https://youtu.be/SFeshmqE9oU?si=sIfj1n4wG8dvBjIG
పల్లవి :- సదా సదా నిన్నే స్మరించి స్మరించి
నీలో ఐక్యమయ్యే వరమీయి..రమణా..
||సదా..2||
సదా చలించే అలసే మనసులలో..2 సదాశివ అని నిన్ను ఓ క్షణము కూడా మరువకుండ.. ||సదా సదా నిన్నే స్మరించి నీలో ఐక్యమయ్యే వరమీయి..రమణా.. ||
చరణం:- కామ క్రోధ మద మాత్సర్యము నన్ను విడిపోవుటకో..
సామగాన సమ వాక్యము నా నోట పలుకుటకు...కామ...2
నీ శ్రీపద కమలం నా శిరసున నిలిపి
గురు కృపతో నను దేవుడు దయగన...
||సదా..సదా..||
చరణం:- అదా ఇదా అన్ని తిరిగెడి ఎన్నెన్ని కోవెలలో..
ఇదా అదా అని జపించెడి ఎన్నెన్ని మంత్రములో..
||అదా ఇదా..|| 2
కడలిని అలవోలె అలలోని నురగల్లె ..
||కడలిని..2||
అలసి అలసి మది సొలసి సొలసి గుండె కృశించి కృశించి తపించే
అలలకు ఆవల వెలిగే దీపమా
నీ దరి నే చేరు కాంతిని ప్రసరించ
||సదా సదా..||
No comments:
Post a Comment