See how a single chapati changed a man's life! #Inspirational #LifeLessons #ViralTelugu
https://youtube.com/shorts/A3ljl80FQKw?si=na9HQCSBW4Ru8vcR
https://www.youtube.com/watch?v=A3ljl80FQKw
Transcript:
(00:00) ఆ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ లో విపరీతమైన రద్ది నా స్నేహితుడికి అర్జెంట్ గా తత్కల పాస్పోర్ట్ కావాలి గంటల తరబడి క్యూలో నిలబడ్డాం ఫార్మ్స్ నింపాము తీరా మా వంతు వచ్చేసరికి ఆ విండో దగ్గర క్లర్క్ మొహం మీద తలుపు వేసి టైం అయిపోయింది రేపు రండి అన్నాడు నిర్లక్ష్యంగా మేము బతిమాలాం సార్ రోజంతా ఇక్కడే ఉన్నాం కేవలం ఫీస్ కట్టాలి అంతే అని కానీ అతను వినలేదు నేను పొద్దున్న నుంచి పని చేస్తున్నాను కావాలంటే గవర్నమెంట్ ని ఇంకో స్టాఫ్ ని తీసుకోమని అడగండి అని అరిచాడు నా స్నేహితుడు నిరసగా పదా వెళ్ళ వెళ్ళిపోదాం అన్నాడు. కానీ నా మనసు వినలేదు. ఆ క్లర్క్
(00:33) లంచ్ బాక్స్ పట్టుకొని క్యాంటీన్ వైపు వెళ్ళడం చూశాను. నేను అతన్ని అనుసరించాను. అతను ఒంటరిగా కూర్చుని తింటున్నాడు. నేను ఎదురుగా కూర్చుని చిరునవ్వుతో అడిగాను. సార్ మీ కుర్చీ ముందు ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు వస్తుంటారు కదా మీరు చాలా గొప్పవారు అతను గర్వంగా అవునన్నట్టు తలపాడు. అప్పుడు నేను నెమ్మదిగా అడిగాను.
(00:53) సార్ మీ ప్లేట్ లోనుంచి ఒక చపాతీ నేను తీసుకోవచ్చా అతను ఆశ్చర్యపోయాడు. సరే అన్నాడు. నేను ఆ చపాతీ తింటూ అన్నాను సార్ మీ ఆవిడ వంట అద్భుతంగా ఉంది. కానీ ఒక మాట మీరు కూర్చునేది చాలా బాధ్యయుతమైన కుర్చి కానీ మీరు ఆ స్థానాన్ని గౌరవిస్తున్నారా అతనికి అర్థం కాలేదు. నేను ప్రశాంతంగా చెప్పాను మీరు ఒంటరిగా తింటున్నారు ఒంటరిగా ఉంటున్నారు.
(01:13) స్థాయం కోసం వచ్చే వాళ్ళని విసుక్కుంటున్నారు. మీకు ఇంకా స్టాఫ్ కావాలని అడుగుతున్నారు కదా. ఒకవేళ స్టాఫ్ పెరిగితే మీ విలువే తగ్గుతుంది కదా సార్. దేవుడు మీకు కేవలం డబ్బు సంపాదించుకోవడానికే ఈ ఉద్యోగం ఇవ్వలేదు. బంధాలను సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ మనుషులని పోగొట్టుకుంటున్నారు.
(01:32) ప్రవర్తన సరిగ్గా లేకపోతే సొంత కుటుంబం కూడా సంతోషంగా ఉండదు సార్ అన్నాను. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. గొంతు వనుగుతుండగా అన్నాడు నిజం చెప్పారు సార్ నా భార్య నాతో గొడవపడి వెళ్ళిపోయింది. పిల్లలు నాతో మాట్లాడరు. మా అమ్మ బలవంతంగా రెండు చపాతీలు చేసి పెడితే ఇక్కడ ఒంటరిగా తింటున్నాను. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది.
(01:52) నేను అతని భుజంపై చెయి వేసి చెప్పాను. నేను నాకోసం రాలేదు సార్. నా స్నేహితుడి కోసం వచ్చాను. నిస్వార్థంగా ఉన్నాను కాబట్టే నాకు స్నేహితులు ఉన్నారు. మీరు స్వార్థంగా చూస్తున్నారు కాబట్టే ఒంటరిగా మిగిలారు. ఆ రోజు అతను లేచి కళ్ళు తుడుచుకొని ఆఫీస్ కి వెళ్లి మా పని పూర్తి చేశాడు. ఏళ్లు గడిచాయి. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది.
(02:10) సార్ నేను రవీంద్ర కుమార్ని ఆ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ లో నాతో చపాతీ తిన్న వ్యక్తిని గుర్తున్నానా అతని గొంతులో ఆనందం. సార్ ఆ రోజు మీరు చెప్పిన మాటలో నన్ను నిద్రపోనివ్వలేదు. మరుసటి రోజే నా భార్య దగ్గరికి వెళ్ళాను. తను రానంది. అప్పుడు తను తింటున్న ప్లేట్ లో నుంచి చపాతీ తీసుకొని నాకు తినిపిస్తావా అని అడిగాను. తను ఏడుస్తూ నాతో వచ్చేసింది.
(02:28) ఇప్పుడు నా పిల్లలు భార్య అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు నేను డబ్బు సంపాదించడం లేదు సార్ మనుషుల్ని సంపాదిస్తున్నాను. వచ్చే నెల నా కూతురు పెళ్లి మీరు వచ్చి మమ్మల్ని ఆస్వదించాలి. నాకు మాటలు రాలేదు. ఒక్క చపాతి ఒక మనిషి జీవితాన్ని ఇంతలా మారుస్తుందని నేను ఊహించలేదు గుర్తుంచుకోండి రూల్స్ అనేవి మెషిన్ల కోసం రిలేషన్స్ అనేవి మనుషుల కోసం మనుషుల్ని అధికారంతోనో డబ్బుతోనో గెలవలేం కేవలం ప్రేమతో గౌరవంతో గౌరవంతో మాత్రమే గెలవగలం.
(02:55) ఈరోజే నిర్ణయించుకోండి మీరు డబ్బు సంపాదిస్తున్నారా లేక మనుషులు సంపాదిస్తారా
No comments:
Post a Comment