మహాభారతంలో యుధిష్ఠిరుడు నిజంగానే అత్యంత ధర్మబద్ధమైన వ్యక్తిగా ఉన్నాడా?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణ పరమాత్మ ధర్మరాజు, పాండవులు, ద్రౌపది ధర్మపరులు కాకపోతే వారి ప్రక్కన ఎలా ఉంటారు, మార్గనిర్దేశం చేస్తారు.
ధర్మరాజు ధర్మపరుడు కాకపోతే భీష్ముడు అతి పవిత్రమైన " విష్ణు సహస్రనామాలు " ఎలా తెలియచేస్తారు.
ద్రౌపది ధర్మరాజుతో " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు మీరు. అధర్మం చేసినవారు రాజ్యాలు ఏలుతున్నారు. ధర్మపరులు అరణ్యవాసం చేస్తున్నారు " అంటే ధర్మరాజు " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమంటావు " అంటారు.
ద్రౌపదితో దుర్యోధనుడు అంటాడు " నా ( ధర్మరాజు ) భర్తచేసినది అధర్మం అని అను, నిన్ను, మీ అందరినీ కూడా వదిలేస్తాను " అని. ఆవిడ అంటుంది " ఈ రోజు ఆయనకు దైవానుగ్రహం లేకపోవచ్చు కాని ఆయన ఎప్పుడూ ధర్మాన్ని మాత్రం తప్పరు " అని. తనను జూదంలో పందెం ఒడ్డిన భర్త గురించి ద్రౌపది అభిప్రాయం.
ధర్మరాజు ధర్మప్రవర్తన గురించి అభిప్రాయం చెప్పడానికి ద్రౌపది కన్నా అర్హులు ఎవరున్నారు.
పాండవులు తమ జీవిత చరమాంకంలో హిమాలయ యాత్రకు బయలుదేరారు. మహాయాత్ర. ద్రౌపది, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, మరియు భీముడు క్రమంగా మార్గమధ్యంలోనే తమ ప్రాణాలను వదిలారు.
చివరికి ధర్మరాజు మరియు అతనిని అనుసరిస్తూ వచ్చిన ఒక కుక్క మాత్రమే మిగిలాయి. ఆ కుక్క రూపంలో ఉన్నది సాక్షాత్తూ సమవర్తి యమధర్మరాజే. ధర్మరాజు యొక్క ధర్మదీక్షను, దయను పరీక్షించడానికి దేవతలు అతడిని అలా నడిపించారు. వారిద్దరూ స్వర్గద్వారం చేరారు. కుక్కను వదిలేసి లోపలికి రమ్మన్నారు దేవతలు. కుక్కను విడిచిపెట్టడానికి ఇష్టపడని ధర్మరాజు, చివరికి తన పుణ్యఫలాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ అచంచలమైన ధర్మానికి మెచ్చి, దేవతలు అతడిని తన భౌతిక శరీరంతోనే స్వర్గంలోకి అనుమతించారు.
ఇంక సందేహానికి తావెక్కడ, ధర్మరాజు ధర్మపరుడే.
శుభమస్తు
No comments:
Post a Comment