Thursday, December 12, 2024

 *నాకెందుకులే.ఐనా నాకెందుకు. లే*
 
 ఫేస్స్బు్క్ 
 వాట్సాప్ 
లలో హిందూధర్మం గురించి పోస్ట్ పెడితే నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న  క్రిస్టియన్ , ముస్లిం  నన్ను తప్పుగా అంటే (మతోన్మాధి )అనుకుంటారు. అయినా హిందూ ధర్మం గురించి..

          *నాకెందుకులే.*

    నేను అభిమానించే రాజకీయ నాయకుడిని, పార్టీని, వేరే పార్టీలోని వాళ్ళు తిడితే గుడ్డలు విప్పేసుకుంటాను.. కానీ మనం పూజించే దేవి,దేవతలను ఎవరైనా తిట్టిన దేవాలయాలు కూల్చిన దేవుడి మాన్యాలు కబ్జా చేసినా..

               *నాకెందుకు లే*

యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి వెళ్తాను హుండీలో కట్టలు కట్టలు పైసలు వేస్తాను నా స్వార్థం కోసం కోరికలు కోరుతాను
 కొండపైన దర్గాలు కట్టినా..

           *నాకెందుకు లే*

         తిరుపతి కొండకు వెళ్తాను దర్శనం తొందరగా అయిపోవాలి. తలనీలాలు సమర్పించికుని వీలైతే 1,2 సెల్ఫీలు తీసుకుని వచ్చేస్తాను అంతే... అక్కడ అన్యమతస్తులు నమాజ్ చేసినా ఏంచేసిన దేవాలయాల సొమ్ము ఎవరికి ఇచ్చిన ఎవరు దోచుకున్న...

           *నాకెందుకులే.*

         బెజవాడ దుర్గమ్మ కొండకు వెళ్తాను ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం అయిపోవాలి వీలైతే ప్రసాదం కొంచెం ఎక్కువ కావాలి. నేను పూజించే దేవతను దెయ్యం అంటూ ఎవడో పాస్టర్ బూతులు తిట్టిన...

             *నాకెందుకులే.*

          భద్రాచలం వెళ్తాను శ్రీరాముడు ని దర్శించుకుని పులకరించిపోతాను కానీ శ్రీరాముడు ని దగుల్బాజీ అని తిట్టినప్పుడు...

         *నాకెందుకులే.*

           శబరిమల అయ్యప్పస్వామి కోసం మాల వేసుకుని అత్యంత నియమ నిబంధనలు తో దీక్ష చేసి కొండకు వెళ్లొచ్చి ఆ స్వామిని చూసి మనసు తరించి  ఎంతో సంతోషిస్తాను కానీ కొందరు బైరి నరేష్ లాంటి *స్వార్ధపరులు* మన హైందవధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రతో *రాజ్యాంగం* అడ్డుపెట్టుకుని మన ఆచారాలను నాశనం చేస్తే...

         *నాకెందుకు.?*

       ఒక్కటి మాత్రం నిజం ప్రతిదీ  *నాకెందుకులే* అనుకుంటే చివరికి నీకంటూ ఏమివుండదు. గుర్తుపెట్టుకో నీ దేహం,నీప్రాణం ఈ దేశం కోసం నీధర్మం కోసం, నీ తల్లిదండ్రుల భావితరాల భవిష్యత్తు కోసం అని మాత్రం మరచిపోకు మిత్రమా.

*నేను మతసామరస్యం కోరుకునే వాడినే నన్ను నా ధర్మాన్ని గౌరవించేంత వరకే అదే నా శ్రీరాముడిని గౌరవిస్తే నేను వాళ్ళ దేవుడిని గౌరవిస్తాను ✊*

గుర్తుంచుకో కన్నతల్లి లాంటి నీ ధర్మాన్ని నువ్వు సరిగ్గా కాపాడుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టే. వేల ఏళ్ల సంస్కృతి ఈ సనాతన ధర్మం ఈ దేశానికి వెన్నెముక. మన సనాతన ధర్మం లో భాగం అయిన మన సంస్కృతియే అంతమైపోతే మనదేశానికి పక్కదేశాలకు తేడా ఉండదు. నీ ఇంటిని కాపాడుకోవడం నీకెంత ముఖ్యమో నీ సంస్కృతి, దేశాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. 
*🕉️ ధర్మోరక్షతిరక్షితః ✊🚩*

No comments:

Post a Comment