*నిన్ను నీవు అర్థంచేసుకుంటే
 సుఖ- శాంతులతో జీవించవచ్చు🕉️🙏💓🪷🌷🇮🇳✴️🌈*
*ఎవరికి వారు అర్థం కాకపోవడమనేది కొంచెం విచిత్రమనిపిస్తుంది.*
*ప్రతి ఒక్కరికీ వారి పేరు, ఊరు, పదవి మొదలైనవన్నీ తెలుసు. అవి భౌతిక మైనవి. కేవలం భౌతికమైన వాటి వలనే మనిషి మనుగడ సాగించలేడు.*
*భౌతికమైన శరీరాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి✴️ గలదు, దానినే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ✴️ అంటారు.*
*వాస్తవానికి ప్రతి  ఒక్కరూ ఒక ఆత్మ, తమ తమ శరీరాలతో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు.*
       *ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరింత వివరంగా తెలుసుకుని అభ్యాసం చేస్తూవుంటే సహజంగా సుఖ- శాంతులతో జీవించగలము.*
*💁♀️ ప్రస్తుత ఈ ప్రపంచంలో మానవులందరూ దుఃఖము- అశాంతిగా  ఉండడానికి ముఖ్య కారణం స్వయం యొక్క విస్మృతి.( స్వయాన్ని నేను ఆత్మ- చైతన్య✴️ శక్తిని అని మరిచి కేవలం ఈ కనిపించే శరీరమే నేను అని భావించడం)*
 *స్వయం యొక్క పరిచయం ధర్మ స్థాపకులందరూ వారి వారి జ్ఞానానికి ఆధారంగా తెలిపినప్పటికి, శాశ్వత ఉపశమనం కలగలేదు. స్వయం పరమాత్మ🕉️ వచ్చి ఆత్మ✴️ యొక్క యదార్ధ పరిచయం ఇచ్చారు. నేను ఆత్మనని, దేహము కాదని, ఆత్మ యొక్క సహజ గుణములు ప్రేమ, పవిత్రత, ఆనందము, సుఖము, శాంతి జ్ఞానము, శక్తి ఈ ఎరుక ద్వారా ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటే, శాంతము, సుఖము ఆనందము సదా అనుభవం చేసుకొంటాము. అయితే ఈ స్థితి నిరంతరం ఉండాలంటే చాలా అభ్యాసం చేయాలి.*
*ఇంత కాలము, నేను దేహము అన్న భావంలో ఉండడం వలన, దేహ ధర్మాలైన వికారాలు- అశాంతి ఆత్మపై ఆపాదించుకున్నాయి. దాని ప్రభావం వలన దుఃఖము-అశాంతి అనుభవం అవుతూ వచ్చాయి.*
  *స్వయం నేను ఒక అత్మ అన్న పూర్తి జ్ఞానము అర్థం చేసుకొని, ఆ స్థితిలో స్థితమై ఉంటే శాంతి సుఖము సదా అనుభవం చేసుకొంటాము. అందుకే ఓంకారాన్ని అభ్యాసం చేద్దాము.*
*ఓం🕉️ అంటేనే ఆత్మ- పరమాత్మల కలయిక.* 
*నిజానికి ఓమ్🕉️ యొక్క అర్థం-*🕉️
*"ఓ" అంటే నిరాకార జ్యోతి బిందు పరమాత్మ  పైన ఉండేవారు*
*"మ్" అంటే నిరాకార పరమాత్మ సంతానమైన జ్యోతి బిందు ఆత్మను నేను అని అర్థం*
*ఎవరైతే 🕉️ఓంకారాన్ని ఉచ్ఛరిస్తారో వారు పరమాత్మతో నేరుగా దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు..*
*ఓం 🕉️అనే శబ్దం సంపూర్ణ బ్రహ్మాండం, పూర్తి విశ్వం ఉత్పత్తికి ఆధారం*
*నిరాకార పరమాత్మ ను ఒక్క శబ్దం లో చెప్పాలంటే అది ఓంకారం🕉..*
*🕉️ఓం అనే శబ్దం ఆది, అనాది, అవినాశి🕉️*
*ప్రపంచంలోని అన్ని మంత్రాలకు సారం ఓంకారం*
*ఓం జపించడం ద్వారా మన మనస్సు మరియు బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది, దీని వలన మనస్సు ప్రతి పనిలో నిమగ్నమై ఉంటుంది మరియు చదువులో కూడా చురుకుదనం వస్తుంది.*
*ఓం ధ్వని ఒక ఆధ్యాత్మిక శాస్త్రం, క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనలో కోల్పోయిన శక్తులను తిరిగి పొందవచ్చు.*
*మనం ఓం ధ్వనిని జపించినప్పుడు,అది మన పరిసరాలను స్వచ్ఛంగా మరియు సానుకూలంగా చేసే కొన్ని శక్తివంతమైన తరంగాలను విడుదల చేస్తుంది.*
*ప్రతి రోజూ ఉదయం మరియు సాయంత్రం 10 నిమిషాల పాటు ఓం🕉️ మహా మంత్రం తప్పక జపించండి*
*సకుటుంబ సపరివార సమేతంగా ఆరోగ్యంగా ఉండండి*🕉💖⚛💞⚡🕉
*ఓం🕉️ ధ్వని చేస్తున్నప్పుడు మీ మనసులో సంకల్పం చేయండి... తండ్రి శివ✴️ పరమాత్మ దగ్గర నుంచి నా శరీరంలోకి శివ శక్తి✴️ తరంగాలు✨⚡ ప్రవేశిస్తున్నాయి అని.🕉️ నా బాధలు.. బలహీనతలు.. అన్ని భగవంతుడు తీసుకుంటున్నాడు అని*
*🕉️ఓం నమః ✴️శివాయ.. 9573245868*
        *'ఓం' 🕉️ఓంకారం చేద్దాం🙏*
*ఓం🕉️ ధ్వని చేయడం ద్వారా అన్ని రకాల టెన్షన్, డిప్రెషన్, శారీరిక మరియు మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది*
*ఓం🕉️ ధ్వని చాలా శక్తివంతమైనది, 🕉️ ఓం జపించడం ద్వారా, మీరు మీ జీవితంలో సహజమైన మార్పును మరియు ఆనందమైన అనుభూతిని అనుభవం చేస్తారు.*
 
No comments:
Post a Comment