జ్ఞానప్రసూనాంబిక: అతడే పరమేశ్వరుడు.
ఆయన విజయాన్నే మీ విజయంగా భావించి గర్వపడుతున్నారు.
సకలానికి కర్త-భోక్త-హర్త పరమేశ్వరుడే.
మెరుపు మెరిసేది ఆయన వల్లే.
మనం రెప్పలు ఆర్చడం ఆయన వల్లే.
ఆయన సర్వశక్తిమంతుడు.
ఇతర దేవతల కంటే అగ్ని, వాయుదేవుళ్లు గొప్పవారు.
వారిద్దరి కంటే ఇంద్రుడు గొప్పవాడు.
యెందుకంటే, యక్షుని రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి అత్యంత దగ్గరగా ఉండి చూశారు కనుక.
* * *
శిష్యుడు: గురువుగారూ!
నాకు అతి రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని బోధించండి.
గురువు: మనస్సు-శరీరం
ఈ రెంటికీ ఆధారంగా ఉన్నది ఆత్మయే.
సకల జీవరాశుల్లో 'అహం'స్వరూపంగా ప్రకాశిస్తోంది ఆ సద్వస్తువు.
అని ఎవడు గ్రహిస్తాడో
వాణ్ణి సకల జీవరాశులూ ప్రేమిస్తాయి.
ఎవడు ఈ సత్యాన్ని రూఢిగా తెలుసుకుంటాడో
అతని పాపాలు పటాపంచలవుతాయి.
సదా అతడు ఆత్మనిష్ఠలో స్థిరమై ఉంటాడు.
No comments:
Post a Comment