నారద భక్తి సూత్రాలు
50 వ సూత్రం
"స తరతి స తరతి స లోకాం స్తరయతి"
వాడు తరిస్తాడు అట్టివాడే తరిస్తాడు,మరి వాడే లోకాన్ని కూడా తరింపచేస్తాడు.
నారద మహర్షి సంతోషంతో మరి మరీ చెబుతున్నాడు,అట్టి స్థికిచేరిన భక్తుడు తానూ తరించడమే కాక, ప్రజాలోకాన్ని కూడా తరింపచేస్తాడు.అతడు మార్గదర్శి వాని బాట మాట అందరికి అనుసరణీయం.
భక్తులలో రెండు రకాల వారు వుంటారు, ౧. విద్య ద్వారా ఈశ్వర జ్ఞానం పొందిన వారు, ౨.సహజంగానే ఈశ్వర జ్ఞానం తో పుట్టిన వారు.(భగవంతుడే ఈలా సద్గురువు గా లోక కల్యాణార్థం అవతరిస్తాడు)
రెండు రకాల భక్తులు ముక్తిని పొందుతారు,విద్య ద్వారా విజ్ఞానం పొందిన భక్తుడు తానూ మాత్రమే తరిస్తాడు. సహజంగానే పుట్టుకతో ఈశ్వర జ్ఞానం పొందిన భక్తుడు తాను తరించి ఇతరులను ఉద్ధరిస్తాడు.
శ్రీ కృష్ణ భగవానుడు!
"మద్బక్తియుక్తో భువనం పునాతి" నా భక్తుడు తాను పునీతుడై త్రిభునాలను పునీతం చేస్తాడు,అందర్నీ ఉద్ధరిస్తాడు.
53 వ సూత్రము
" ప్రకాశతే క్వాపిపాత్రే"
ఆ ప్రేమ యోగ్యులైన మహా యోగీశ్వరుల హృదయాలపై ప్రస్ఫుటమవుతుంది.
ఆ భగవత్రేమ అంతటా అన్ని కాలాలలో ప్రకాశించదు. అవసరమైన చోట కాలానుగుణం గా బయటకు వస్తుంది. కాని భక్తుని అంతరంగంలో మాత్రం ఎడతెగకుండా ప్రకాశిస్తూనె ఉంటుంది. ఆ అనుభవాన్ని భక్తిరసంలో లీలామైన మహాత్ములు బాహ్యచిహ్నాలద్వారా తెలుసుకోవచ్చు,వారు శరీరస్ర్ముతి మరచి సమాధిలో వున్నప్పుడు కొన్ని కాంతి ప్రసారాలు,చేష్టలు చూడగలవారికి కనిపిస్తాయి.అది ఆ భక్తుడికి మాత్రమె తెలుస్తుంది. కాని మాటలలో చెప్పడానికి భాష చాలదు.
భగవంతుని దర్శింపగోరె భక్తుడు కీర్తనం,శ్రవణం,దివ్య దర్శనం తప్ప ఇతరములు అంగీకరించడు,ఇతర పదార్ధాలపై నిర్లప్తుడై ఉంటాడు.
సర్వవస్తు జాలంలోను పరమాత్మనే దర్శిస్తాడు,అన్ని శబ్దాలలోను ఓంకారమే శ్రవణం చేస్తాడు,ఆ భక్తుడికి అన్ని మంత్రాక్షరాలే,ఆయన విశ్వాత్మనే మనం చేస్తాడు,విశ్వాత్మనే తానైపోతాడు.సర్వము లో అతడు,అతనిలో సర్వమూ నిండి ప్రకాశమానం అవుతాడు.
No comments:
Post a Comment