Monday, December 16, 2024

 *మనిషికి జీవితంలో అన్నిటికన్నా విలువైన సంపద ఏంటి*


మనిషికి జీవితంలో అన్నిటికన్నా విలువైన. సంపద డబ్బు బంగారము ఆరోగ్యము బంధాలు అనుబంధాలు కాదు.

మరి ఏంటి అని అంటారా మీ జీవితంలో నీకు అన్నిటికన్నా విలువైంది నీ దేహం అన్నిటికైనా విలువైన సంపద నీ శరీరం ఎలాగో చెప్తా విను 

ఆ శరీరంతోనే బంధాలు వచ్చాయి ఆ శరీరం ఉండబట్టే ఈ భార్య పిల్లలు తల్లి తండ్రి ఇల్లు వాకిలి డబ్బు అన్ని సంపాదిస్తున్నావ్ ఆ శరీరమే లేకపోతే నువ్వు ఏమి చేయలేవు .

ఇవన్నీ పోతే సంపాదించుకోగలరు కానీ శరీరం పోతే తిరిగి రాదు. అందుకే నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో .

దానికి కావాల్సిన ఆహారము నీరు విశ్రాంతి అన్ని ఇస్తూ అనవసర వ్యసనాలు అలవాటు చేసుకోకుండా 

ఆ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నీ అవసరాలకు వాడుకోకుండా ఒక దేవాలయంలో చూసుకో .

కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఆర్గాన్స్ ఆ శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటి ఖరీదు కట్టాలి అంటే నీ జన్మల జన్మలు సరిపోవు. కాబట్టి నీకు అన్నిటికన్నా ఖరీదైన సంపద నీ శరీరం .🙏

No comments:

Post a Comment