Saturday, October 19, 2024

 జీవిత సత్యం......

యవ్వనం & ముసలితనం
                 
# యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడుతారు...

# ముసలితనం వచ్చినప్పుడు  “ముడతల్ని”  గురించి బాధపడుతారు...

#యవ్వనంలో ఉన్నప్పుడు “ఆమె” లేదా అతడి చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసే వాళ్ళు..

# ముసలితనం వచ్చినప్పుడు ‘ఎవరైనా వచ్చి “నా చేయి”  పట్టుకుంటారా!’  ప్రేమగా స్పందిస్తారా అని ఎదురు చూస్తారు...

#యవ్వనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు నన్ను “ఒంటరిగా” వదిలేస్తే బాగుండును అనుకునేవాణ్ణి.

#నాకు ముసలితనం వచ్చినప్పుడు అందరూ నన్ను “ఒంటరిగా” వదిలేసారే అని బాధపడుతారు..

# యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే “చికాకు” పడుతారు..

# ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం “మాట్లాడటం” లేదే అని బాధపడుతారు...

# యవ్వనంలో ఉన్నప్పుడు “అందాన్ని” ఆస్వాదించేస్తారు

#ముసలితనం వచ్చినప్పుడు  నా చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ “అందాన్ని” చూసుకుంటారు..

#యవ్వనంలో ఉన్నప్పుడు నాకు “చావే” లేదు అనుకుంటారు..

# ముసలితనం వచ్చినప్పుడు... “రోజులు దగ్గర పడ్డాయి” అని బాధపడుతుంటారు..

# యవ్వనంలో ఉన్నప్పుడు “ప్రతి క్షణాన్ని” పండగ చేసుకునేవాళ్ళు..

#ముసలితనం వచ్చినప్పుడు “తీపి జ్ఞాపకాల్ని”  నెమరు వేసుకుంటారు..

# యవ్వనంలో ఉన్నప్పుడు “నిద్రలేవడం” కష్టంగా ఉంటుంది..

# ముసలితనం వచ్చినప్పుడు “నిద్రపట్టడం” కష్టంగా ఉంటుంది...

# యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా  “గుండెల మీద” పిడిగుద్దులతో  గుద్దుకునేవాళ్ళు..

# ముసలితనం వచ్చినప్పుడు 
ఈ “గుండె ఎప్పుడు ఆగి పోతుందో”  అని బయపడుతుంటుంటారు..

❄️జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి. 
🌦️దేనికీ భయపడ కూడదు. 

❄️ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.
 🌦️అదే నిజమైన “జీవితానుభవం!” 

అది “యవ్వనంలో” నైనా.. “ముసలితనంలో” నైనా.. అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా “ప్రశాంతంగా”  ఉంటుంది.

మీ.. 

డాక్టర్. వై. సంజీవ కుమార్, 
ఫౌండర్ & ప్రెసిడెంట్, 
స్కై ఫౌండేషన్. 
🙏🙏💐💐💐💐

No comments:

Post a Comment