Tuesday, May 14, 2024

మరపు మనిషి లక్షణం కావచ్చు,కానీ నీకు మేలు చేసి, నీ కష్టాలు తీర్చిన వ్యక్తిని మైమరచి పోయే గుణం మాత్రం....

 సాధారణంగా మనకి కొన్ని విషయాల పై ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుంది... దాన్ని మనం సెంటిమెంట్ అంటాం. ఫలానా కలర్ డ్రెస్ వేసుకుంటే విజయం వస్తుందని, ఫలానా వారు ఎదురొస్తే పని సఫలం అవుతుందని, ఫలానా రోజు కార్యం మొదలు పెడితే కార్యం నెరవేరుతుందని, ఇలా అనేక రకాల సెంటిమెంట్స్ ని మనం వదలకుండా నిరంతరాయంగా పాటిస్తునే ఉంటాం....ఇవే సెంటిమెంట్స్ మన కార్యాన్ని సాకారం చేసి, మనకు ఉపయోగపడిన వారి విషయంలో పాటిస్తున్నామా! అని ప్రశ్నించుకుంటే! సమాధానం సందిగ్ధమవుతుంది. ఒక వ్యక్తి వల్ల మనం మేలు పొందినప్పుడు! ఆ వ్యక్తిని మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండడం మన కనీస ధర్మం.... అలా చేయకపోతే! ఆ సెంటిమెంట్స్ ను మన స్వార్థం కోసం ఉపయోగించుకున్నట్లు లెక్క .... మనకు దాహం వేసినప్పుడు నీళ్ళిచ్చి మన దాహార్తి తీర్చిన వారి మేలు, వారికి అవసరం వచ్చినప్పుడు పాలిచ్చి మాత్రమే ఋణం తీర్చుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు..... సాధారణంగా మనం సాయం పొందిన వెంటనే ఆ వేడిలో మాత్రమే, కృతజ్ఞతలు చెబుతాం. .. తర్వాత్తర్వాత ఆ విషయం మర్చిపోయి, మొహం చాటేస్తాం. మరపు మనిషి లక్షణం కావచ్చు,కానీ నీకు మేలు చేసి, నీ కష్టాలు తీర్చిన వ్యక్తిని మైమరచి పోయే గుణం మాత్రం శాపం క్రింద లెక్క. క్షమించరాని అపరాధమే....

No comments:

Post a Comment