*రొమాన్స్ అంటే ఏంటి అంటే, సెక్స్ ముందు చేసేది అనే ఆలోచనా ఉంది చాలా మందికి...*
*రొమాన్స్ కి సెక్స్ కి సంబంధం లేదు.*
*సెక్స్ అనేది శారీరక అవసరం.*
*రొమాన్స్ అనేది మానసిక అవసరం.*
*శరీరం కొన్నిసార్లు బలంగా కోరుకుంటుంది, హార్మోన్స్ ఆ టైంలో సెక్స్ కావాలి.*
*కానీ రొమాన్స్ అనేది 99% మంది ఆడవాళ్ళకే దీని అర్థం తెలియదు.*
*మగవారికి అయితే దీని అవసరం లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు.*
*రొమాన్స్ అనేది మానసిక, మనసు యొక్క అవసరం.*
*రొమాన్స్ అనేది ఫీల్ గుడ్ మూమెంట్లను ఇచ్చేది. ఫీలింగ్ తెప్పించేది.*
*అలసిన అప్పుడు ఒక మంచి కాఫీ తాగావనుకో, ఎలా ఉంటుంది, మంచి ఫీల్ అనిపిస్తుంది.*
*వర్షం పడేటప్పుడు బజ్జీలు తినాలి అని ఫీలింగ్ అనేది*
*ఒక మంచి పుస్తకం చదివిన అప్పుడు మనసుకు,*
*నచ్చిన ప్లేసు ఆస్వాదించేటప్పుడు,*
*చలికాలంలో నిద్రమత్తులో ఉదయాన్నే లేవకుండా, అలాగే ముసుగుతన్ని పండుకుని బెడ్ షీట్ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది.*
*ఇలా మనసు యొక్క కొన్ని అవసరాలు ,ఫీలింగ్స్ ఉంటాయి.*
*ఈ రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది.*
`మాటలు తో,`
`సరసాలతో,`
`అలకలు ,బుజ్జి గింపులతో,`
`హత్తుకోవడం,`
`కొరకడం,`
`స్పర్శించడం,`
`చూపులతో,`
`పెదాలతో,`
`చేతులతో,`
`వెచ్చని కౌగిలిలో,`
`మత్తెక్కించే గుసగుసలా మాటలు,`
`వెచ్చని శరీరానికి చల్లదనపు స్పర్శ.`
*ఇలా ప్రతి రొమాంటిక్ మూమెంట్‌ని, శరీరం ఒక ఫీల్ గుడ్ లాగా మనసుకు ఇస్తుంది అన్నమాట.*
*కొన్ని సినిమాలు చూసినప్పుడు, మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం కదా, అలాంటిది అన్నమాట.*
*ఈ రొమాన్స్ అనేది, ఆ అందం మీద ఇష్టం ఉండాలి.*
*ఆరాధన భావన ఉండాలి.*
*పిచ్చి వ్యామోహం ఉండాలి.*
*అతి ప్రేమ ఉండాలి.*
*99 శాతం మందికి తమ జీవితంలో రొమాన్స్ అనేది జీవితంలో చూసి ఉండరు. (చూసినోల్లు అదృష్టవంతులు.)*
*ఎందుకంటే వాళ్లకు తెలియదు కాబట్టి.*
*వాళ్లకు తెలిసిందల్లా ఒకటే, రొమాన్స్ అంటే సెక్స్ ముందు చేసేది..*
No comments:
Post a Comment