ధైర్యం..
ఎవరి అలవాట్లు, అభిప్రాయాలు వారివి. కానీ మళ్లీ అప్పుడప్పుడూ.. 'ఏమిటో జీవితం ఇలా అయిపోయింది' అనుకుంటాం. దానికి బాధ్యులెవరు? మనమే చేసుకున్నాం. నీ ఇంట్లో నువ్వు భార్యాపిల్లలతో కలిసి ఉండు. గంజినీళ్లల్లో ఉల్లిపాయ నంజుకుని తిన్నా పర్వాలేదు. అప్పు చేయకు. మనిషికి ఇంతకు మించి జీవితం లేదు.
అలాగే.. 'మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు?' అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య అనో భర్త అనో, పిల్లలు, పేరుప్రతిష్ఠలు అనో సమాధానం చెబుతారు. కానీ ధర్మరాజు మాత్రం.. “మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు. అలా ఉంటారనుకోవడం భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లోనూ ఎవరి అవసరాలు వారికుంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు' అని చెప్పాడు. ప్రపంచంలో తెలివైనవారెవరైనా అంగీకరించకుండా ఉండలేని విషయమిది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడిన గుండె ధైర్యమే.
No comments:
Post a Comment