365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో
♥️ *కథ*-*364* ♥️
వాస్తవంగా ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటి?
*ధ్యానం* *మీద* *ఒక* *ధ్యానం*
ముగ్గురు మహిళలు కచేరీకి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఒక స్నేహితుడిని ప్రతీ ఒక్కరూ కలవవలసి ఉంది.
కచేరీ జరుగుతున్న హాల్ లో సెల్ ఫోన్ సిగ్నల్ లేదు. వారు వచ్చేసరికి, ప్రదర్శన అప్పటికే మొదలైపోయి, మంచి ఉత్సాహంతో ఉంది. కాబట్టి, హాల్ లోపల ఉన్న తమ స్నేహితురాడు ఎక్కడ ఉన్నాడో వారిలో ఎవరికీ తెలియదు. ఆ ముగ్గురిలో ప్రతీ ఒక్కరూ ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో వారికి వారే నిర్ణయించుకోవాలి.
మొదటి మహిళ - లోపల ఉన్న అంతమంది జనాలను చూసిన తర్వాత - తన స్నేహితుడిని కనుగొనడానికి ఆ జనాల మధ్యలోంచి, వాళ్లని దాటుకుంటూ వెళ్లడం కష్టమని భావించింది. అదీకాకుండా ఆమె నేరుగా ఆఫీస్ నుండి రావడంతో, తాను కూడా కొంత విశ్రాంతిగా కూర్చుందామనుకొని, తలుపు దగ్గర సౌకర్యవంతంగా ఉన్న ఒక సీటును చూసుకొని, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంభాషిస్తూ, వేదికపై జరుగుతున్న ప్రదర్శనను ఆస్వాదిస్తూ కూర్చుంది.
కార్యక్రమం ముగిసిన తర్వాత, వెంటనే లేచి, ఇంటికి వెళ్ళిపోయి, నిద్రపోయే ముందు ఆమె తన స్నేహితుడిని కాల్ చేసి, త్వరలో మళ్లీ కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామని సందేశం పంపుతుంది.
రెండవ మహిళ లోపలికి వెళ్లి, ఆమె ప్రదర్శనను చూడకూడదనుకుంటుంది, కానీ ఆమె స్నేహితుడిని వెతకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తుంది. సంగీతానికి స్పందిస్తూ, ఆస్వాదిస్తూ, కొన్నిసార్లు ఆ రాగానికి డ్యాన్స్ చేస్తూ, ఆమె తన స్నేహితుడి కోసం వెతకడానికి జనాలలోకి చొచ్చుకుపోతుంది. ఆమె కదలికలను సంగీతమే నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
అయితే, అప్పుడప్పుడు, సంగీతపు ప్రభావం ఎలావుందంటే ఆమె డ్యాన్స్ లో చిక్కుకుపోతుంది. లేదా తనకు తెలిసిన వారిని పలకరిస్తుంది, లేదా కొత్త వ్యక్తిని కలుసుకుని వేరేధ్యాసలో పడిపోయి, - గుండ్రంగా తిరుగుతూ, ఊగుతూ, నాట్యం చేస్తూ ముందుకు సాగకుండా ఒకే చోట ఎక్కువ సేపు ఉండిపోతుంది.
ప్రదర్శన ముగిసిన తర్వాత అందరూ వెళ్లిపోవడం ప్రారంభించినప్పుడు, ఆమె వారిని అనుసరించింది. బయటకు వెళుతున్నప్పుడు, ఈ సంగీత సాయంత్రాన్ని తాను పూర్తిగా ఆస్వాదించినట్లు, చాలా ఆనందించినట్లుగా ఆమె తృప్తి చెందుతుంది. తన మనస్సు, శరీరం రెండూ ఉత్సాహంతో సజీవమైనట్లుగా ఆమెకు అనిపిస్తుంది - మనస్సు ఉత్సాహపూరితంగా, తాజాగా అనిపిస్తుంది. శరీరం అలసిపోయినప్పటికీ చురుకుగా ఉన్నట్లుగా ఉంది. ఆమె తన స్నేహితుడిని కనుగొనలేకపోయినప్పటికీ, తాను ఇక్కడకొచ్చిన ప్రయత్నం వృధా అవలేదని నిర్ణయించుకుంది, ప్రదర్శన యొక్క ఈ అనుభవం ఆమెకు విలువైనదిగా అనిపించింది.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మరొక రోజు ఎప్పుడైనా ఇలాంటి మరొక సంగీత కచేరీలో కలవవచ్చని ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్తుంది. కానీ ఇలా అనేక సార్లు కలవాలని అనుకున్న తర్వాత కూడా, ప్రతిసారీ ఇలాంటి కచేరీలలో అదే అనుభవం కలుగుతూండడంతో ఆమె తన స్నేహితుడిని కలుసుకోలేకపోతుంది. ఎందుకంటే తను తన స్నేహితుడిని కనుక్కోలేకపోయినా ఆ సభలలో తనంతట తానుగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని ఆమెకు తెలుసు. కానీ చివరికి, మళ్ళీ మళ్ళీ అదే అనుభవంతో విసిగిపోయి, ఆమె కచేరీలకు వెళ్లడం పూర్తిగా మానేసింది.
అయితే మూడవ స్త్రీ లోపలికి వెళ్లి వెంటనే ఆమె స్నేహితుడిని వెతకడానికి ప్రయత్నిస్తుంది. వేదికపై జరుగుతున్న కచేరి బావున్నప్పటికీ , ఆ సంగీతం తన హృదయాన్ని తాకినప్పటికీ, ఆ సాయంత్రం తనకున్న లక్ష్యం ఒక్కటే అని ఆమెకు తెలుసు. అందువల్ల ఆమె అన్నిటినీ విస్మరిస్తుంది: అంటే ఆ సాయంత్రం తన స్నేహితుడితో సమయం గడపడమే ఆమెకున్న ముఖ్య ఉద్దేశ్యం. ఆ సంగీతం, ఆ సమయం రెండూ కూడా మరింత గొప్పదైన వారి స్నేహాన్ని మెరుగుపరచడానికి, ఒకరితోఒకరు కలిసి గడిపిన సమయాన్ని మరింత గుర్తుండిపోయేలా చేయడానికి ఒక అవకాశం మాత్రమే.
అందువల్ల, ఆమె నిర్భయంగా చాలాసార్లు ఆ జనాలను దాటుతుంది, తన స్నేహితుని కోసం వెతకడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ కచేరీ ముగిసే వరకు కూడా ఆమె తన స్నేహితుడిని కనుగొనలేకపోయింది. కానీ ఆమె ఆశ కోల్పోలేదు. వెళ్లిపోయే ముందు అతనిని కలవవచ్చన్న ఆశతో ఆమె తలుపు దగ్గర ఓపికగా వేచి ఉంది. హాల్ అంతా ఖాళీ అయిన తర్వాత కూడా అతను లోపల కనిపించకపోతే, బయటికి వచ్చి అతన్ని పిలవవచ్చని ఆమె ఆశించింది.
బహుశా, అప్పుడు, ఇద్దరూ కలిసి సంగీత కచేరీని ఆస్వాదించే బదులు, వారు కలిసి డిన్నర్ కి వెళ్ళచ్చు, లేదా ఎక్కడైనా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు, లేదా మరేదైనా కలిసి చేయవచ్చు .... వారిద్దరూ కలసి కొంత సమయం గడపటం చాలా ముఖ్యం.
తనను దాటుకుంటూ నడుస్తున్న ప్రతి ఒక్కరి ముఖాల్లోకి చూస్తూ అతని కోసం వెతకడంపై దృష్టి పెట్టిన్నప్పుడు, ఆమె తన భుజంపై చేయి పడడంతో వెనక్కి తిరుగుతుంది. అక్కడ తన స్నేహితుడు చిరునవ్వుతో నిల్చుని ఉండడం ఆమె చూసింది. ఆమె ఎలా అయితే అతని కోసం వెతుకున్నదో అతను కూడా అదే శ్రద్ధతో ఆమె కోసం వెతుకుతున్నాడు.
ఇదే ధ్యానం అంటే. కచేరీ హాలు మన మనసు. గుంపులోని వ్యక్తులు మన ఆలోచనలు. సంగీత కచేరి మన ఆధ్యాత్మిక అనుభవాలు. మనం వెతుకుతున్న స్నేహితుడు, మనలోని మార్గదర్శి, మనలో ఉన్న దైవత్వం.
మిత్రులారా, ఈ కథను మరోసారి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ....
మనం కచేరీకి వచ్చిన ముగ్గురు మహిళలలో మొదటివారిలా ఉన్నట్లయితే, మనం మన ఆలోచనలను అరికట్టడానికి ప్రయత్నించడానికి ఇష్టపడం. బదులుగా, అన్నింటినీ తప్పించుకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం. అప్పుడు, ధ్యానం, ప్రాణాహుతిప్రసారం యొక్క అనుభవం మన చెవుల్లోని బాహ్య సంగీతంలాగా పైపైనే మన హృదయంలోకి ప్రవేశించవచ్చు, కానీ ఈ విధంగా, ధ్యానం చేసిన తర్వాత కూడా మనం ఎప్పటికీ పరివర్తన చెందలేం.
మనం సంగీత కచేరీకి వెళ్లిన రెండవ స్త్రీలా ఉంటే, మనం మన ఆలోచనల ద్వారా పని చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రాణాహుతి ప్రసారం మనకు స్ఫూర్తినిస్తుంది. ఇది మన మనస్సును నియంత్రించడంలో కొంత పురోగతిని సాధించడంలో, మన గురించి మనకు లోతైన అవగాహనను పొందడంలో సహాయపడుతుంది. అయితే, సామెత చెప్పినట్లుగా, మీరు "చెట్ల కోసం మొత్తం అడవినే కోల్పోయారు", ఎందుకంటే ఇలా కొంత సమయం తర్వాత పురోగతి మందగిస్తుంది.
అవును! ధ్యానంలో మన అనుభవం చాలా లోతుగా ఉంటుంది, కానీ అది ఎంత మంచి అనుభూతిని కలిగించినా అది చివరికి స్థిరంగా, మార్పురహితంగా ఉంటుంది .
అందువల్ల, అనుభవాలు, ఆలోచన నియంత్రణ, ప్రాణాహుతి ప్రసార అనుభూతి వంటి అంశాలు మాస్టర్ యొక్క లోతైన అంతర్గత ఉనికిని అనుభవించడానికి అద్వితీయమైనవి. నిస్సందేహంగా, అవి అన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి. అవి వాటి స్వంత పనితీరును, వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కానీ వాటికి మితిమీరిన ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మన పురోగతిని మెరుగుపరిచే బదులుగా నిరోధిస్తాయి.
ఈ విధంగా, మూడవ స్త్రీ వలె, మనం స్థిరంగా లోపల ఉన్న దైవత్వాన్ని కనుగొని అనుభవించే వరకు ప్రతీ దాన్నీ ప్రక్కన పెట్టాలి. మనం సంపూర్ణమైన ధైర్యంతో, ఆ అంతరంగ నిశ్శబ్దంలో దైవత్వం దొరుకుతుందేమోనని, ఆ దివ్యత్వంతో మనం ఒక్కటి అవుతున్నామేమోనన్న కోరికతో ఓపికగా ధ్యానంలో కూర్చోవాలి ...
ఆ దివ్య జ్యోతి మనందరిలో ఇప్పటికే ఉంది. ఎందుకంటే, మంచి సంగీతాన్ని, మంచి స్నేహితుడితో కలిసి బాగా ఆస్వాదించవచ్చని మనందరికీ తెలిసినట్లే - కచేరీ నుండి నిష్క్రమించిన కొన్నాళ్ల వరకూ కూడా మనం ఆ అనుభవాన్ని మళ్లీ మళ్లీ పునరుజ్జీవింపజేసుకోవచ్చు. నిజానికి ధ్యానం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, హృదయంలోని అంతర్లీన లోతుల్లోకి వెళ్లి, లోపల ఉన్న దైవత్వంతో ఐక్యమవడం. ఇంతకు ముందెన్నడూ అలాంటి సుమధురమైన సంగీతం వినలేదని మీరు ప్రమాణపూర్తిగా చెప్పగలుగుతారు!
♾️
ధ్యానం చేసే వస్తువు యొక్క నిజమైన స్వభావాన్ని ధ్యానం వెలికితీస్తుంది. ఇది ఆలోచన రూపంలో కాకుండా అనుభూతి రూపంలో వివరించబడుతుంది. అందువల్ల ధ్యానం అనేది మనం ఆలోచన నుండి, హృదయం ద్వారా అనుభూతికి వెళ్ళే ప్రక్రియ. దైవత్వం గురించి ఆలోచించడం బదులుగా, దివ్యత్వపు ఉనికిని అనుభూతి చెందడం. ఇది మనస్సు యొక్క సంక్లిష్టత నుండి హృదయపు సరళత వరకు జరిగే ఒక ప్రయాణం. 🌼
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment