*జీవితం సుఖ - దుఃఖాల ఆట.*
*కొందరు పదే పదే తమకు జరిగిన చెడు గురించే ఆలోచిస్తూ, అమూల్యమైన వర్తమానాన్ని పోగుట్టుకొని తమ భవిష్యత్ కొరకు వేసే పునాదిని చేజార్చుకుంటారు.*
    *పగలు-రాత్రి, వెలుగు-చీకటి ఎంత సహజమో సుఖ- దుఃఖాలు కూడా అంతే. ఈ నగ్నసత్యాన్ని గుర్తించి వర్తమానంలో శ్రేష్ఠ కర్మలాచరించి మన బంగారు భవిష్యత్తుని మనమే నిర్మించుకుందాము. ఇందుకొరకు పరమాత్మ తెలిపే జ్ఞాన యోగాలు ఎంతో ఉపకరిస్తాయి.*
*భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల గురించి ఆలోచిస్తే ఎన్నో సూక్ష్మ విషయాలు జీవితానికి, ప్రకృతికి సంబంధించినవి వెలుగులోకి వస్తాయి. కాలము నిరంతరం తిరుగుతున్న చక్రం. ఈ చక్రంలో గడిచింది భూతకాలమని, జరుగనున్నది భవిష్యత్తని, ఈ క్షణం వర్తమానమని అన్నారు. ఈ చక్రానికి ఆధారంగా, మానవ సృష్టి చక్రము, ఋతువుల చక్రం, బాల్య- యవ్వన-వృద్ధ ఆశ్రమాల చక్రము తిరుగుతూ ఉంటాయి.*
*ఈ వ్యవస్థను అనుభవం చేసుకొనుటకు సదా వర్తమానంలో ఉండే అభ్యాసం చేయాలి. ఎందుకంటే గడిచినది తిరిగి రాదు, రాబోయేది కల్పన మాత్రమే అన్న జ్ఞానం స్మృతిలో ఉండాలి.*
   *ఉదాహరణకు మానవ సృష్టి చక్రము శివ పరమాత్మ తెలిపిన యదార్ధ జ్ఞానానికి ఆధారంగా అర్థం చేసుకొందాము. సత్య- త్రేతా యుగాలలో మనుష్యులందరూ పావనముగా సర్వ గుణాల సంపన్నులుగా,  సుఖ-శాంతులతో ఆనందంగా ఉంటారు. వారే పునర్జన్మలు తీసుకుని ద్వాపర కలియుగాలలో పతితులుగా, వికారులుగా అయి. దుఃఖ అశాంతిని అనుభవిస్తున్నారు* *వర్తమాన సంగమ యుగములో భగవంతుని ఆదేశం అనుసారంగా జ్ఞానం, శివ🕉️ ఓంకార ధ్యానంతో పురుషార్థము చేసి పవిత్రులుగా అయ్యి తిరిగి రాబోయే సత్య యుగంలో పావన దేవతలుగా అయి సంపూర్ణ సుఖ- సంతోషాలతో ఆరోగ్యంగా- ఆనందంగా జీవిస్తాం. ఇది అవినాశీ చక్రము.*
 *ఓం🕉️🙏ఓంకారం చేద్దాం🙏*
 
No comments:
Post a Comment