Wednesday, December 11, 2024

 🙏🙏🙏🙏
మిత్రులారా! ఈరోజు గీతా జయంతి. అనగా భగవద్గీత పుట్టినరోజు. సుమారు 5000  సంవత్సరాల కిందట; ధర్మం కోసం పాండవులు కౌరవులతో  చేసిన యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి నిర్వేదాన్ని పురస్కరించుకొని అర్జునుడికి చేసిన బోధే భగవద్గీత. అర్జునుడికి జ్ఞానోదయం కలిగించడానికి చేసిన ఈ బోధ ద్వారా  మానవాళి అందరకు జీవన విధానాన్ని, జ్ఞానాన్ని, ముక్తిని పొందే మార్గాన్ని, బోధించిన రోజు. లోతైన ఆధ్యాత్మిక అవగాహన భగవద్గీత. ఇది వేద విజ్ఞాన సారం. గీతను అర్థం చేసుకొని ఆచరించుట ద్వారా జీవితంలో అన్ని బాధల నుండి, ఆందోళనల నుండి, విముక్తి పొందవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. హిందూ ధర్మంలో గీతా జయంతి ఎంతో పవిత్రంగా భావిస్తాము. ప్రపంచమంతా ఈరోజు భగవద్గీతను అనుసరిస్తున్నారు. భగవద్గీత అత్యంత ప్రసిద్ధి చెందిన వేద సాహిత్యం. భగవద్గీతను అర్థం చేసుకొని ఆచరిస్తే మానవుని జీవితం సుఖమయం అవుతుంది;  అనుటలో అతిశయోక్తి లేదు. మన హిందూ ధర్మంలో అనేక గీతలు ఉన్నాయి. అన్ని గీతలలోనూ భగవద్గీత ఎక్కువ ప్రసిద్ధి చెందింది.  ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు చాలా ఘనంగా పండుగ జరుపుకుంటారు. అన్ని వైష్ణవ దేవాలయాలు  పండగ శోభను సంతరించుకుంటాయి.
     మిత్రమా ఈరోజు భగవద్గీత 18 అధ్యాయాలు, లేదా ఒక అధ్యాయం, లేదా ఒక శ్లోక మైనా చదువుదాం. శ్రీకృష్ణ పరమాత్మ మనందరకు జ్ఞానాన్ని, మనశ్శాంతిని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
🙏🙏🙏🙏

No comments:

Post a Comment