*అబద్ధాలు.....*
*మానవ జన్మ ఎత్తినవారు మంచి చెడుల వివక్షణ తెలుసుకుని బ్రతకాలి*.
*దొంగతనం, అబద్ధం, పాప కార్యాలని తెలుసుకోవాలి. అబద్ధాలు చీటికి మాటికి ఆడేవారిని ఎవరూ నమ్మరు.*
*ఎదుటి వారిని అసత్యాలతో నమ్మించి మోసం చేసేవారికి పుట్టగతులు ఉండవు*.
*కానీ... ప్రాణ, విత్త మానభంగాల వంటి ప్రమాదాలలో తప్పనిసరి అబద్ధం ఆడవచ్చు అని పెద్దలు అంటారు.*
*అంతే గాని మంచినీళ్ల ప్రాయంగా ప్రతీ చిన్న తప్పిదాలను తప్పించుకోవడానికి, అనృతం ఆడితే, మనిషికి విలువ ఉండదు*.
*విచక్షణా జ్ఞానం ఉన్న వ్యక్తులు నీతి, నిజాయితీలకే కట్టుబడి కఠినమైన జీవితాన్ని గడపటానికే నిశ్చయించుకుంటారు*.
*స్వోత్కర్ష, పరనింద, అహంకారం, గుణాలతో ఇతరులకు హాని, అపకారాలే తప్ప మంచి జరుగదు.*
*మహాభారతంలో ధర్మరాజు, ఉదాత్త చరిత్రుడిగా ప్రసిద్ధి గాంచడానికి కారణం అబద్ధం ఆడకపోవడం, `అశ్వద్ధామ హతః కుంజరహ` అని ఆడీ ఆడని అబద్ధంతో కురు పాండవ యుద్ధంలో ధర్మరాజు పలికిన వాక్యంతో, గురువ్ఞ ద్రోణాచార్యుడు అస్త్రసన్యాసం చేసి యుద్ధం విరమించుకోవడంలో, అబద్ధం అతిముఖ్యంగా పరిణమించింది.*
*అలాగే అలనాటి పతివ్రత సావిత్రి యుక్తిగా యమునితో పోరాడి, తనకు కావలసిన వరాలన్నిటినీ పొందడానికి కారణం ఆయన అసత్యం ఆడకుండా చూడటమే.*
*ఇక హరిశ్చంద్రుడు అన్నీ కోల్పోయినా నిజాన్నే నమ్ముకోవడం వల్ల, సత్యహరిశ్చంద్రుడిగా పేరొంది పురాణ పురుషుడిగా కీర్తించబడ్డారు.*
*నేటి కలియుగంలో అబద్ధాలే ఆలవాలంగా ప్రముఖులు రాజకీయతంత్రాలతో ఇతరులను మోసగిస్తూ, తమ ప్రతిష్టలను పెంచుకోవడం వల్ల అనర్థాలతో, అపార్థాలతో, మానవజీవిత ప్రమాణాలు దిగజారుతూ ఉన్నాయి.*
*అబద్ధాలు ఆడేవారితో మాట్లాడి గెలవడం, అసాధ్యం వారికి దూరంగానే మసలుకోవాలి.*
*హత్య చేసేవాడిని కాక, చూసినవాడినే నేరస్తుడిగా భావించి శిక్షలు అమలుజరిపే రోజులివి*.
*అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి శిక్షను తప్పించుకునే ప్రబుద్ధులు బయటి ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణి అనడం, అమాయకులు అన్యాయంగా శిక్షింపబడటం, ధనప్రాబల్యంతో నిజాల్ని అబద్ధాలుగా మార్చడమే.*
*ఏది ఏమైనా చివరి విజయం ధర్మానిదే. సత్యమేవ జయతే. విచిత్రమైన ఈ కలియుగంలో ఎదుటి వారి ప్రతిభను చౌర్యం చేసి తమదని చెప్పుకునే అబద్ధపు అల్పజీవ్ఞలు, మెండుగా ఉండటం వల్ల, ప్రయోజనాలు, దక్కవలసిన వారికి దక్కడం లేదు. నిజం నిప్పులాంటిది.*
*ఎప్పటికయినా మోసాలు అబద్ధాలు బయటపడక తప్పవ్ఞ.*
*వాటి దుష్ఫలితాలు, ఇహంలో కాకపోయినా పరంలో అనుభవించక తప్పదు. అందుకే బాల్యం నుండే పెద్దలు గురువ్ఞలు, తల్లిదండ్రులు, పిల్లలను, అబద్ధమాడకుండా, నీతి ప్రాబల్యాలను బోధించాలి.*
*నిజాయితీ జీవనం, శాశ్వత సుఖం ప్రసాదిస్తుంది*.
*గౌరవప్రతిష్టలు పెరిగి సమాజంలో ఆదర్శవంతంగా కీర్తించబడాలంటే సత్యవాక్కులే ప్రధానంగా నమ్ముకోవాలి...*
*మనోలేఖ ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment