దుందుభి :
ఓ భయంకర రాక్షసుడు. మయుని
కుమారుడు. మాయావికి అన్న దనుకశ్యపుల సంత
తికి జన్మించిన వారు అసురులు. ఆ సంతతిలో జన్మిం
చిన మయుడు గొప్ప శిల్పి. ఒకసారి మయుడు దేవ
లోకంలో దేవకన్యలు నాట్యం చేస్తుండగా హేమ అనే
అప్సరసను మోహించి హిమాలయాలకు దక్షిణాన
గొప్పభవనం నిర్మించుకొని నివాసమున్నాడు. వారికి
ఇద్దరు పుత్రులు జన్మించారు. ఒకడు దుందుఖి రెండో
వాడు మాయావి. - ఉత్తర రామాయణం
రావణునితో బాంధవ్యం : మయుడు హిమాలయా
లకు పశ్చిమాన ఓ కుమార్తెకోసం తపస్సు చేశాడు.
ఒకరోజు సుబ్రహ్మణ్యస్వామి జన్మ దినోత్సవం జరప
డానికి బ్రాహ్మణులకు దానం చేయడానికి కైలాసం
నుండి రాగా అదే సమయంలో శివభక్తురాలైన మధుర
సోమవార వ్రతం జరిపి శివుని దర్శనార్థం కైలాసానికి
వచ్చింది. ఆమె తిరుగు ప్రయాణంలో ఆమె స్తనాలకు
విభూతి వుండటం చూసి పార్వతి ఆమెను నూతిలో
కప్పగా వుండమని శపించింది. మధుర శివుడ్ని
వేడుకోగా ఓ 12 సంవత్సరాల తర్వాత నీకు శాప
విమోచనం కల్గుతుందని చెప్తాడు. ఆమె మయుడు
తపస్సు చేసే ప్రక్క బావిలో వుంటుంది. 12 సంవత్స
రాలకు ఆమె నిజరూపం దాల్చగా మయుడు శివ
ప్రసాదమని తలచి ఆమెను తన కుమార్తెగా స్వీకరించి
మండోదరిగా నామకరణం చేస్తాడు. రావణుడు ఆమెను
వివాహమాడతాడు. కనుక దుందుభి రావణుడు బావ
బావమరుదులవుతారు.
దుందుభి ఉత్తానవతనాలు : కైలాస పర్వతాన్ని తల
పించి జదడలబర్రైలా వుండే ఈ దుందుఖి శివుడిచ్చిన
వరాలతో 1000 ఏనుగుల బలంతో సముద్రునితో
పోరాడటానికి వెళ్లాడు. - శివవురాణం
దుందుఖి శక్తిని చూసి వరుణుడు నీతో పోరాడే శక్తి
నాకు లేదు. హిమవంతుడే నీకు దీటైనవాడని చెప్పగా
హిమవంతుడి దగ్గరకు వెళ్లాడు. అతడు తనకంత
శక్తి లేదని దక్షిణాన వానర రాజు నీతో పోరాడగల
శక్తి కలవాడని చెప్పగా కిష్కిందకు వచ్చి కోటబైట
వుండి తన అరుపులతో వాలిని ఆహ్వానిస్తాడు. మనకు
వైరంలేదు కనుక నీతో యుద్ధం చేయనన్నావినడు.
వాలి ఇంద్రుడు ప్రసాదించిన హారాన్ని ధరించి
దుందుభితో మల్ల యుద్దానికి ముందుకువస్తాడు.
అతని సోదరుడు సుగ్రీవుడు కూడా వెళ్తాడు. భూమిపై
పోరాడగా పోరాటం తీవ్రతరం అవుతుండగా వాలి
శక్తి వంతుడు, దుందుఖి శక్తిహీనుడూ అవుతుంటారు.
చీకటి పడటం వల్ల దుందుభి ఆకాశమార్జాన యుద్ధం
చేయతలచి విఫలుడౌతాడు. ఇలా వీరు మల్లయుద్ధం
చేస్తూ వుంటే దుందుభి ఓ గుహలోకి వెళ్తాడు. వాలి
వాడివెంట లోపలికి వెళ్తాడు. ఓ సంవత్సరమైనా తిరిగి
రారు. ఆ తర్వాత రక్తం ఆ గుహ ద్వారం గుండా
ప్రవహించింది. సుగ్రీవుడు తన అన్న చనిపోయాడని
తలచి ఆ గుహకు మూతపెట్టి కిష్కింద వస్తాడు.
దుందుభిని చంపిన వాలి ఆ రాతిని తొలగించుకొని
బయటకు వచ్చి తమ్ముడు తనకు అపకారం చేశాడని
తలచి అతణ్ణి కిష్కింధ నుండి తరిమివేస్తాడు. దుందుఖి
నుంది వచ్చిన రక్తం ఆకాశానికి చిందుతుంది. కొంత
రుష్యమూక పర్వతం మీద పడగా మాతంగ మహర్షి
ఆగ్రహించి ఈ రక్తం ఎవరిదైనా ఎవరివల్ల పడినా
అతడీ రుష్యమూక పర్వతం పైకివస్తే అతని తల
1000 వక్కలవుతుందని శపిస్తాడు. వాలిచే తరిమివే
యబడ్డ సుగ్రీవుడు రక్షణ కొరకు రుష్యమూక పర్వతం
పై నివసిస్తాడు. - రామాయణం
No comments:
Post a Comment