Wednesday, February 4, 2026

ధ్యానం అంటే...*

 *ధ్యానం అంటే...*

అగ్నిర్యత్రాభిమథ్యతే వాయుర్యత్రాభిరుధ్యతే సోమోయత్రాతి రిచ్యతే తత్ర సంజాయతేమనః

ఎక్కడ అగ్నిమథనం జరుగుతుందో, ఎక్కడ వాయుప్రసారం క్రమబద్ధీకరింపబడుతుందో, ఎక్కడ సోమరసం ఆస్వాదింపబడుతుందో అక్కడే మనస్సునకు కావలసిన బలం సమగ్రంగా లభిస్తూ ఉంది.

అగ్నిమథనం = అంతర్మథనంతో కూడిన సత్యాన్వేషణ

వాయు నిరోధం = శ్వాసపై నిశ్చల ధ్యాస

సోమరసపానం = జ్ఞానసుధాస్వాదనం

ఈ మూడు కలిస్తే అదే ధ్యాన యోగం.

( ( శ్వేతాశ్వతరోపనిషత్ )
*మనస్సే దేవత*

మన ఏవేత్యనంతం వై మనో2 నంతా విశ్వేదేవా అనంతమేవ సతేన లోకం జయంతి

జీవుని మనస్సు అనంత శక్తిసంపన్నమైన దేవత. మనస్సులో సముద్భవించే ఒక్కొక్క భావన ఒక్కొక్క దేవత.

అయితే మనోదేవతల సంఖ్య అనంతం. ఇలా అనేక దేవతలకు నిలయమైన మనస్సు వశమైతే జీవుడు దేవతల సేవకే అధిపతి యౌతాడు. అటువంటి జీవుడు జ్ఞానసామ్రాజ్యాన్ని సునాయాసంగా జయింప గలడు. ఈ స్థితికి చేరుకోవాలంటే మనోజయాన్ని కలిగించే ధ్యానసిద్ధి అవసరం.

( బృహదారణ్యకోపనిషత్ )
*మనస్సే కారణం*

ప్రాణికోటికెల్ల బంధంబు, మోక్షంబు చేరుటకును మనము కారణంబు; విషయసంగియైన విను బంధకారి, ని ర్విషయయైన ముక్తి విభవకారి.

జీవులు భవబంధాలలో చిక్కుకొని, సంసార సాగరంలో కొట్టు మిట్టాడడానికైనా, యోగబల సాధనతో మోక్షసామ్రాజ్యాన్ని అలంకరింప డానికైనా మనస్సే కారణం.

( శ్రీకృష్ణదేవరాయలు )
*హృదయం ఆకాశమంత విశాలమైతే...*

జ్యోతిరంబ! హృది విద్యయేక్షితం యల్లఘుప్రసృత మర్ధమండపే ధూమలక్ష్మగురు యచ్చతత్ చ్యుతం తేతు సత్త్వతమసీ వపు స్తవ

అమ్మా! నా హృదయాకాశంలో గోచరించే నీ జ్యోతిర్మయ స్వరూపం అపరోక్షానుభూతి అనే మంచుతెరమధ్య కర్మబంధమనెడి అగ్నికీలలను దహింపజేస్తూ నీ తత్త్వమహత్త్వాలను తెలుపుతూ ఉంది.

( చిద్గగన చంద్రిక )

మహాకవి కాళిదాసు.        

No comments:

Post a Comment