Wednesday, December 11, 2024

 *_జీవితంలో జరిగే ప్రతీ చిన్న మార్పును నవ్వుతూ స్వీకరిస్తే ఆనందం మన వెంటే ఉంటుంది..._*

*_ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ అది ప్రత్యేకంగా తయారు చేసి ఏం ఉండదు. మన ఆలోచనల్లోనే ఉంటుంది._*

*_మనం విషయాలను తీసుకునే పద్ధతిలోనే ఉంటుంది. ఆనందమనేది మనసుకు అనిపించాలి. దానికోసం ప్రత్యేకంగా వెతకడం అవసరం లేదు._*

*_జీవిస్తున్న ప్రతిక్షణాన్ని నువ్వేలా చూస్తున్నావో... దానిపైనే నీ సంతోషం దాగి ఉంటుంది._*

*_చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుని బాధపడితే... 'బాధే ' మిగులుతుంది._*

*_కాబట్టి, గతం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకూడదు. ప్రస్తుతం లో జీవించేవాడే ఆనందం తో ఉంటాడు._*

*_ఆనందం రాలిన జీవితం... నవ వసంతానికై ఎదురుచూస్తుంది... కారు చీకటి కమ్మిన మనసు... నిండు వెన్నెలకై ఎదురు చూస్తుంది... చివరగా మన ఆలోచనల తీరును బట్టే మనకు ఆనందం దొరుకుతుంది.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇‍♂️🪷 🌺🌺🌺

No comments:

Post a Comment