*అనుభవ జ్ఞానం*
ఎన్నో రకాల ఆకర్షణలు చుట్టూ ఉండి మనిషిని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాయి. లౌకికమైన ఆ కోరికలను సాధనాబలంతో తగ్గించుకోవాలి. అలాకా కుండా, మొండిగా ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఎలాగంటే... 'వలలో చిక్కుకున్న పక్షి బయటపడే ప్రయత్నంలో అటూ ఇటూ గింజుకుంటే, వల తాళ్లలో ఏదో ఒకటి దాని మెడకు బిగిసిపోతుంది. అప్పుడు విడుదల కావడం మాట అటుంచి, మరణం సంభవించినా ఆశ్చర్యపడక్కర్లేదు' అంటారు స్వామి రమణ మహర్షి.
జ్ఞానం వచ్చేదాకా కష్టాలు పడక తప్పదు. కానీ సాధన ఆపకుండా చేస్తే, కొన్ని సుళు వులు సాధకుడికి లభిస్తాయి. వాటినే పండితులు అనుభవజ్ఞానం అన్నారు. ఆధ్యాత్మిక సాధన పట్ల అనురక్తి అనుభవ జ్ఞానానికి దారిచూపుతుంది. కొలిమిలో ఇనుము ఎర్రగా కాలినా బయటికి తీయగానే అది సహజమైన నల్లరంగును గట్టితనాన్ని సంతరించుకుంటుంది. అలాగే తీర్థ యాత్రలు చేసినా, ప్రవచనాలు విన్నా కలిగే లాభం తాత్కాలికమే! అనురక్తి లేని మనసుతో చేసే ప్రయత్నాల వల్ల ప్రయో జనం అంతంత మాత్రమేనంటారు విజ్ఞులు. కాల్చిన ఇనుప కడ్డీ మీద ఆ ఎరుపు తగ్గక ముందే సమ్మెట పోటు వేస్తే, కావాల్సిన ఆకృతిని సంతరించుకుంటుంది. అలాగే తీర్థయాత్రలు, భగవత్ కథాశ్రవణం వంటి పవిత్ర సాధనలు చేస్తున్నప్పుడే ఇహలోక సంబంధాలను ఒక్కొక్కటిగా విడిచి పెట్టడానికి ప్రయత్నించాలి. అది ఎలా పనిచేస్తుందంటే... పుల్ల చిన్నదైనప్ప టికీ అగ్నిలో వేస్తే కాలిన కొద్దిక్షణాల్లోనైనా నెగడును మండే స్థితిలో నిలుపుతుంది. అలా ఒక్కో పుల్లకు మరో పుల్ల కలిస్తే మహా జ్వాల ఏర్పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక అనురక్తికి జ్ఞానతృష్ణను జోడిస్తే సాధకుడు సిద్ధి పొందుతాడు. తీరుతెన్నులు, ప్రాబల్యం, వైశిష్ట్యంతో పాటు తానేమిటో, సృష్టి వైచిత్రి ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే దాన్ని ఆత్మవిచారణ అంటారు. అలా ఆత్మవిచారణ చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే వైరాగ్యం కలిగి ముందుకు సాగుతారు. ఆ ప్రయత్నంలో 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' అని గ్రహించగలుగుతారు. అలాంటివా రికి పరమాత్మ తత్వం సులభంగా బోధపడుతుంది. అన్నింటా పరివ్యాప్తమై ఉండేది ఆత్మేనని, అందరిలో లాగానే తనలోనూ ఆత్మ ఉందని, అదే శాశ్వతమైన పరమాత్మ స్వరూపమని గ్రహించగలుగుతాడు సాధకుడు. తద్వారా తాను భగవంతుడికన్నా
భిన్నం కాదనే స్థితికి వస్తాడు. అదే 'అహం బ్రహ్మస్మి' అనే స్థితి. భగవద్దర్శనం, మహాత్ముల సూచనలు పాటించడం, అనవసర విషయాల జోలికి పోకపోవడం లాంటివి చేస్తే ఆధ్యాత్మిక పురోగతి, తద్వారా భగవదనుగ్రహం కలుగు తాయి. అలా అనుభవజ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం సాధకుడికి ఒక్క క్షణంలో లభించే వస్తువు కాదు. ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి లక్షలు కూడబెట్టినట్లు సాత్వికానుభవంతో జ్ఞానం ప్రతిక్షణం ప్రవర్ధమానమవుతుంది. అలా పొందిన అనుభవ జ్ఞానానికి మించింది లేదు. దాని బలంతో సాధించలేనిది లేదు.
No comments:
Post a Comment