Saturday, August 15, 2026

ఇలాంటి సైకోతో ప్రేమలో పడతానని ఊహించలేదు | Anupama- Dhruv Controversy Telugu 🚨 | Mr Venkat Talks

ఇలాంటి సైకోతో ప్రేమలో పడతానని ఊహించలేదు | Anupama- Dhruv Controversy Telugu 🚨 | Mr Venkat Talks

Author Name:Mr Venkat Talks

Youtube Channel Url:https://www.youtube.com/@mrvenkatTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YRONOIDzsk0



Transcript:
(00:03) ఒకప్పుడు అనుపమ పరమేశ్వరన్ పేరు ధ్రువిక్రంతో కలిసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు అదే ప్రేమ కథకు బ్రేకప్ అయిపోయిందంటూ కొత్త టాక్ మొదలైంది. అంతేకాదు అనుపమ తాజాగా చెప్పిన కొన్ని మాటలు ధ్రువ విక్రం గురించే అంటూ ఈ చర్చను మరింత సీరియస్ గా మార్చాయి.
(00:24) రెండేళ్ల పాటు తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అనుపమ ప్రేమించింది ధ్రువిక్రం నేనా నిజంగానే ఇద్దరు విడిపోయారా అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనుపమ ప్రేమ గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 2021లో అభిమానులతో జరిగిన ఓ Instagram ఇంటర్వ్యూలో తన జీవితంలో నిజమైన ప్రేమ ఉందని బ్రేకప్ కూడా జరిగిందని అనుపమ చెప్పింది.
(00:52) అంటే అప్పటికే తన జీవితంలో ఓ ప్రేమ కథ ఓ బ్రేకప్ ఉన్న విషయాన్ని ఆమె స్వయంగా చెప్పేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరు ఎప్పుడు ప్రేమ మొదలైంది ఎందుకు విడిపోయారు అనే విషయాలు మాత్రం అప్పట్లో చెప్పలేదు. దీంతో ఆ ప్రేమ కథ ఎవరితో అనేది మాత్రం అప్పట్లో మిస్టరీగానే మిగిలిపోయింది. కట్ చేస్తే 2025 లో అనుపమ ధ్రువిక్రం కలిసి బైసన్ కాలమాడన్ మూవీలో నటించారు.
(01:15) ఇక అప్పటికే వీళ్ళద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు మొదలయ్యాయి. షూటింగ్ సమయంలో ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం ఆ తర్వాత సోషల్ మీడియాలో బయటికి వచ్చిన కొన్ని క్లూస్ ఈ టాక్ మరింత బలమిచ్చాయి. 2025 ఏప్రిల్ లో మాత్రం ఈ రూమర్ ఒక్కసారిగా పెద్దదైంది. బ్లూమూన్ పేరుతో ఒక స్పాట్ వై ప్లేలిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది అనుపమ ధ్రువు కలిసి మెసేజ్ చేస్తున్న ప్లేలిస్ట్ అని అభిమానులు భావించారు.
(01:40) అంతేకాదు దాని డిస్ప్లే పిక్చర్ లో అనుపమను పోలీస్ అమ్మాయి ధ్రువును పోలీస్ అబ్బాయి కిస్ చేసుకుంటున్న ఫోటో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే చర్చ మొదలైంది. అక్కడితో ఈ లవ్ రూమర్ ఆగిపోలేదు. 2026 లో జరిగిన కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో వీళ్ళద్దరి మధ్య కనిపించిన కంఫర్ట్ కూడా ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది.
(02:05) ఓ అవార్డ్ ఈవెంట్ లో ధ్రువ అనుపమకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఆమె సిగ్గుపడుతూ కనిపించింది. అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఎవరికైనా రాత్రిరెండు గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఎవరికీ చేస్తారని అడిగితే ధ్రువుకు కాల్ చేస్తాను అని అనుపమ చెప్పిన వీడియో వైరల్ అయింది. ఇక మరో ఈవెంట్ లో ధ్రువ అనుపమతో దిగిన క్లోజ్ సెల్ఫీని పోస్ట్ చేయగా అనుపమ దాన్ని హార్ట్ ఎమోజీతో రీషేర్ చేసింది.
(02:31) దీంతో ఫ్యాన్స్ కు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని రేపో మాపో పెళ్లి చేసుకుంటారని ధ్రువ ఫ్యామిలీ అంటే హీరో జియాన్ విక్రం కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇటువంటి టైంలో అప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుపమ జూలైలో ఒక్కసారిగా వరుస పోస్ట్లు పెట్టింది. ఒక పోస్ట్ లో జీవితంలో కొన్ని విషయాలను వదిలేస్తేనే ప్రశాంతత దొరుకుతుందని అర్థం వచ్చేలా రాసింది.
(02:55) ఇక మరో పోస్ట్ లో ఇక తన గొంతును తానే ఎంచుకుంటానని తన జీవితాన్ని తానే ఎంచుకుంటానని ఇక ఎవరి అనుమతులు అడగనని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఏదో జరిగింది. ఇది బ్రేకప్ తర్వాత వచ్చిన పోస్ట్లే అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక దీనికి తోడు అనుపమ మరోసారి అకౌంటబిలిటీ అనే పదాన్ని హైలైట్ చేస్తూ పోస్ట్ పెట్టింది.
(03:18) అంటే చేసిన పనులకు బాధ్యత తీసుకోవడం తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పడం. ఇక ఈ పోస్ట్లు అన్నింటిని కలిపి చూసిన నెటిజన్లు ధ్రువుతో ఆమెకు బ్రేకప్ అయిందనే నిర్ణయానికి వచ్చేశారు. కొన్ని మీడియా కథనాల్లో అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగిందనే రూమర్లు కూడా వచ్చాయి. హోటల్లలో గొడవ జరిగిందనే టాక్ కూడా బయటక వచ్చింది. ఇంత జరుగుతున్న సమయంలో ఆగస్టు 12న అనుపమ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఈ మొత్తం కథను ఒక్కసారిగా మరో లెవెల్ కి తీసుకెళ్ళింది.
(03:47) ఐ యామ్ విత్ ధాన్య వర్మ కార్యక్రమంలో మాట్లాడిన అనుపమ తన జీవితంలో చాలా కాలంగా దాచుకున్న విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా తను రెండేళ్ల పాటు నార్సిస్టిక్ అబ్యూస్ ఎదుర్కొన్నానని చెప్పింది. తనఇగ లో పెట్టిన పోస్ట్లు ఒక్క రోజులో వచ్చిన ఆలోచనలు కావని వాటి వెనక రెండేళ్ల పాటు తాను అనుభవించిన బాధ ఉందని చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు మరింత వైరల్ అయింది.
(04:12) అసలు నార్సిస్టిక్ అబ్యూస్ అంటే ఏంటి అనుపమ చెప్పిన దాని ప్రకారం ఇది ఒక్క రోజులో మొదలయ్యే విషయం కాదు. మొదట్లో ప్రేమలా అనిపిస్తుంది. కానీ క్రమంగా ఎదుటి వ్యక్తిపై కంట్రోల్ పెంచడం ఎప్పుడు అటెన్షన్ కావాలని చూడటం తమకు నచ్చినట్టే ఎదుటి వాళ్ళు ఉండాలని కోరుకోవటం లాంటివి మొదలవుతాయి. చివరికి ఆ వ్యక్తి తనకేం జరుగుతుందో కూడా గుర్తించలేని పరిస్థితికి వెళ్ళొచ్చని అనుపమ చెప్పింది.
(04:35) ఇక తాను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కున్నానని ఆమె వివరించింది. ఇక్కడి నుంచే అనుపమ చెప్పిన విషయాలు మరింత పర్సనల్ గా మారాయి. ఆ రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత తాను క్రమంగా తనను తాను కోల్పోయానని చెప్పింది. తన వ్యక్తిత్వం తనలోని ఉత్సాహం తగ్గిపోయినట్లు అనిపించిందని చెప్పింది. అంతేకాదు తన బరువు కూడా చాలా తగ్గిపోయిందని తాను వికసించాల్సిన సమయంలో లోపలికి ముడుచుకుపోయినట్లుగా అనిపించిందని చెప్పింది.
(05:02) అంటే ఇది కేవలం ఇద్దరి మధ్య వచ్చిన చిన్న గొడవ కాదని ఆ సంబంధం తనపై చాలా గట్టిగా ప్రభావం చూపిందనే విషయం ఆమె మాటల్లో కనిపిస్తుంది. ఇంకో విషయం కూడా అనుపమ చెప్పింది. ఆ రిలేషన్షిప్ చాలా వేగంగా ముందుకు వెళ్ళిందట మొదటి ఒకటి రెండు డేట్స్ తర్వాత ఆ వ్యక్తి తనను ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడట. ఇక వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసిందట.
(05:26) ఆ తర్వాత కేవలం మూడు నెలల్లోనే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడటం మొదలైందని అనుపమ చెప్పింది. ఇక ఎంగేజ్మెంట్ ఎక్కడ చేయాలి ఎంతమంది రావాలి లాంటి విషయాల గురించి కూడా ఇరు కుటుంబాల్లో చర్చ మొదలైందట. కానీ ఇంత వేగంగా జరుగుతున్న ఈ పెళ్లి వ్యవహారానికి అనుపమ మాత్రం ఓకే చెప్పలేదు. తనకు మరింత సమయం కావాలని చెప్పి ఎంగేజ్మెంట్ కు ఆమె వెనక్కి తగ్గింది.
(05:51) తనపై గోల్డ్ డిగ్గర్ అంటూ వచ్చిన విమర్శల గురించి కూడా మాట్లాడింది. తాను అప్పట్లో ఎంగేజ్మెంట్ కు ఒప్పుకొని ఉంటే తర్వాత అదే పెళ్లి చివరకు విడాకుల వరకు వెళ్లేదని అనిపించిందని చెప్పింది. అందుకే అప్పుడే తాను వెనక్కి తగ్గానని వివరించింది. అంటే బ్రేకప్ జరగడానికి ముందే ఆ రిలేషన్షిప్ తనకు సరైనది కాదని ఫీలింగ్ అనుపమలో వచ్చిందని ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది.
(06:15) అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం ఉంది. ఆ రిలేషన్షిప్ ప్రభావం తన పర్సనల్ లైఫ్ కి మాత్రం పరిమితం కాలేదని అనుపమ చెప్పింది. ఇక తన కెరియర్ పై కూడా దాని ప్రభావం పడిందని ఆరోపించింది. డ్రాగన్ తన కెరియర్ లో పెద్ద హిట్ అయినప్పటికీ దాని ప్రమోషన్ కు తాను ఎందుకు వెళ్ళలేదో ప్రశ్నించింది. చాలా సినిమాలను కూడా తాను వదులుకున్నానని చెప్పింది.
(06:37) ఇక తన నుంచి మొదలుపెట్టి తన జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆ వ్యక్తి కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడని అనుపమ ఆరోపించింది. ఇక ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండేదో చెప్పడానికి అనుపమ ఓ ఉదాహరణ కూడా ఇచ్చింది. విక్రం నటించిన అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తూ ఆ వ్యక్తితో తన జీవితం కూడా అలానే అనిపించేదని చెప్పింది. ఒకరోజు ఎంతో ప్రేమగా ఉంటాడట. అప్పుడు ఇంత మంచి వ్యక్తి నా జీవితంలో ఉండడం నా అదృష్టం అనిపించేదట.
(07:03) కానీ మరుసటి రోజే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయేదని చెప్పింది. ఆ తర్వాత క్షమాపణలు ఏడుపులు ఇకపై ఇలా చేయనని హామీలు మళ్ళీ కొంతకాలానికి అదే పరిస్థితి. ఇలా ఒకరోజేమో రెమో మాదిరిగా మరోరోజు అపరిచితుడాలా కనిపించేవాడట. మళ్ళీ కాసేపటికి ప్రేమగా మారిపోయేవాడని ఒక సైకిల్లా ఇదంతా రిపీట్ అవుతుందని అనుపమ చెప్పింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే తనను బాధ పెట్టి తర్వాత మళ్ళీ తనకు ఓదార్పించే వ్యక్తిగా మారేవాడని అనుపమ చెప్పింది.
(07:34) దాంతో అతను లేకుండా తాను ఉండలేనన్న ఫీలింగ్ వచ్చిందని వివరించింది. ఇక తనకు సంబంధం లేని విషయాల్లో కూడా చివరికి తప్పు తనదే అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయానని చెప్పింది. అందుకే ఇప్పుడు తాను ఆ పరిస్థితి నుంచి బయటక వచ్చి మళ్ళీ తన జీవితాన్ని తానే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె మాటల్లో అర్థమవుతుంది.
(07:54) మరి ఇంతకీ ఈ వ్యక్తి ధ్రువ విక్రం నేనా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే అనుపమ తన మాది భాగస్వామి పేరు ఎక్కడా చెప్పలేదు. పైగా అది 2021 లో జరిగిన స్టోరీ. ఇప్పుడు అనుపమ చెప్తుంది రీసెంట్ గా రెండేళ్ల పాటు సాగిన ఒక రిలేషన్షిప్ స్టోరీ. దీనికి తోడు ధ్రూతో అనుపమకు లవ్ అంటూ గతంలో ఎన్నో పబ్లిక్ క్లూస్ బయటక వచ్చాయి. స్పాట్ఫై ప్లేలిస్ట్ వైరల్ ఫోటో అవార్డ్ ఫంక్షన్స్ లో కనిపించిన క్లోజ్నెస్ రాత్రిరెండు గంటలకు కాల్ చేయాల్సి వస్తే ధ్రువుకు కాల్ చేస్తాను అన్న మాట క్లోజ్ సెల్ఫీలు ఇవన్నీ ఇద్దరికీ ఉన్న రిలేషన్షిప్ ని చూపిస్తున్నాయి. కానీ వీటన్నింటి ఆధారంగా
(08:31) అనుపమ చెప్పిన ఆ వ్యక్తి ధ్రువ అని ఖచ్చితంగా చెప్పడానికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. అంతేకాదు ఆగస్టు 2న ధ్రువుతో బ్రేకప్ రూమర్ల గురించి అనుపమను అడిగినప్పుడు కూడా ఆమె ఎవరి పేరు చెప్పలేదు. తనఇస్గ్ర లో ఏం పెట్టాలో తానే నిర్ణయించుకుంటానని చెప్పింది. ఇక ఆ పోస్ట్లు ఎవరి మీద కోపంతో పెట్టినవి కావని కూడా ఆమె స్పష్టం చేసింది.
(08:56) తాను ఎవరిని టార్గెట్ చేయలేదని ఒక మహిళ జీవితంలో జరిగే మార్పుల గురించి మాత్రమే మాట్లాడానని చెప్పింది. ఇక తనఇస్గ పోస్టులు చూసి తన జీవితంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసు అనుకోవద్దని కూడా ఆమె చెప్పింది. కానీ ఇప్పుడు ఆగస్టు 12న ఆమె చెప్పిన రెండేళ్ల బాధ గురించి బయటికి వచ్చిన మాటలు పాత రూమర్లను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయి.
(09:20) జూలైలో ఆమె పెట్టిన ఇక భయం లేదు నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను అనే పోస్ట్లు ఇప్పుడు చూస్తే ఆమె చెప్పిన ఈ రెండేళ్ల కథతో కనెక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. అయితే అవి ఎవరిని ఉద్దేశించి పెట్టిందో మాత్రం అనుపమ స్వయంగా చెప్పలేదు అందుకే ఇక్కడ మనం కూడా ఒక లైన్ దాటకూడదు. ధ్రువ పేరు ఈ కథలో బలంగా వినిపిస్తున్న అది ఇప్పటికీ రూమర్ అంతే ఏది ఏమైనా అనుపమ జీవితంలో రెండేళ్ల పాటు సాగిన ఒక రిలేషన్షిప్ ఆమెకు చాలా బాధను మిగిల్చింది.
(09:50) అయితే ఆ వ్యక్తి ఎవరో మాత్రం ఆమె ఇంకా బయట పెట్టలేదు. ఈ స్టోరీ ధ్రువ విక్రమ్ పేరు వినిపిస్తున్న అది ఎంతవరకు నిజమో మనం ఇప్పుడే చెప్పలేం. అసలు నిజం ఏంటో తెలియాలంటే అనుపమ ఆ వ్యక్తి ఎవరో స్వయంగా చెప్పాల్సిందే. అప్పటివరకు ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం సస్పెన్స్ గానే ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది అనుపమ ప్రేమించిన ఆ వ్యక్తి ధ్రువ విక్రమేనా కామెంట్ ద్వారా తెలియజేయండి.
(10:12) మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.

No comments:

Post a Comment