Tuesday, May 14, 2024

 *_నేటి సమాజంలో అణిగిమనిగి ఉంటే అవసరం అనుకుంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పని లేదంటారు. ఎదిరిస్తే వెధవ అంటారు. స్టైలిష్ గా ఉంటే బిల్డప్ అంటారు. కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి " గొప్పోడు " అనే స్థాయిలో చూస్తారు ఇదే ఈ లోకం తీరు._*
*_ఓటమి, ఒంటరితనం ఇవి రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, మరొకటి ఎవరిని నమ్మాలో.. ఎలా బ్రతకాల్లో నేర్పిస్తుంది._*
*_పిరికి మాటలు మాట్లాడొద్దు, వినొద్దు మీ అభివృద్ధికి అవే  ఆటంకాలు. ఎవరినైనా సరే పదిమందిలో ప్రశంసించాలి. అవసరమైతే ఏకాంతంలో మాత్రమే మందలించాలి._*
*_కొంతమంది అవసరం పడినప్పుడే మిమ్ములను గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి. అంధకారంలో వారికి మీరే ఆశాకిరణం కావచ్చు గుర్తించండి._*
*_కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు.ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసే చేస్తే అది నమ్మకద్రోహం._*
*_చెంప మీద కొట్టే వారిని క్షమించు కానీ,మీ జీవితం మీద దెబ్బకొట్టే వారిని ఎప్పటికీ క్షమించకండి.☝️_*

 *_✍️మీ...డా,, తుకారాం జాదవ్. 🙏_*

No comments:

Post a Comment