Thursday, December 12, 2024

 🕉️ శివాయ గురవే నమః 🕉️శివుడు సర్వ వ్యాప్త స్వరూపం..మనిషి శరీరం ఒక శివాలయం స్నానం చేసే వేళ నీ తలనే లింగంగా భావించి నెత్తిమీద శివ నామ స్మరణచేస్తూ చెంబుడు నీళ్ళు పోస్తే చాలు అవికూడా శివర్పన నే..అలాంటిది కొందరు పని కట్టుకుని కొన్ని ప్రదేశాలలోనే శివుడు ప్రత్యేకం అక్కడకు వెళితేనే మోక్షం వెళ్ళలేకపోతే నువ్వు పాపివి అని కొన్ని క్షేత్రాలను మాత్రమే హైలైట్ చేస్తున్నారు .. ఒక్క అరుణాచలమేనా శివుడు వుండేది.. మన శ్రీ కాళహస్తి లో శివుడు ప్రత్యక్షంగా వాయు రూపంలో కనపడతారు.. శ్రీ శైలం లో శివుడు అమ్మవారు అడుగడుగునా కనపడతారు. ఈ రెండు క్షేత్రాల విశిష్టత పురాణాలలో చెప్పబడిన ప్రామాణికం..అసలు ఎక్కడ లేడు శివుడు. ప్రవచన కర్తలు,you tubers, ఇంకా కొంత మంది కలిసి ఒక్క అరుణాచలం నే hipe చేసారు దాని ఫలితం అక్కడ అవినీతి స్వార్థం పెరిగి వ్యాపార కేంద్రం అయ్యింది.దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి.
🙏 ఓం నమః శివాయ 🙏

No comments:

Post a Comment