల రచనలు చేపడ్తూఉంటాడు. ఇతనికి ఇదేం పొయ్యే కాలం.* అని గూడా అనుకుంటూ ఉంటారు. నిజమే పొయ్యే కాలమే (80), కాని ఇప్పుడే పోవాలని లేదు.
ఒకసారి దేశ పరిస్థితి తెలుసుకుందాము. అధిక శాతం హిందూ ప్రజలకు మతము, సంప్రదాయాలకు, సంస్కారాలకు ఆలవాలము, జీవ గడ్డయిన ఈ భారతావని..నేడు పొరుగు దేశాల, అన్య మతస్థుల దుష్టాలోచనలు, దుష్ట చర్యలు, హిందూ ప్రజలలో చీలికలు కల్పించే ఉద్దేశ్యాలు, ప్రయత్నాలు, హిందూ ప్రజలు, గోవులపై, దైవారాధనల మండపాలపై దాడులు, పండుగలు మరియు ఉత్సవాలు సందర్భాలలో అల్లరులు ఇత్యాది. ఈ దేశంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేది ఎప్పుడు. మా ప్రాంతంలో ఇప్పుడు గొడవలేమి లేవు ఇప్పుడు, ఎప్పుడో ఎక్కడో జరుగబోయే గొడవలకు ఇప్పటి నుండి చింతించడం ఎందుకు అని గూడా కొందరు భావించవచ్చును.
ధన్యవాదములు.
*(సశేషం)*
No comments:
Post a Comment