Sunday, December 1, 2024

 *మనల్ని నాశనం చేసే 5  విశపూరిత అలవాట్లు*
🍃🍃🍃🍃🍃🍃🍃
1 . వాయిదా వేయడం ( procrastination )
2 . కంప్లైంట్స్ చెయ్యడం ( complaining )
3 . అతిగా ఆలోచించడం ( overthing )
4 . పోల్చుకోవడం ( comparison )
5 . సేఫ్  జోన్లో ఉండాలనుకోవడం ( staying comfort zone )
🔹 *వాయిదావేయడం ....*
ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక . 
🔹 *కంప్లైంట్స్ చెయ్యడం.*
ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం 
ఎదుటి వారి మీదనో,,ఇంకేదో మీదనో కంప్లైంట్స్ చేస్తాం ..ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు...ఇంకా perfect మనిషి పుట్టలేదు.
మనలోని ఏదైతే లోపమో,, అవలక్షణమో ,,వాసనో ,,, అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద కంప్లైంట్స్ గా మారుస్తాం.                                                                               🔹 *అతిగా ఆలోచించడం.*
ఆలోచించేకీ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు నాకు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు...ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే..కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు..
🔹 *పోల్చుకోవడం.*
ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు...దేని 
ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు..దేని 
ప్రత్యేకత దానిదే...టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే..వేశ్య వృత్తి చేసే
ఆమె ప్రత్యేకత ఆమెదే....కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకొకండి....ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం ..అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే...

🔹 *సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం*
భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సేఫ్ గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సేఫ్ గా ఉంటామనో
లేకపోతే ఫలానా జాగా లో వుంటే సేఫ్ గా వుంటామనో అనుకుంటారు...ముందు మీరు నిద్రలో నుండి మేల్కొవాలి..
అలాంటివేమీ లేవు...సేఫ్ జోన్లో వుండి నేర్చుకునేది ఏమీ వుండదు..
ఆ యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..
 *సేఫ్ గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు...*
🫐🫐🫐🫐🫐🫐🫐

No comments:

Post a Comment