ఆత్మ విచారణ - 1
ఆత్మను మరచి అస్థిపంజరం వైపు దృష్టిని మరల్చిన మనం అనేక జన్మలుగా 'నేను ఈ దేహాన్ని' అని భ్రమిస్తున్నాం. మన బలహీనతలన్నింటికి ఇదే మూలం. మన ఆత్మశక్తిని మనం విశ్వసించకపోవడమే నాస్తికత.
కనుక ఎల్లప్పుడు ఆత్మను గురించి వినండి, ఆత్మను గురించి చదవండి, ఆత్మను గురించి మాట్లాడండి, ఆత్మను గురించి విచారణ చేయండి. అప్పుడే మీలోని ఆత్మ మేల్కొంటుంది.
ఆనాటినుండి మీద్వారా ఎటువంటి మహత్తరమైన కార్యాలు నిర్వహింపబడుతాయో చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది.
లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగకండి.
స్వామి వివేకానంద
No comments:
Post a Comment