అవధూత డిల్లెమ్మతో అనుభవాలు #youtube#viral#viralvideo#trending#spirituality#devotional#travel
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=s9Fb50ura48
Transcript:
(00:01) అరుణాచల శివ మీరు తంబ్నెయిల్ లో చూశారు కదా అవదూత డిల్లమ్మతో నా అనుభవాలు అని పక్కన ఫోటో కూడా ఉంది. ఆవిడ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉంకులూరు అనే ఒక గ్రామంలో పుట్టి పెరిగి ఆ స్థాయిని పొంది శరీరం విడిచిపెట్టిన వ్యక్తి దాదాపు మూడు నుండి ఐదు సంవత్సరాలు అయింది నాకు కరెక్ట్ గా టైం గుర్తులేదు కానీ దాదాపు మూడు నుండి ఐదు సంవత్సరాలు అయ్యింది.
(00:40) ఆవిడతో నాకు ప్రత్యక్షంగా మూడే మూడు అనుభవాలు నాకు జరిగాయి ఎందుకంటే ఉంకులూరు అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నిరంతరం కాకపోయినా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఎలా అయితే మనం నిరంతరం నిద్రలో ఉండకుండా అప్పుడప్పుడు నిద్రపోతామో అలా అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్తుంటాను. ఎలా అయితే నిద్రలో ఎంతో సుఖాన్ని మనం అనుభవిస్తామో మెలుకువలో కంటే గాఢ నిద్రలో ఎంత సుఖాన్ని అనుభవిస్తామో అలాగే అప్పుడప్పుడు ఆ ఊరు నేను వెళ్ళిన ఉంకులూరు అనే ఊరిని ఆవిడ నాకు వరసకి పెద్దమ్మ అని అవుతుంది.
(01:20) అంటే పెద్దమ్మ అని నేను పిలుస్తాను. ఆవిడతో నాకు జరిగిన అనుభవాలు అంతే ఆనందాన్ని ఇచ్చాయి నిద్రలో తురీ అవస్థలో నేను ఎంత ఆనందాన్ని ఎంత సుఖాన్ని నేను పొందుతానో ఒంగులూరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఆ పెద్దమ్మని కలిసినప్పుడు కూడా నేను అంతే ఆనందాన్ని పొందాను అందుకే ఆవిడ గురించి చెప్పుకోవాలనిపించింది. నిజంగా ఆవిడతో జరిగిన ఒక మూడు సంఘటనలు నాకు ప్రత్యక్షంగా జరిగిన మూడు సంఘటనలు చెప్తాను దాన్ని బట్టి మీకే అర్థంఅయపోతుంది.
(01:50) ఆవిడ నిజంగానే అవధూత అలాంటి స్థితి కలిగిన వ్యక్తులు అటువంటి స్థితి కలిగిన మనుషులు మీ ఊరిలో కూడా ఉన్నారు అన్న విషయం మీకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఎందుకంటే మనకి అవధూతకి మహర్షికి ఋషికి యోగికి బ్రహ్మర్షికి ఇలా వేరే వేరే స్థాయిలు ఉంటాయి. అది వాళ్ళు బిహేవ్ చేసిన విధానం బట్టి వాళ్ళ యొక్క జ్ఞాన ధార బట్టి మనం నిర్ణయిస్తాం.
(02:18) కానీ అసలు నిర్ణయించడానికి నేను ఎవరిని అనే ఒక ఆలోచన లేకుండా ఒక ఉండే స్థితి ఒకటి ఉంటుంది. ఆ స్థితి కలిగిన వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. భగవాన్ రమణులు రమణ మహర్షి అని పేరు మనం పెట్టి ఉండొచ్చు కానీ ఆయన నిజానికి మహర్షి కాదు ఆ మహర్షి బ్రహ్మర్షి ఋషి ఇలాంటి పేర్లన్నీ పడిపోయిన తర్వాత ఏ స్థితి అయితే మిగులుతుందో అది ఆయన యొక్క స్థితి.
(02:44) అదే స్థితిని ఈవిడ కూడా అనుభవించారు. నాకు ఈవిడ పేరు గుల్ల డిల్లెమ్మ ఇంటి పేరు గుల్ల ఆవిడ పేరు డిల్లెమ్మ గుల్ల డిల్లెమ్మ ఈవిడ ఎప్పుడు పుట్టారు అన్న విషయం నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుండి దేవి ఉపాసన అంటే దుర్గమ్మయ్య తల్లి యొక్క ఉపాసన చేస్తూ ఉండేది. తన ఇంటిని రోజు ఎంత నీటిగా శుభ్రం చేసి ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి ఎంత పవిత్రతగా చూసుకునేదో తన యొక్క శరీరాన్ని కూడా అంతే పవిత్రంగా చూసుకునేది.
(03:16) నిరంతరం ఒక పట్టు చీర లేదా ఒక కాటన్ చీర కట్టుకొని ఒంటి నిండా పసుపు రాసుకొని సెంటర్లో ఒక ఇంత పెద్ద బుట్టు పెట్టుకొని నుదిటిపై ఊర్లో అలా తిరుగాడుతూ ఉంటే గుర్లో దుర్గమ్మ కదలదు గానీ నిజంగా ఊరిలో కదులుతుందా అన్నట్టు భావించేవాళ్ళు ఊర్లో వాళ్ళందరూ ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది ఎవర్రా బాబోయ్ ఇంత నిండుగా ఉన్నారు ఇంత భారీ కాయం శరీరమా ఇంత లావుగా ఉంది ముఖం చూస్తే చూస్తే ఇంత పెద్దదిగా ఉంది ఆ బొట్టు చూస్తే ఇంత పెద్దదిగా ఉంది ఇదేంటిరా బాబు ఇలా ఉంది భయమేస్తుంది.
(03:52) నిజంగా కాళికామాతం చూస్తే మనక ఎంత భయంేస్తదో అలా ఉంది ఆ వికృత రూపం అంటే ఆ యొక్క రూపం అంత భయంకరంగా ఉంది కానీ ఆవిడ యొక్క స్థితి ఆవిడ యొక్క మాటలు ఆవిడ యొక్క మనసు అంత అందంగా అంత ముద్దుగా ఉండేది. అస్సలు వదిలిట్ట వదిలి రాబుద్ది అవ్వదు అంత బాగుంటుంది ఆ స్థితి అలాంటి ఆవిడ పెళ్లి చేసుకుంది పిల్లల్ని కంది ఊర్లో ఎప్పుడైనా ఎవరికైనా ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా ఎవరైనా ఇంట్లో ఏదైనా బాగుపడాలని అనుకున్నా ఆ ఇంట్లో సంబరం చేస్తుంది. ఏదో ఒక సంబరం చేస్తుంది.
(04:29) అమ్మవారికి ఏదో ఒకటి ఉత్సవం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ కుటుంబం పై పడేలా చేస్తుంది. ఊర్లో ఎవ్వరికీ ఏ సమస్య వచ్చినా ఊర్లో ఎవరికైనా పెళ్లి కావట్లేదు అమ్మ ఫలానా సంబరం చేద్దాం అమ్మ అని తక్కువ డబ్బుల్లో అయ్యేలా వాళ్ళ కుటుంబం అందరూ కూడా పాల్గొనేలా చేయించి అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క కుటుంబం మీద పడేలా చేస్తుంది.
(04:52) అంత స్థితి కలిగినటువంటి తల్లి అలాంటి తల్లితో నాకు మూడు అనుభవాలు జరిగాయి ఆ మూడిటిని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఆవిడ అవధూత అని సో నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు మా పక్క ఊర్లో తిరిగిన ఒక ఆవిడ గురించి నేను చెప్తున్నందుకు మొదటి సంఘటన దాదాపు 10 అయిన ఒక మూడు సంవత్సరాలకి ఈ సంఘటన జరిగింది.
(05:21) సాధారణంగా నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒరేయ్ నాన్న దూరంగా ఉన్నప్పుడైనా సరే ఒరేయ్ నాన్న ఇలారా అని చెప్పి దగ్గరికి తీసుకొని ఒళ్ళంతా చక్కగా నిమురుతుంది తల నిమురుతుంది చేతులు నిమురుతుంది చాతి నిమురుతుంది చక్కగా నిమిరి ఒల్లో పడుగులు పెట్టుకుంటుంది ఆ నన్ననే కాదు ఏ పిల్లాడినైనా సరే నేనేదో స్పెషల్ అని కాదు ఏ పిల్లాడినైనా సరే అలానే ట్రీట్ చేస్తుంది ఆ మహానుభావురాలు దగ్గరికి తీసుకొని చక్కగా ఊళలో తల పెట్టించుకొని చక్కగా తలనిమురుతూ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులతో మాట్లాడుతుంటుంది.
(05:56) ఆ అమ్మవారి గురించి ఈ అమ్మవారి గురించి ఆ కథలు ఈ కథలు ఆ ఘట్టాలు ఈ ఘట్టాలు ఇవన్నీ మాట్లాడుతుంటుంది. వినడానికి ఎంత అందంగా ఉంటాయో ఆ కథలు ఒకరోజు అలా పడుకొని ఉండగా నేను అమ్మ ఊళలో ఆ ఢిల్లమ్మ అనే ఆ దాసరాలమ్మ ఊర్లో వాళ్ళందరూ దాసురాలమ్మ దాసురాలమ్మ అంటారు నేను పెద్దమ్మ అని పిలిచేవాడిని ఉన్న కాస్త ఆ చలువుకుంది. ఒకరోజు అలాగే ఊళలో పడుకొని ఉండగా చుట్టుపక్కల ఉన్నవారు అమ్మ నిజంగా అమ్మవారిని ఎప్పుడైనా చూశారా అని అడిగారు.
(06:27) నేను నిద్ర అయితే పోతున్నాను కళ్ళయితే మూసుకున్నాను కానీ ఇంకా సెన్సస్ పనిచేస్తున్నాయి. ఆవిడ చెప్పడం మొదలు పెట్టింది ఎంత దారుణంగా చెప్పిందంటే నిజంగా ఆ మహానుభావురాలకి అమ్మవారు కనిపించిందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కళ్ళు మూసుకున్న కళ్ళు మూసుకున్న సరే కళ్ళ ముందు స్పష్టంగా కనిపించినట్టయింది అంత గొప్పగా ఉంది ఆ నెర్రేషన్ పక్క ఊరు నుండి మర్రి చెట్టును దాటి అర్ధరాత్రి వస్తూ ఉంటే సంబరాలు చూసి తెల్లటి శరీరం పచ్చని చీర మోకాళ్ళ కింద దాకా జుత్తు వెనకాల ఒక అగరొత్తుల పొగ నిజంగా ఒక సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుందో అమ్మోరు సినిమాలో ఆ ఘట్టాన్ని రమ్యకృష్ణ అమ్మూరుగా
(07:12) కూర్చున్న ఘట్టాన్ని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నిజంగా ఎవరైనా వినే వాళ్ళకి రాత్రి అమ్మవారి కలలోకి రాక మానదు. అంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసింది నిజంగా ఇంచు బై ఇంచు కను రెప్ప నుండి ఆ కను సైగ చేసే వరకు ప్రతిది అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది నిజంగా అమ్మవారిని చూసిందేమో మనకు తెలిీదు కదా ఆవిడ అనుభవించింది మనక ఎట్లా తెలుస్తుందో చెప్పండి ఎందుకంటే 24 గంటలు ఆ ధ్యాసలోనే ఉంటారు.
(07:41) వేరే ధ్యాస అంటూ ఉండదు కదా ఆ రోజు ఫస్ట్ టైం గుల్లో కాకుండా కలలో కళ్ళ ముందు ఒక అమ్మవారు నిజంగా ఇంత బాగుంటుందా అనే ఒక భావన నాకు జరిగిన మొట్టమొదటి ఘట్టం అది అంటే ఎంత మైండ్ లో ఎంత క్లియర్ విజన్ ఉంటే ఎంత అనుభవించి ఉంటే ఎంత తాదాత్మత చెంది ఉంటే అలా పడతాయి మాటలు చెప్పండి ఇది నాకు జరిగిన మొదటి ఘట్టం ఇక రెండోది ఉంటుందండి నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టం అది.
(08:13) అమ్మ ఎవరి ఎవరైనా సరే నన్నేనా కాదు ఏ పిల్లలనైనా సరే చాలా దగ్గరగా తీసుకుంటుంది అని చెప్పాను కదా నేనంటే కాస్త ఇంకొక్క మెట్టు ఎందుకంటే కాస్త దగ్గర చుట్టమని చెప్పి ఒకరోజు కాస్త దూరంగానే ఉన్నాను దాదాపు ఒక 100 అడుగులు దూరంలో ఉండగా ఒరేయ్ నాన్న రారా అని పిలిచింది పరిగెట్టు పరిగెట్టుకొని వెళ్ళాను ఎందుకంటే ఒల్లో పడుకోవచ్చు మిగిలిన వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వరు కదా అయితే అమ్మ లేకపోతే ఈవిడ ఎలా కొంతమంది ఉంటారు అలా దగ్గరికి తీసుకొని వల్లో పడుకొని పెట్టుకునేవాళ్ళు పరిగెట్టి పరిగెట్ వెళ్లి ఆవిడ పక్కన కూర్చొని పడిపోయాను.
(08:45) ఈ ప్రాసెస్ లో నేను చెప్పులు దిగడం మర్చిపోయాను. చుట్టుపక్కల అందరూ ఉన్న ముసల వాళ్ళు అన్నారు ఇంక్లూడింగ్ మా అమ్మగారితో సహా ఒరేయ్ ఏంట్రా అది పెద్దమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు బయట వదిలేసి రావాలని తెలియదా వెళ్ళు చెప్పులు బయట వదిలేసారా అని అన్నారు. సరే తప్పు నాదే ఆ కంగారులో ఆ దీంట్లో వచ్చేసాను నిజంగా తప్పు నాదే అని చెప్పి మళ్ళీ వెళ్తూ బయట చెప్పులు వదిలేసి మళ్ళీ లోపలికి వద్దాంలే అని చెప్పి బయటికి వెళ్తున్నా వెంటనే ఆవిడ ఒక మాట ఉందండి తల్లి దగ్గర కొడుకు రావడానికి చెప్పులు వదిలేసి జుట్టు తీసేసి ఇవన్నీ రావాలా ఎలా ఉన్నవాడు అలా వస్తే తల్లి స్వీకరించదా
(09:23) నువ్వు రారా నాన్న అంది. అది భగవంతుడి యొక్క స్థాయి అండి అది ఊరికినే అందుకునే స్థాయి అనుకుంటున్నారా మీరు ఎందుకంటే కాస్త పేరు వచ్చే టైం పేరు వచ్చే టైం కి ఎవరైనా సరే మన దగ్గరికి వస్తున్నారంటే ఏయ్ నా దగ్గరికి రావాలంటే కాళ్ళు కడుక్కొని రావాలి అలా రావాలి ఇలా రావాలి అని మనం 100 కండిషన్లు పెడతాం. బట్ ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఒరేయ్ నాన్న చెప్పులు వేసుకొని రావాలి జుత్తు తీసుకొని రావాలి గుండెలు చేసుకొని రావాలి ఏంట్రా ఇది నువ్వు రా దా అని చెప్పి చెప్పులతోనే దగ్గరకి తీసుకొని నా తలను తన యొక్క ఒళలో పెట్టుకొని జో కొట్టింది.
(09:58) అంటే కనీసం నాకు ఏదో గౌరవం ఇవ్వాలి నేను ఈ స్థాయిలో ఉన్నా నాకు గౌరవం కావాలి నాకు మర్యాదలు కావాలి గౌరవ మర్యాదలు కోరుకునే నిజమైన స్థితే రమణ స్థితి భగవంతుడు అనుభవించే స్థితి అదే ఆ స్థితి ఆవిడ స్పష్టంగా అనుభవించింది నేను నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇది నాకు జరిగిన ఘట్టం నేను అనుభవించిన ఆనందం ఇది రెండోది ఇక మూడోది దాదాపు మూడు నుండి ఐదు సంవత్సరాల క్రిందట అనుకుంటా నాకు కరెక్ట్ గా గుర్తులేదు ఇప్పుడు చనిపోయారని బట్ చనిపోయినప్పుడు వెళ్ళా అందరిలా కాకుండా దహన సంస్కారాలకు ఆవిడకి వేరే విధంగా జరిగాయి పెద్దమ్మకి అంటే పాతి పెట్టారు
(10:39) అనుకోండి ఇప్పుడు గుడి కూడా కట్టారు చిన్న గుడి కట్టారు అమ్మకి పెద్దమ్మకి ఏం చేశారంటే ఒక బుట్ట లాంటి పల్లకిలో శవాన్ని పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉన్నారు. నేను నిజంగా శవాన్ని చాలా దగ్గరగా చూశాను దాదాపు ఒక ఐదు నుండి 10 అడుగుల దూరం నుంచి చూశను నేను. నిజంగా అండి మనిషి ఒక సమాధి స్థితిలో ఒక కంప్లీట్ స్మసాన వైరాగ్యం వచ్చినవాడు ఒక నిరంతరం సమాధి స్థితిలో ఉన్నప్పుడు కుండలిని జాగృత అయిన వాడి యొక్క ముఖం ఎంత తేజస్సుతో ఎంత టీవీతో వెలిగిపోతుందో అంత వెలుగుతుంది ముఖం పసుపుంతా రాసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టిన ముఖం నిండుగా వెలుగుతుంది అప్పుడు అనిపించింది 24 గంటలు
(11:23) అదే ధ్యాసలో ఉండి ఆత్మ విచారణ చేస్తూ ఆ స్థితిని అనుభవించినవాడు బ్రహ్మవిత్ బ్రహ్మ హైవ భవతి అంటుంటారు కదా నిజంగా అమ్మవారు అయిపోయిందేమో లేకపోతే ఏంటి ఆ ముఖంలో ఆ తేజస్సు ఏంటి ఆ టీవీ ఏంటి ఆ వెలుగు ఏంటి అని అనిపించింది. అది అందరికీ కనిపించదండి కొంతమంది ముఖం చనిపోయిన తర్వాత ముఖమైనా శరీరమైనా కట్టగట్టిగా పోయిఉంటుంది అంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయి చూడడానికి కాస్త భయమేస్తది.
(11:50) కానీ ఈ పెద్దమ్మ మొఖం చనిపోయినప్పుడు చనివితేలా చూశ ఆ అందం ఇప్పటికీ వర్ణించలేను అంటే చనిపోయినా సరే ఆ ముఖంలో తేజస్సు ఆ టీవీ తగ్గలేదు. ఈ మూడు ఘట్టాలు నా జీవితంలో ఈ అమ్మతో జరిగాయి. ఈరోజుకి కూడా ఆ ఊరు వెళ్తుంటే రోడ్డు పైన పక్కనే ఇల్లు అలా చూస్తూ వెళ్తుంటా అరే ఒకప్పుడు ఒరేయ్ నాన్న రారా అని పిలిచేది.
(12:21) ఇప్పుడు ఆ పిలుపు లేదే సమస్త విశ్వంలో కలిసిపోయిందే ఒకప్పుడు ఆ ఒల్లో పడుకునేటప్పుడు అమ్మ పీల్చుకునే శ్వాస అమ్మ వదిలే శ్వాస నా నుదుటికి తాకేది అరే ఇప్పుడు అంత తాకట్లేదే అనే ఒక చిన్న బెంగ ఉన్నా సమస్తము నిండి ఉంది అని గుర్తించగలిగే ఒక స్థితిలో ఇప్పుడు నేనున్నాను కాబట్టి అందుకు ఆనందంగా కూడా ఉంది. నిజంగా అండి అమ్మ ఎప్పుడు కూడా అమ్మవారి మీద ఈజీగా అమ్మవారు వాలుతుంది దుర్గమ్మ ఎవరైనా వచ్చి ఏదైనా కుటుంబానికి సంబంధించిన సమస్య పరిష్కారం అడిగేటప్పుడు సమస్య చెప్పి పరిష్కారం అడిగేటప్పుడు కాస్త ఇలా ఊగుతుంది అని ఊగుతూ కాస్త సౌండ్ చేస్తూ ఆ కింద పెదవే షేక్ అవుతుందండి ఆ షేక్
(13:08) అయ్యేటప్పుడు అమ్మ నుండి వచ్చే ఆ వాయిస్ గంభీరమైన వాయిస్ ఆ కుటుంబం యొక్క సమస్యకు పరిష్కారం చెప్తూ ఉంటే నిజంగా ఆ మాటలు వింటేనే సగం సమస్య పోతుందేమో అన్నంత బాగుంటాయి ఆ మాటలు అది ఆ స్థాయిలో ఉన్నవాళ్ళండి వాళ్ళల్లో ఉండే ప్రేమ వాళ్ళలో ఉండే జాలి వాళ్ళలో ఉండే ఆ స్థితి అది అనుభవిస్తే మాత్రమే మనకు తెలుస్తుంది మనం నోటితో చెప్పలేం జరిగిన మూడు గట్టాలే చిన్నప్పటి నుండి ఆవిడ గురించి విన్న కొన్ని మాటలే నా చేత ఇవన్నీ పలికించాయేమో ఇలాంటి స్థితి కలిగిన వ్యక్తులు మీ ఊళ్ళల్లో మీ వీధుల్లో మీ ఇంటి పక్క పక్కలో కూడా ఉంటారు ఎంతసేపు నెగిటివ్ గా ఉండే పీపుల్స్ గురించి వీడు
(13:53) ఎలాంటోరా వాడు అలాంటోడురా అని అవతల వాళ్ళకి చాడీలు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఒక్కరు ఉన్నారా అని చెప్పి ఆ వ్యక్తితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిహి అన్నాడు పరమాత్మ పరమాత్మ వేరు జీవాత్మ వేరు ఆత్మ వేరు మూడు వేరు అనే ఒక స్థితి పడిపోతే అనుభవించే స్థితి ఇది అలాంటి స్థితి కలిగిన వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటారు వాళ్ళని గుర్తించి వాళ్ళతో నాలుగు ముచ్చట్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క జీవితం
(14:29) ఉద్ధరించబడుతుంది. వాళ్ళు మీరు ఒక్కటనే స్థితిని గుర్తించండి. అలా అందరూ గుర్తించి ఆ స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అరుణాచల శివ శ్రీమాత్రే నమః
No comments:
Post a Comment