🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
చక్రార్థ నిరూపణ / షట్చక్ర నిరూపణ - 6
ఆజ్ఞా చక్రము
📚✒️ భట్టాచార్య
లలితా సహస్ర నామావళిలో ఆజ్ఞా చక్ర వర్ణన ...
శ్లో ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా
శ్లో || మజ్జా సంస్థా హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా హాకినీ రూప ధారిణీ ||
ఆజ్ఞా చక్రము - ఉనికి - వర్ణన - లక్షణాలు :
రెండు కనుబొమల మధ్య స్థానమే ఆజ్ఞా చక్ర స్థానము. దీనిని త్రికూట స్థానము, భ్రూమధ్యము అని కూడా అంటారు. ఈ స్థానాన్ని ప్రజ్ఞా చక్షువు, దివ్య చక్షువు అని కూడా అంటారు.
ఈ ఆజ్ఞా చక్రంలో...ఈ చక్ర అధిష్ఠాన దేవత సిద్ధ మాత, హాకినీ శక్తిగా ఆరు ముఖములతో ఒప్పారి ఉంటుంది. ఈ శక్తి తన చేతుల యందు పుస్తకము, అక్షమాల, కపాలము, డమరుకం, వరద ముద్ర, అభయ ముద్రలతో విరాజమానమై ఓఢ్యాణ పీఠంపై ఉంటుంది. ఇందులోని త్రిభుజమే ఓఢ్యాణ పీఠం.
పసుపు పచ్చని అన్నము అనగా చిత్రాన్నము తినడం ద్వారా ఈ చక్ర ధాతువు వృద్ధి చెందుతుంది. సప్త ధాతువులలో " మజ్జా ధాతువు " కు హాకినీ శక్తి అధి దేవత.
ఆజ్ఞా చక్రంలో తల క్రిందులుగా ఒక త్రికోణం ఉంటుంది. ఈ త్రికోణం "శక్తి" కి ప్రతీక. ఈ త్రికోణం లో ఒక నల్లటి శివలింగం ఉంటుంది. ఈ శివలింగం పైన "ఓం" బీజాక్షరం ఉంటుంది. దాని పైన అర్ధ చంద్రాకారం (Crescent Moon) ఉంటుంది. తరువాత ఒక బిందువు ఉంటుంది. ఈ శివలింగం "astral body" కి సూచిక గా చూపిస్తారు. ఆజ్ఞా చక్రానికి అధిష్టానుడు "పరమ శివుడు."
ఈ చక్ర దళ బీజాక్షరాలు : హం, క్షం
వ్యాహృతి : ఓం తపః
ఈ చక్ర శక్తులు : 1. హంసవతి 2. క్షమావతి
ఆజ్ఞా చక్ర అధిష్ఠాన దేవత : హాకినీ శక్తి
ఈ చక్ర బీజ మంత్రం : " ఓం "
( ఈ ప్రణవం అన్ని తత్వాలకు, అన్ని శబ్దాలకు మూలం )
ఆజ్ఞా చక్ర స్థానము : భ్రూ మధ్యము
అనుభూతి : ఏకాగ్రతను భ్రూమధ్యమందు నిలిపి ఓంకారాన్ని ఉచ్ఛరిస్తే...అలౌకిక లోకాలకు వెళ్ళిన అనుభూతి వస్తుంది.
నియంత్రణ : ఈ చక్రం పిట్యూటరీ గ్రంథి, రక్త ప్రసరణ వ్యవస్థ, మెదడు యొక్క ముందు భాగం చేయు క్రియలను నియంత్రిస్తుంది.
భౌతిక శరీరంలో, ఆజ్ఞా చక్రం హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి మరియు పీనియల్ గ్రంథులనే అంతస్రావీ గ్రంథులతో సంబంధం కలిగి ఉంటుంది.
ఈ చక్రాధిష్ఠాన దేవత " హాకినీ శక్తి" ని ప్రార్థించిన వారికి మనోనిశ్చలత, మజ్జ ధాతు వృద్ధి జరుగుతుంది.
మంగళప్రదమైన ఆజ్ఞా చక్రాన్ని మనసులో ధరిస్తున్నాను అని స్తుతించాలి, భావన చేయాలి.
మూడవ కన్నుగా/ జ్ఞాన నేత్రంగా పిలువబడే ఆజ్ఞా చక్ర స్థానం బ్రహ్మ లిఖిత గుప్త స్థానం.
ఆజ్ఞా చక్ర కమలమును ఓడ్యాణ పీఠము అని అందురు.
ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు ప్రధాన నాడులు, ఈ చక్రమందు సంగమించి సహస్రారమునకు ప్రవహిస్తాయి.
ఈ ఆజ్ఞాచక్రాన్ని గురుశిష్యులకు వారధిగా కూడా పేర్కొంటారు.
దేవతలకు గురువైన బృహస్పతి, గురుమండలమునకు అధిపతి, కావున ఆజ్ఞా చక్రమును గురుచక్రమని కూడా వ్యవహరిస్తారు.
ఆజ్ఞా చక్ర తత్వం - మనస్సు :
ఈ చక్రం రెండు కనుబొమలకు మధ్యన, బొట్టు పెట్టుకునే స్థానమునకు వెనుకభాగములో ఉంటుంది.
మనశరీరంలో మనకు కనబడని "మనస్సు తత్వాన్ని" నియంత్రిస్తుంది.
ఈ ఆజ్ఞా చక్రాన్ని మనసుకు పీఠం ( seat of the mind ) గా అభివర్ణిస్తారు. మానసిక స్థితి గతులకు చెందిన చక్ర స్థానం ఇది.
నిజానికి ఈ చక్రమొక సూక్ష్మ మానసిక క్షేత్రం.
ఆజ్ఞా చక్ర శక్తి : ఈ చక్రాధిష్ఠాన దేవత ''సిద్ధమాత'' ఈమె ఆరుముఖములతో తెల్లని రంగు కలిగి "హాకినీ" శక్తి రూపంలో ఉండి మన శరీరమందలి సప్త ధాతువులలో ఒకటైన మజ్జ (ఎముకలలోని కొవ్వు) కు అధిదేవతగా ఉంటుంది.
ఆజ్ఞా చక్రము - Human Anatomy :
మెదడు లోని రెండు అర్థ భాగాలకు (కుడి,ఎడమ భాగాలు) సంబంధించిన స్థానం కూడా ఇదే.
ఈ స్థానంలో మెదడు భాగమైన "మెడుల్లా" ఉంటుంది.
"పీనియల్ గ్లాండ్" ప్రదేశమే ఆజ్ఞా చక్రం గా చెప్పవచ్చు. సింధూరం పెట్టుకొనే ప్రదేశమే ఇది. సింధూరంలో "mercury" ఉంటుంది. కాబట్టి అది ఒత్తిడి కలిగిస్తుంది. దానివల్ల ఆజ్ఞా చక్రంలో చేతన మరియూ వేకువ వస్తాయి.
ఇడా, పింగళా ,సుషుమ్నలు కలిసే కేంద్రమే ఆజ్ఞా చక్రము.
సహస్రార చక్రాన్ని చేరుకోవడానికి ఆజ్ఞా చక్రం ఒక ద్వారం లాంటిది.
అసలు "ఆజ్ఞా" అనే పదము ఒక command ను తెలియజేస్తుంది. ఆజ్ఞా చక్రం పైన ఫాల భాగంలో " గురు చక్రం" ఉంటుంది. మన ఈ రెండు కనులు బయటి ఆకర్షణకి లోనవుతూ బాహ్య ప్రపంచాన్నే చూస్తాయి.
కానీ , భృగుటి స్థానంలోని (ఆజ్ఞా చక్ర స్థానం) మూడవ నేత్రం అంతర్ముఖంగా చూడగలుగుతుంది. అందుకే దీనిని ప్రజ్ఞా చక్షువు/దివ్య చక్షువు/ జ్ఞాన నేత్రం అని కూడా అంటారు.
బాహ్య దృష్టి ఆగిపోయి భ్రూమద్యంలో ఏకాగ్రత నిశ్చలంగా నిలచినపుడు ఆజ్ఞా చక్రం జాగృతమై అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది.
ఈ చక్రం పంచ ప్రాణాలతోనూ, విజ్ఞానమయ కోశం తోనూ సంబంధం కలిగియున్నది.
దీనికి జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం ...అంతా మనస్సే.
"ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్ర గ్రంధి విభేదినీ..."
అని లలితా సహస్రంలో వర్ణించబడింది.
ఆజ్ఞా చక్రము - ఉప నయనం :
7, 8 సంవత్సరాల వరకు పిల్లలు దైవత్వంతో అమాయకత్వంతో ఉంటారు. ఆ తరువాత వయస్సులో వారి మనస్సులు కలుషితం కావడం ప్రారంభం అవుతాయి. పీనియల్ గ్రంథి దోషపూరితం కావడం ప్రారంభిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అందుకే పూర్వపు రోజుల్లో ఆ వయస్సులోనే పిల్లలకు " ఉపనయనం " చేసేవారు.
సంధ్యా వందనం, గాయత్రీ మంత్ర ఫఠనం వల్ల మంచి ప్రవర్తన అలవడేది.
ఆజ్ఞా చక్రాన్ని చైతన్య పరచడానికి భస్త్రిక, కపాల భాతి, అనులోమ - విలోమ ప్రాణాయామం, ప్రణవ, భ్రామరీ ప్రాణాయామాలు, షణ్ముఖీ ముద్ర, జలనేతి వల్ల ఆజ్ఞా చక్రం క్రమంగా జాగృతమై ఎలాంటి విషయాల నైనా సులభంగా అర్థం చేసుకోగల psychic awareness పెరుగుతుంది.
శాంభవీ, త్రాటకం...ఇత్యాది క్రియల వల్ల ఆజ్ఞా చక్రం సంతుల పరచబడుతుంది. ఆజ్ఞా చక్రాన్ని మొదట జాగృతం చేస్తే ...మిగతా చక్రాలు ఉత్తేజ పరచడం సులువు అవుతుంది. అంటి పెట్టుకొని ఉండే తత్వం నుండి బయట పడటానికి మొదట ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజ పరచాలి. అంటి పెట్టుకొని ఉండే ఈ తత్వం వల్ల ఎన్నో సందేహాలు, మీమాంస కలగడానికి అవకాశం ఉంది.
రుద్ర గ్రంథి - ఆజ్ఞా చక్రం :
"రుద్ర గ్రంథి" ఆజ్ఞా చక్ర స్థానంలోనే ఉంటుంది. ఇది జ్ఞాన దాహాన్ని, సిద్ధులను సాధించాలనే వ్యామోహాన్ని కలుగజేస్తుంది.
ఇంతకు ముందు చెప్పబడిన ప్రాణాయామాలు, ఇతర క్రియల వల్ల మానసిక అనిశ్చితి తొలగిపోయి, అణగద్రొక్కబడిన భావోద్వేగాలు బయటపడి, ప్రశాంతత చేకూరుతుంది.
ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరచినపుడు, వ్యామోహాలన్నీ తొలగి, సాక్షీ భావన ఏర్పడును. జీవన సరళి, జీవన స్థాయి, మనో మట్టాలు మారతాయి.
ఆజ్ఞా స్థానంలో ఏకాగ్రతను నిలిపి ధ్యానం చెయ్యడం వల్ల అంతర్ముఖ దృష్టి పెరుగుతుంది.
ఈ చక్రం సరిగ్గా పని చేయకపోతే :
ఈ చక్రం సరిగా పనిచేయని ఎడల అసూయ, ద్వేషము, వ్యామోహము, మరియు భ్రమలు కలుగుతాయి.
ఈ చక్రమునకు అవరోధములు :
దుర్వ్యసనములు, అహంకారము, నిద్రలేమి.
తన్మాత్రా తత్వం : ప్రతీ చక్రానికీ ఒక తన్మాత్రా తత్వం ఉంటుంది.(మూలా ధారానికి - భూతత్వం, స్వాధిష్టానానికి - జల తత్వం , మణిపూరకానికి - అగ్నితత్వం , అనాహతానికి - వాయుతత్వం , విశుద్ధానికి - ఆకాశ తత్వం) .......
కానీ ఆజ్ఞా చక్రానికి తన్మాత్రా తత్వం ఉండదు. ఈ చక్రం ఆత్మజ్ఞానానికి సంబంధించి ఉంటుంది. ఇది ఆకాశ గమనానికి తోడ్పడుతుంది. అత్యున్నత స్థాయిలోని జాగృత స్థితి (awareness) ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం కారణంగానే కలలు సంప్రాప్తం అవుతాయి. మెలకువ తో ఉండి మాట్లాడుతున్నప్పుడు, తినేటప్పుడు , నడిచేటప్పుడు awareness లోపిస్తుంది.
దానికి కారణం ఆయా సమయాలలో ఆజ్ఞా చక్రం పనితీరు మందగించడమే.
ఇంద్రియాల ప్రమేయం లేకుండానే ఆంతరంగిక జ్ఞానం ద్వారా ఆజ్ఞాచక్రం సరియైన పద్ధతిలో పనిచేస్తూ ఉంటుంది.
"సంకల్ప సిద్ధి" ఆజ్ఞా చక్రం ద్వారానే కలుగుతుంది.
వైరాగ్య దృష్టి కూడా దీని వల్లనే కలుగుతుంది. కాలజ్ఞాన శక్తి (భూత భవిష్యత్ వర్తమాన కాలాల గూర్చి తెలుసుకోవడం) కూడా ఆజ్ఞా చక్రం ద్వారానే కలుగుతుంది.
ఆజ్ఞా చక్రం - నాదానుసంధానం :
సాధకుడు ఎడతెగని నిష్ట తో సాధనలో ఉన్నప్పుడు ...కుండలినీ శక్తి మేల్కొని ...అనాహత చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. క్రమేణా దీర్ఘ ఘంటానాదం మరియూ వివిధ నాదాలు అనుభూతం అవుతాయి. నిరంతరం ఓంకార నాదం అనుభూతికి వస్తుంది.
ఆజ్ఞా చక్రము - పదార్ధ సృష్టి :
ఆజ్ఞా చక్రము వరకు వచ్చిన యోగులు...భూతత్వము, జల తత్వము, అగ్ని తత్వము, ఆకాశ తత్వములను జయించిన వారికి అనగా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధిలను జయించిన యోగులకు, పంచ భూతాలు ఆజ్ఞా చక్ర ఆధీనంలో ఉండే స్థితి వస్తుంది.
అట్టి యోగి సంకల్ప మాత్రం చేత " పదార్ధ సృష్టి " చేయగలడు.
ఆజ్ఞా చక్రము - చిత్కళలు - సమాధి :
కుండలినీ శక్తి "ఆజ్ఞా" చక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు వెదజల్లును. కొంత కాలానికి శతకోటి సూర్య ప్రభా సమానమైన ఆత్మ చైతన్యం...అనుభూతికి వస్తుంది. ఈ రక రకాల కాంతులను "చిత్కళ"లు అంటారు. కూటస్థ చైతన్యమునే "బిందువు" అంటారు. ఇవన్నీ లయం కావలసిందే.
అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.
ఆజ్ఞా చక్రము - Bi location సిద్ధి :
ఆజ్ఞా చక్ర సిద్ధి పొందిన యోగి ఒకే సారి రెండు లేదా అధిక ప్రదేశాలలో ఉండగలడు. ( Bi location or Multi Location ) అట్టి యోగి తన సూక్ష్మ శరీరంతో ఎచటికైననూ వెళ్ళి రాగలడు.
No comments:
Post a Comment