Tuesday, December 17, 2024

 *`మనిషి జీవితం ఎలాంటిదంటే...`*

*మనది పేద, మిడిల్ క్లాస్ కుటుంబం అయినపుడు...*
*మన దగ్గర కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు లేనప్పుడు...*
*మనకు "రెక్కాడితే గానీ డొక్కాడని" పరిస్థితి ఉన్నపుడు...*
*ఇంట్లో భార్యపిల్లల అవసరాలు తీర్చలేక ఒక్కోసారి "దీనెమ్మ జీవితం, ఏం బతుకురా నాది" అనిపిస్తుంది.*
*బాగా డబ్బున్నోళ్లను చూసినపుడు ఒకింత ఈర్ష్య, అసూయ.*
*కానీ ఇలాంటి జీవితంలో చావు గురించి పెద్దగా భయముండదు.*
*పనిచేసి అలసిపోయి పడుకోగానే ప్రశాంతంగా నిద్రపడుతుంది. తెల్లవారినా ఇంకా కొంచెం సేపు పడుకోవాలని అనిపిస్తుంది. బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి సాధారణంగా ఉండవు.*

*నసీబు మారి.. కొన్నేళ్ల తర్వాత పుష్కలంగా డబ్బు సంపాదించి.. నాలుగు రకాల బిజినెస్సులూ, మంచి ఇల్లు, ఖరీదైన జీవితం, ఇంట్లో నలుగురు పనివాళ్ళు, లగ్జరీ కార్లు, జువెలరీ, ఓ పదీ ఇరవై రియల్ ఎస్టేట్ స్థలాలు,* *అపార్టుమెంట్ ఫ్లాట్లు వగైరా సమకూరిన తర్వాత...*

*ఇంకా బతకాలనే ఆశ.. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే బావుంటుందనే అత్యాశ మొదలవుతుంది.*
*చావంటే భయం మొదలవుతుంది.*
*"ఈ విలాసాలు, లగ్జరీలు, ఆస్తులు, భోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలే" అన్న బెంగ పట్టుకుంటుంది.*
*వయసు పెరుగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువవుతుంది.*
*ప్రశాంతంగా నిద్రపట్టదు. నిద్రమాత్రలు తప్పనిసరి.*
*తన ఆస్తుల గురించి నిమిష నిమిషం ఆలోచనలు.*
*ఎవడు ఎక్కడ మనల్ని మోసం చేసి దోచుకుంటాడో, ఎవడు మనకు ఎలాంటి హాని తలపెడతాడో అన్న టెన్షన్.*
*చీమ చిటుక్కుమన్నా ఉలికిపాటు.*
*"ప్రపంచంలో నేను అనుభవించాల్సిన లగ్జరీలు ఏమున్నాయ్, నేను చూడాల్సినవి ఏమున్నాయ్" అనే ఆలోచనలు.*
*ఆలోచించి ఆలోచించి బుర్ర పాడై మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. బీపీలు షుగర్లు చుట్టాల్లాగా వచ్చేస్తాయి. కానీ మళ్ళీ వెళ్లవు.*
*పైకి మాత్రం అందరిముందూ డబ్బున్న మారాజులా బతుకుతున్నా.. ఏదైనా చిన్న రిస్కు తీసుకోవాలంటే భయం. లోలోపల క్షణక్షణం భయం భయం.*

*కానీ ఒక్కటి మాత్రం నగ్నసత్యం. ఇష్టమున్నా లేకపోయినా ఒకరోజు మాత్రం ఈ లోకాన్ని వదిలి వెళ్లక తప్పదు.*

*అందుకే.. ఈ తాత్కాలిక ప్రపంచంలో డబ్బు అనే పదార్థమును బొత్తిగా కేర్ చేయకూడదు. అంటే.. బాగా సంపాదించకూడదని అర్థం కాదు. డబ్బే దైవంగా భావించకూడదు, పూజించకూడదు.*
*ముందుగా నేడు మనం ఎలాంటి లైఫ్ స్టేయిల్లో బతుకుతున్నామో దాంతో సంతృప్తి చెందాలి. నిరాశ, అసంతృప్తికి చోటివ్వకూడదు.*
*అయితే.. నిత్యం మన అభివృద్ధికి, మెరుగైన జీవితం కోసం కృషి చేస్తూనే ఉండాలి.*
*ఇవాళ మన దగ్గర ఎంత దుప్పటి ఉందో అంతే కాళ్ళు చాపాలి. కానీ పొడవైన, క్వాలిటీ దుప్పటి కొనడానికి బాగా ప్రయత్నించాలి, కష్టపడాలి.*
*మన నసీబులో ఎంత సంపాదిస్తే అంత డబ్బుతో సంతృప్తి చెందాలి.*
*డబ్బును కాపాడుకోవాల్సిందే.. కానీ అదేపనిగా డబ్బు, ఆస్తులపై మమకారం పెంచుకోకూడదు.*
*నిత్యం వాటి గురించే ఆలోచించకూడదు.*
*నష్టాలొచ్చినపుడు తీవ్రంగా మధనపడిపోకూడదు.*

*ఇలాంటి గుణాలు నేను రతన్ టాటా జీవితం చూశాను. వాళ్ళు వేల కోట్లు సంపాదించారు గానీ, డబ్బును ఎప్పుడూ కేర్ చేయలేదు, పూజించలేదు.*

Sekarana

No comments:

Post a Comment