సెక్స్ చేయాలన్న ముందు నీ బ్రెయిన్ పర్మిషన్ తీసుకోవాలి | Telugu Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NLRlqK3zAJw
Transcript:
(00:01) [సంగీతం] మన రోజువారి బతుకుల్లో సెక్స్ అంటే ఏవో రెండు శరీరాలు కలవడం కాసేపు చెమట పట్టడం ఆ తర్వాత నిద్రపోవడం అనుకుంటాం. ఎంత అమాయకుడివిరా నువ్వు అసలు నీ శరీరానికి సొంతంగా ఏ కోరిక ఉండదు. నీ చర్మానికి నీ కండరాలకి నీ రక్తానికి అసలు ఏమీ తెలియదు. వాటన్నింటిని ఒక తోలు బొమ్మలా ఆడిస్తున్న ఆ మాస్టర్ మనిపులేటర్ అది నీ బుర్రె ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత భయంకరమైన సెక్స్ ఆర్గన్ నీ తలలో ఉంది.
(00:38) నువ్వు ఒక వ్యక్తిని చూసి సొల్లు కార్చుకుంటున్నావ అన్నా ఒక చీకటి గదిలో నీ నీడతో నువ్వు యుద్ధం చేస్తున్నావన్నా దానికి కారణం నీ న్యూరాన్లు ఆడుతున్న ఒక డర్టీ గేమ్ మనమంతా ఒక కెమికల్ లోకంలో బ్రతుకుతున్నాం. నీ బ్రెయిన్ లో డోపమైన్ అనే ఒక విషం ఉంది. అది నిన్ను ప్రతిక్షణం ఒక వేటగాడిలా మారుస్తుంది. నీకు కావాల్సింది ఒక మనిషి కాదు నీ మెదడులో ఆ కెమికల్ ఇచ్చే ఆ ఒక్క సెకను కిక్కు ఆ కిక్ కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావు ఏ అబద్ధమైనా చెబుతావు ఏ రాక్షసుడిలా అయినా వేషం వేసుకుంటావు.
(01:12) నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి ఏవేవో భ్రమల్లో బ్రతుకుతున్నావు కానీ నిజం ఏంటో తెలుసా నువ్వు పుట్టిన క్షణం నుండి చచ్చే వరకు నీకు తెలిసిన ఒకే ఒక భాష స్పర్శ ఆకలితో ఏడ్చే బిడ్డకు తల్లి చనుబాలి ఇచ్చే ముందు దొరికే ఆ స్పర్శే వాడికి ప్రాణం కానీ నువ్వు అనుకుంటున్న ఆ శారీరక స్పర్శ కేవలం ఒక ఇల్యూజన్ మాత్రమే అసలు స్పర్శ అనేది చర్మం మీద కాదు నీ మెదడులో జరుగుతుంది.
(01:38) ఈ చర్మం అనేది కేవలం ఒక రిసీవర్ మాత్రమే ఒక వైర్ లాంటిది ఒక చెత్త మాంసం ముద్ద నీ చర్మం మీద వేలాది నరాలు ఉంటాయి. ఎవరైనా నిన్ను తాకినప్పుడు ఆ నరాలు ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ను సెకనులో వందో వంతు కాలంలో నీ వెన్నెముక ద్వారా మెదడుకు పంపుతాయి. ఆ సిగ్నల్ మెదడులోని సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనే భాగానికి చేరుతుంది.
(02:02) అక్కడ నీ మెదడు ఆ సిగ్నల్ ను డీకోడ్ చేస్తుంది. ఇది వేడి, చల్లదనం, నొప్పి, ఇది సుఖం అని నిర్ణయిస్తుంది. అంటే ఇక్కడ నీ మెదడు ఇది సుఖం అని స్టాంప్ వేస్తేనే నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు. లేదంటే అది కేవలం ఒక ఫ్రిక్షన్ మాత్రమే ఉంటుంది. నీకు కలిగే ప్రతి అనుభూతి నీ మెదడులోని ఒక క్యాలిక్యులేషన్ మాత్రమే. నువ్వు ఒక వ్యక్తిని కౌగిలించుకున్నప్పుడు నీకు కలిగే ఆ వెచ్చదనం ఆ ఫీలింగ్ అదంతా నీ మెదడులో ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్ అనే కెమికల్స్ విడుదల కావడం వల్ల కలిగే మత్తు ఆ మత్తు కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు.
(02:35) 1950లో హారీ హార్లో అనే సైకాలజిస్ట్ కోతుల మీద ఒక ప్రయోగం చేశాడు. అతను తల్లి కోతి నుండి పిల్ల కోతిని వేరు చేసి రెండు రకాల కృత్రిమ తల్లి కోతులను పెట్టాడు. ఒకటి కేవలం తీగలతో చేసిన తల్లి దాని దగ్గర పాలు ఉన్నాయి. రెండోది మెత్తని బట్టతో చేసిన తల్లి కానీ దాని దగ్గర పాలు లేవు ఆ పిల్లకోతి ఏం చేసిందో తెలుసా అది ఆకలి వేసినప్పుడు మాత్రమే పాలున్న తీగ తల్లి దగ్గరకు వెళ్ళేది.
(03:03) మిగతా సమయంంతా ఆ మెత్తని బట్ట తల్లిని గట్టిగా పట్టుకొని కూర్చునేది. ఎందుకు ఆకలి కంటే దానికి స్పర్శ ద్వారా లభించే ఆ వెచ్చదనం ఆ భద్రత కావాలి. అంటే జీవించడానికి ఆహారం ఎంత ముఖ్యమో మానసికంగా బ్రతకడానికి ఆ మెదడుకి స్పర్శ ద్వారా లభించే ఆ అనుభూతి అంత ముఖ్యం. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే సెక్స్ అనేది కేవలం సంతానోత్పత్తి కోసమో శారీరక ఆకలి తీర్చుకోవడానికో కాదు అది ఆ మెదడులోని సెక్యూరిటీ సిస్టం ని తృప్తి పరచడానికి మనం ఎంత నాగరికులం అని చెప్పుకున్నా లోపల ఉన్నది ఆ స్పర్శ ఆకలి ఉన్న జంతువే ఆ ఆకలి తీరకపోతే మెదడు పిచ్చెక్కిపోతుంది.
(03:44) ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఫెటిష్ ప్రతి వింతైన కోరిక పుట్టేది నీ మెదడులో స్పర్శ గురించిన జ్ఞాపకాల వల్లే నీకు ఒక రకమైన స్పర్శే కావాలనిపించడానికి లేదా ఒక రకమైన టచ్ ని చూసి భయపడడానికి కారణం నీ చిన్ననాటి అనుభవాలు లేదా నీ సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోయిన డేటా నీ మెదడుకి ఒక ఊహా శక్తి ఉంది.
(04:07) అది ఎంత శక్తివంతమైందో తెలుసా నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైనా ఊహించుకున్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను తాకుతున్నట్టు నీ మెదడు భ్రమింపజేయగలదు. ఆ సమయంలో నీ శరీరంలో నిజంగానే ఆ కెమికల్స్ ని రిలీజ్ అవుతాయి. నీ గుండె వేగం పెరుగుతుంది. నీ కండరాలు ఉద్వేగానికి లోనవుతాయి. అంటే ఒక నిజమైన స్పర్శకి ఒక ఊహాజనిత స్పర్శకి మధ్య నీ మెదడు కెమికల్ పరంగా ఏ తేడాను గుర్తించలేదు.
(04:33) నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను వారి స్పర్శ కావాలి అని ప్రాకులాడుతున్నావు కానీ నిజానికి నీకు ఆ వ్యక్తి అక్కర్లేదు. నీ మెదడులో ఆ స్పర్శ గురించి ఉన్న ఇమేజ్ మరియు ఆ ఇమేజ్ వల్ల రిలీజ్ అయ్యే కెమికల్ కిక్స్ మాత్రమే నీకు కావాలి. నువ్వు ఒక మనిషిని వాడుకొని నీ కెమికల్ నీడ్స్ ని తీర్చుకుంటున్నావు. నువ్వు ఒక స్వార్థపూరితమైన జంతువువి నువ్వు చేసే తప్పులు ఏంటో తెలుసా నువ్వు ఈ స్పర్శని ఒక వస్తువులా వాడుకుంటున్నావు.
(04:58) నీ సంతోషం కోసం అవతలి వ్యక్తి అనుమతి లేకుండా తాకడం లేదా వారి ఇష్టానికి విరుద్ధంగా బలవంతం చేయడం ఇదంతా నీ మెదడులోని ఆ కిరాతికత్వానికి నిరూపణ సమాజం వీటిని తప్పు అని చెప్పొచ్చు కానీ నీ మెదడుకు ఆ పవర్ డైనమిక్స్ అంటే ఇష్టం ఒకరిని కంట్రోల్ చేయడం వారి శరీరాన్ని నీ ఆకలికి వాడుకోవడం ఇదంతా నీ ఈగోని సాకే మార్గాలు నువ్వు అనుకుంటున్న ఆ ప్రేమ ఆ బంధం అదంతా ఒక బూటకం నువ్వు కేవలం నీ లోపల ఉన్న ఆ ఖాళీని నింపుకోవడానికి కి ఆ స్పర్శ ఆకలిని తీర్చుకోవడానికి అవతలి వ్యక్తిని ఒక సాధనంలా వాడుకుంటున్నావు.
(05:33) ఆ క్షణం అయిపోయాక ఆ మత్తు వదిలిపోయాక నీకు అవతలి వ్యక్తి ముఖం కూడా చూడాలనిపించదు. ఎందుకు ఎందుకంటే నీ అవసరం తీరిపోయింది. నీ కెమికల్ ఫ్యాక్టరీ రన్ అయిపోయింది. ఇక ఆ మనిషి నీకు అనవసరం. నువ్వు ఈ శరీరాన్ని ఈ స్పర్శని చూసి మురిసిపోకు నువ్వు ఒక బొమ్మవి నీ మెదడు నిన్ను ఆడిస్తోంది. నీకు సెక్స్ అంటే అర్థం తెలియదు. ప్రేమ అంటే అంతకంటే తెలియదు నీకు తెలిసిందల్లా ఆ కెమికల్స్ ఇచ్చే మత్తు మాత్రమే ఆ మత్తు కోసం నువ్వు నీ ఆత్మని ఉంటే గనుక నీ చుట్టూ ఉన్న మనుషుల్ని బలిస్తున్నావు ఎంత దౌర్భాగ్యుడివిరా నువ్వు నీ మెదడులోని ఆ చీకటి గదుల్ని నువ్వు గెలవలేవు అది నిన్ను
(06:13) ఏడిపిస్తుంది నిన్ను ఆడిస్తుంది చివరికి నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు చెప్పు నీ సెక్స్ ఆర్గాన్ ఏది? నీ శరీరమా? లేక నీ నాశనానికి పునాది వేస్తున్న ఆ కుళ్లిపోయిన మెదడా? ఇక వెళ్లి నీ ఆకలిని తీర్చుకో కానీ గుర్తుపెట్టుకో ఆ ఆకలి ఎప్పటికీ తీరదు. ఎందుకంటే నువ్వు పెడుతున్న మేత నీ మెదడుకి సరిపోదు. దానికి ఇంకా కావాలి ఇంకా కావాలి.
(06:37) ఆ ఇంకా అనే ఆకలిలోనే నువ్వు అంతమైపోతావు.
No comments:
Post a Comment