నారద భక్తి సూత్రములు
82 వ సూత్రము
"గుణ మాహాత్మ్యసక్తి,రుపాసక్తి,పూజాశక్తి,స్మరణాసక్తి,దాస్యాసక్తి ,సఖ్యాసక్తి,వాత్సల్యాసక్తి,కాంతాసక్తి,ఆత్మ నివేదనాసక్తి,తన్మయాసక్తి,పరమావిరహాసక్తి రూపైకధా ప్యేకాదశధా"
ఒక్కటే అయిన భక్తిని నారద మహర్షి ౧౧(పదకొండు) ఆసక్తులుగా పేర్కొన్నాడు.
పరిపూర్ణ భక్తి లో ఈ పదకొండు ఉంటాయి,గోపికలు ఇందుకు ఉదాహరణ,వారిలో అన్ని ఆసక్తులు వున్నాయి,ప్రతి భక్తునిలోను అన్ని ఉండలని ఏమిలేదు,వారి వారి మతానుసారం రెండు మూడు కలిసి ఉండొచ్చు.లేదా ఏదైనా ఒక ఆసక్తి మాత్రమే వుంది ఉండవచ్చు.అన్ని ఆసక్తులు సమానమే ప్రతీది భగవత్ కృపకు మార్గమే.
🕉️🌱🌿🌴
నారద ప్రోక్తములైన ఈ మంగళకర సూత్రాలు శివుడు అనుశాసించినవే,మానవుడు వీనిపై ప్రగాఢ విశ్వాసం ఉంచి శ్రద్దగా అభ్యసించినచో ప్రాణ ప్రియమైన భగవంతుణ్ణి పొందగలరు.
ఏ శాస్త్రానికైనా నాలుగు ముఖ్య అంగాలు ఉంటాయి-
అర్హత-విషయం-సంబంధం-ప్రయోజనం.
అర్హత-మానవ జన్మ పొందడమే శాస్త్ర అధ్యయనానికి శాస్త్ర "అర్హత".
విషయం-అనగా శివానుశాసనం పాలించడమే,ఆత్మకళ్యాణంతో లోక కల్యాణ కారిక్రమమే శాస్త్ర "విషయం".
సంబంధం-శాంతి సత్యాహింసాది సుగుణాలు అన్ని ఒక గొలుసులోని కడియాలువంటవి,ఇవి అన్ని పరస్పర సంబంధితాలు. వీటిని మెదడుతో తెలుసుకొని హృదయంతో భావనచేసి సంబంధం కలపాలి,అప్పుడు అదియే జీవాత్మ పరమాత్మ సంబంధం అవుతుంది ఇదియే శాస్త్ర "సంబంధం".
ప్రయోజనం(ఫలశృతి) ఈ నారద సూత్ర సూక్తులు శివానుశాసనంగా పార్వతీదేవ్యాది సురవర్యులు ఆచరించి ఇష్టకామ్యాలు పొంది శాశ్వతులు అయినారు.విశ్వాసం,శ్రద్ధ,అభ్యాసం,భక్తునికి సాధనోపాయాలు,ఈ పరమ భక్తిని పొందఁటయే చరమ పురుషార్థం.ఇది పంచమ పురుషార్థం.ఇది మోక్షముకంటే అధికమైనది.ఇది అందుకోవటమే మానవ జీవన పరమ "ప్రయోజనం"
నారద మహర్షివారి పాదారవిందములకు
No comments:
Post a Comment