పాండవులను పదేపదే లేదా శాశ్వతంగా కాకుండా, కేవలం ఒక్కసారి మాత్రమే సవాలు చేసే శక్తిని జయద్రథుడికి ప్రసాదించాలని శివుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు?
ఎవరైనా ఓ దేవుడు/దేవత గురించి ఘోరతపస్సు చేస్తే అతనికి వరాన్ని ఇవ్వకుండా ఉండడం జరగదు ఆ దేవుడు, ఇచ్చి తీరాలి, ఆ తపస్సునకు ఫలితంగా.
కొందరు మరణంలేకుండా వరం అడుగుతారు. పుట్టిన వాడు మరణించక తప్పదు. బ్రహ్మ ఇంద్రాదులకే నిర్ణీత కాలవ్యవధి. అది ఇవ్వడం కదరదు కనుక వేరే వరం కోరుకోమంటారు ఆ దేవతలు.
ఇక్కడ జయద్రధుడు పాండవులను సంహరించేలా వరం అడిగాడు శివుడిని.
అటువంటి వరాన్ని ఎలా ఇస్తారు, కాని ఇవ్వకుండా ఉండడం కుదరదు. అందుకని కొన్ని షరతులతో అతను కోరుకున్నది ఇస్తారు.
శివుడు అప్పటికే అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించారు. మరి పాండవులను అందరినీ సంహరించేలా వరం ఎవరికైనా ఎలా ఇస్తారు. అందుకని అర్జునుడిని తప్ప మిగతా వారిని జయించగలవు అని వరమిచ్చారు శివుడు.
పైగా అర్జునుడు పాశుపతాస్త్రంని ఎందుకు తపస్సు చేసి సంపాదించాడు. తన కోసం మాత్రమేనా. తన వారిని ఎవరో చంపేస్తూంటే చూస్తూ కూర్చోవాలా. తను ఇచ్చిన అస్త్రానికి విలువ ఏమి ఉంటుంది. అందుకని ఓ రోజు మాత్రం నువ్వు జయించగలవు అని వరం ఇచ్చారు శివుడు.
అందుకే విష్ణువు/కృష్ణుడు అంత ఆలోచించి ప్రణాళికలు వేసేది. ఇతరులు ఇచ్చిన వరానికి విలువ తగ్గకూడదు, వరం వినాశనాన్ని కలుగచేయకూడదు.
వరంలోని షరతులు అవీ చూసి చక్కటి ప్రణాళిక వేయాలి. హిరణ్యకశిపుడిని సంహరించడం ఓ చక్కని ప్రణాళికను తెలియచేస్తుంది మనకు. మనిషి, జంతువు రూపం, సంధ్యా సమయం, ఇంట్లోనూ బయటా కాకుండా గడపమీద కూర్చోవడం, చేతి గోళ్ళతో చంపడం - అద్భుతమైన ప్రణాళిక.
వరం ఇవ్వడం తప్పదు కనుక కొన్ని అవసరమయిన జాగ్రత్తలు తీసుకుంటారు దేవతలు.
శుభమస్తు
No comments:
Post a Comment